ఫస్ట్, లాస్ట్ టెస్ట్‌లో కుక్ సెంచరీ పోజ్
లండన్ : భారత్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ అలిస్టర్ కుక్ అరుదైన గణంకాలను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌తో ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్న విషయం తెలిసిందే. అయితే భారత్‌పైనే అరంగేట్రం చేసిన కుక్ చివరి మ్యాచ్ కూడా అదే జట్టుతో ఆడటం విశేషం. అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగిన కుక్.. చివరి మ్యాచ్‌లోనూ సెంచరీ సాధించాడు. తద్వారా అరంగేట్ర, కెరీర్ చివరి టెస్టులోనూ సెంచరీ చేసిన ఐదో క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు.
గతంలో రెగీ డఫ్ (ఆస్ట్రేలియా), పోన్స్‌ఫర్డ్ (ఆస్ట్రేలియా), గ్రెగ్ చాపెల్ (ఆస్ట్రేలియా), అజహరుద్దీన్ (భారత్) ఈ ఘనతను సాధించారు. రెగీ డఫ్ 1902లో ఇంగ్లండ్‌పై అరంగేట్ర మ్యాచ్‌లో (32,104) పరుగులు చేశాడు. చివరి మ్యాచ్ అదే ఇంగ్లండ్‌పై 1905లో (146, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయలేదు) చేశాడు. బిల్ పోన్స్‌ఫర్డ్ 1924లో ఇంగ్లండ్‌పై అరంగేట్ర మ్యాచ్‌లో (110,27).. చివరి మ్యాచ్(1934)లో అదే ఇంగ్లండ్‌పై (266,22) పరుగులు సాధించాడు.
గ్రెగ్ చాపెల్ ఇంగ్లండ్‌పై (1970) అరంగేట్ర మ్యాచ్‌లో (108 పరుగులు, రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయలేదు).. చివరి మ్యాచ్(1984)లో పాకిస్తాన్‌పై (182, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయలేదు) పరుగులు చేశాడు. అజహరుద్దీన్ ఇంగ్లండ్‌పై అరంగేట్ర మ్యాచ్ (1984)లో (110, రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయలేదు).. లాస్ట్ మ్యాచ్(2000)లో దక్షిణాఫ్రికాపై (9,102) పరుగులు సాధించాడు.
ఇక 2006లో భారత్‌పై నాగ్‌పూర్‌లో తన తొలి టెస్ట్ ఆడిన కుక్ అందులోనూ (60,104 నాటౌట్), అర్ధశతకం, శతకం సాధించాడు. ఇప్పుడు చివరి మ్యాచ్‌లోనూ(71,147)లతో అదే గణంకాలను పునరావృతం చేశాడు. ఇలాంటి అరుదైన ఫీట్ నమోదు చేసిన ఏకైక క్రికెటర్ కుక్ ఒక్కడే కావడం గమనార్హం.
టాప్-5లో కుక్..
టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కుక్ (12,472) పరుగులతో ఐదో స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్‌గా కుక్ రికార్డు నెలకొల్పాడు. సంగక్కర (శ్రీలంక–12,400) పేరిట ఉన్న రికార్డును అతను తిరగరాశాడు. అత్యధిక పరుగుల జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 15921 తొలి స్థానంలో ఉండగా.. రికీ పాంటింగ్ (13378), జాక్వస్ కల్లీస్(13289), రాహుల్ ద్రవిడ్ (13288)లు కుక్ కన్నా ముందున్నారు.
‘‘గడిచిన ఈ నాలుగు రోజులు నిజమా.. కలనా అనిపిస్తోంది. ఇక్కడున్న నా స్నేహితులు కొంత మంది గత నాలుగురోజులుగా నన్ను ట్రీట్ చేసిన విధానం అత్యద్భుతం. ఇక నా బ్యాటింగ్ చివరి ఓవర్స్‌లో నా అభిమానుల పాటలు చాలా ప్రత్యేకం’’ - అలిస్టర్ కుక్
Comments
Please login to add a commentAdd a comment