కరాచీ: పాకిస్తాన్ మహిళల క్రికెట్‌లో స్టార్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన మాజీ కెప్టెన్ సనా మీర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంది. తన 15 ఏళ్ల కెరీర్‌లో 34 ఏళ్ల సనా మీర్ పాకిస్తాన్ తరఫున 120 వన్డేలు, 106 టి20 మ్యాచ్‌లు ఆడింది. 2009 నుంచి 2017 మధ్య 137 మ్యాచ్‌ల్లో ఆమె పాక్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. ‘రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయంగా నేనే భావిస్తున్నాను. నా క్రికెట్ ప్రయాణంలో అండగా నిలిచిన జట్టు సభ్యులకు, ప్రేక్షకులకు నా ధన్యవాదాలు’ అని సనా తెలిపింది. వన్డేల్లో 1,630 పరుగులు చేసిన ఆమె 151 వికెట్లు కూడా తీసింది. తద్వారా పాక్ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. ఇక టి20 ఫార్మాట్‌లో 802 పరుగులు సాధించిన ఆమె 89 వికెట్లు పడగొట్టింది.
Comments
Please login to add a commentAdd a comment