అక్టోబర్ 5 నుంచి భారత్‌లో జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యుల ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ఇవాళ (సెప్టెంబర్ 13) ప్రకటించింది. ఈ జట్టుకు హస్మతుల్లా షాహీది నాయకత్వం వహించనుండగా.. రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్ ఉల్ హాక్, నూర్ అహ్మద్ లాంటి స్టార్ ప్లేయర్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. వరల్డ్‌కప్ కోసం ఆఫ్ఘన్ సెలెక్టర్లు ముగ్గురు రిజర్వ్ ప్లేయర్లను కూడా ఎంపిక చేశారు. గుల్బదిన్ నైబ్, షరాఫుద్దీన్ అష్రాఫ్, ఫరీద్ అహ్మద్ మలిక్‌లు వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ రిజర్వ్ ప్లేయర్లుగా ఉండనున్నారు. రెగ్యులర్ సభ్యుల్లో ఎవరైనా గాయాల బారిన పడితే వారి స్థానంలో వీరు జట్టులో చేరతారు.
రీఎంట్రీ ఇచ్చిన నవీన్ ఉల్ హాక్..
గత ఐపీఎల్‌లో విరాట్ కోహ్లితో గొడవ కారణంగా భారత క్రికెట్ అభిమానుల దృష్టిలో విలన్‌లా మారిపోయిన నవీన్ ఉల్ హాక్‌ను ఆఫ్ఘనిస్తాన్ సెలెక్టర్లు వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్-2023 కోసం ప్రకటించిన జట్టుకు నవీన్‌ను ఎంపిక చేయకపోవడంతో, భారత్‌లో జరిగే వరల్డ్‌కప్‌లో కూడా అతనికి ఛాన్స్ ఉండదని అంతా అనుకున్నారు. అయితే, ఆఫ్ఘన్ సెలెక్టర్లు నవీన్‌కు భారత్‌లో ఆడిన అనుభవం ఉండటాన్ని పరిగణలోకి అతనికి జట్టులో చోటు ఇచ్చారు. కాగా, కోహ్లితో ఉన్న విభేదాల కారణంగా నవీన్‌ను ఆఫ్ఘనిస్తాన్ సెలెక్టర్లు పక్కకు పెడతారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
వన్డే వరల్డ్‌కప్-2023 కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు: హస్మతుల్లా షాహీది (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, రషీద్ ఖాన్, అబ్దుల్ రెహ్మాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హాక్, ఫజల్ హాక్ ఫారూఖీ
రిజర్వ్ ప్లేయర్లు.. గుల్బదిన్ నైబ్, షరాఫుద్దీన్ అష్రాఫ్, ఫరీద్ అహ్మద్ మలిక్
Comments
Please login to add a commentAdd a comment