ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హాక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2023 వరల్డ్‌కప్ తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి వైదొలుగుతానని తెలిపాడు. గాయాల బారిన పడకుండా కెరీర్‌ను ప్రొలాంగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. వన్డేలకు గుడ్‌బై చెప్పినా పొట్టి క్రికెట్‌కు అందుబాటులో ఉంటానని అన్నాడు. 2016లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన నవీన్ 2021లో తన చివరి వన్డే ఆడాడు. కెరీర్‌లో కేవలం 7 వన్డేలు మాత్రమే ఆడిన నవీన్.. 24 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.
నవీన్ తన వన్డే కెరీర్‌లో 14 వికెట్లు పడగొట్టాడు. అతని అత్యుత్తమ గణాంకాలు 4/42గా ఉన్నాయి. నవీన్ ఐపీఎల్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ ఫ్రాంచైజీ లీగ్‌ల్లో పాల్గొంటున్నాడు. ఐపీఎల్ 2023లో కోహ్లితో గొడవతో నవీన్ ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టులో రషీద్ ఖాన్ తర్వాత అంతటి పాపులారిటీ ఉన్న నవీన్ ఫ్రాంచైజీ క్రికెట్ కోసం తన అంతర్జాతీయ కెరీర్‌ను వదులుకున్నాడు.
ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్ జట్టు తమ రెండో వరల్డ్‌కప్ ఆడేందుకు నిన్ననే భారత్‌కు వచ్చింది. వార్మప్ గేమ్ కోసం ఆఫ్ఘన్ క్రికెటర్లు త్రివేండ్రంలో ల్యాండయ్యారు. తమ తొలి వరల్డ్‌కప్‌లో (2019) లీగ్ స్టేజ్ దాటలేని ఆఫ్ఘన్ టీమ్ ఈసారి అగ్రశ్రేణి జట్లకు షాక్ ఇచ్చి సంచలనాలు క్రియేట్ చేయాలని భావిస్తుంది. ఆఫ్ఘన్ జట్టులో నవీన్, రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ. రహ్మానుల్లా గుర్బాజ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ లాంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. వీరితో ఈ వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ సంచనాలు సృష్టించే అవకాశం ఉంది. వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 7న ఆడుతుంది. ధర్మశాల వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో వారు బంగ్లాదేశ్‌ను ఢీకొంటారు. దీని ముందు వారు రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడతారు. సెప్టెంబర్ 29న సౌతాఫ్రికాతో, అక్టోబర్ 3న శ్రీలంకతో ఆఫ్ఘన్లు తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment