న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు, దిగ్గజ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 20 ఏళ్లుగా తన క్రికెట్ ప్రయాణం అద్భుతంగా సాగిందని, ఈ క్రమంలో తనకు సహకరించి తోడుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు అంటూ మంగళవారం ట్వీట్ చేశాడు.
Announcement. pic.twitter.com/ZvOoeFkp8w
— Dale Steyn (@DaleSteyn62) August 31, 2021
38 ఏళ్ల స్టెయిన్ తన కెరీర్‌లో 93 టెస్ట్‌లు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడి మొత్తం 699 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రొటిస్ ఫాస్ట్ బౌలర్.. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున 95 మ్యాచ్‌ల్లో 97 వికెట్లు పడగొట్టాడు. కాగా, స్టెయిన్ ఈ ఏడాది జనవరిలో ఐపీఎల్ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. అయితే, విదేశీ లీగ్‌లకు మాత్రం అందుబాటులో ఉంటానని ప్రకటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
చదవండి: తాలిబన్లను పొగిడిన పాక్ క్రికెటర్‌పై నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు
Comments
Please login to add a commentAdd a comment