ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్‌ అతడే: కేఎల్‌ రాహుల్‌ | Not Jasprit Bumrah, KL Rahul Picks Ex Pacer As Best Bowler In The World, Check Out The Details Inside | Sakshi
Sakshi News home page

బుమ్రా కాదు!.. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్‌ అతడే: కేఎల్‌ రాహుల్‌

Published Tue, Sep 10 2024 3:50 PM | Last Updated on Tue, Sep 10 2024 6:33 PM

Not Bumrah KL Rahul Picks Ex Pacer As Best Bowler In The World

శ్రీలంకతో వన్డే సిరీస్‌ తర్వాత దులిప్‌ ట్రోఫీ-2024 బరిలో దిగిన కేఎల్‌ రాహుల్‌ ఆకట్టుకునే ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇండియా-‘ఎ’ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఈ కర్ణాటక బ్యాటర్‌.. ఇండియా-‘బి’తో మ్యాచ్‌లో వరుసగా 37, 57 పరుగులు చేశాడు. అయితే, కేఎల్‌ రాహుల్‌ మినహా మిగతా బ్యాటర్లెవరూ రాణించకపోవడంతో ఈ మ్యాచ్‌లో ఇండియా-‘ఎ’ జట్టుకు ఓటమి తప్పలేదు.

తదుపరి టెస్టు సిరీస్‌తో బిజీ
బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా-‘బి’ చేతిలో ఇండియా- ‘ఎ’ 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో అర్ధ శతకంతో సత్తా చాటిన కేఎల్‌ రాహుల్‌ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు ఎంపికయ్యాడు. సొంతగడ్డ మీద సెప్టెంబరు 19 నుంచి మొదలుకానున్న మ్యాచ్‌లో అతడు భాగం కానున్నాడు. తాజా ఫామ్‌ దృష్ట్యా తుదిజట్టులోనూ ఈ వికెట్‌ కీపర్‌కు చోటు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నంబర్‌ వన్‌ అతడే
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇండియా-‘ఎ’ జట్టును వీడిన కేఎల్ రాహుల్‌ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు సన్నద్ధమయ్యే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ప్రపంచంలోని టాప్‌-5 బ్యాటర్లను ఎంచుకోమని యూట్యూబర్‌ కోరగా.. విరాట్‌ కోహ్లికి అగ్రస్థానమిచ్చిన రాహుల్‌.. ఆ తర్వాతి స్థానాలకు వరుసగా రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, బాబర్‌ ఆజం, ట్రవిస్‌ హెడ్‌ను ఎంపిక చేసుకున్నాడు.

అత్యుత్తమ బౌలర్‌ ఎవరంటే?
ఇక ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్‌ ఎవరంటూ సదరు యూట్యూబర్‌ ఆప్షన్లు ఇవ్వగా రాహుల్‌.. సౌతాఫ్రికా దిగ్గజ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ పేరు చెప్పాడు. ఇంగ్లండ్‌ దిగ్గజ ఫాస్ట్‌బౌలర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌కు రెండో ర్యాంకు ఇచ్చిన రాహుల్‌.. టీమిండియా పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రాకు మూడు, అఫ్గనిస్తాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌కు నాలుగు, పాకిస్తాన్‌ యువ పేసర్‌ నసీం షా కు ఐదో ర్యాంకు ఇచ్చాడు.

కాగా ప్రపంచంలోని నవతరం ఫాస్ట్‌బౌలర్లలో ప్రత్యేకమైన శైలితో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బుమ్రాను కాదని కేఎల్‌ రాహుల్‌ స్టెయిన్‌ పేరు చెప్పడం అతడి అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. అయితే, ఇక్కడ ఓ ట్విస్ట్‌ ఉంది. సదరు యూట్యూబర్‌ తానే ఆప్షన్లు ఇచ్చి రాహుల్‌ను పేర్లు ఎంచుకోమని చెప్పాడు. 

కాబట్టి.. ‘‘అతడి లిస్టులో బుమ్రా పేరు ఉందో లేదో రాహుల్‌కు తెలియదు. అందుకే అతడు స్టెయిన్‌ను ఎంచుకుని ఉండవచ్చు’’ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా క్లాసీ రాహుల్‌ ఎంతో క్లాస్‌గా సమాధానాలు ఇచ్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: Ind vs Ban T20Is: టీమిండియాకు శుభవార్త

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement