south africa cricketer
-
రగ్బీ ప్లేయర్ నుంచి క్రికెటర్ దాకా.. ఆసక్తికర ప్రయాణం
కగిసో రబాడా.. దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్‌గా అందరికి సుపరిచితమే. తన ఫాస్ట్ బౌలింగ్‌తో జట్టును ఎన్నోసార్లు గెలిపించి కీలక బౌలర్‌గా ఎదిగాడు. మంచి వేగంతో బంతులు సంధించే రబాడ దెబ్బకు ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించడంలో దిట్ట. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున తొలి మ్యాచ్ ఆడాడు. గురువారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రబాడా ఐపీఎల్లో వందో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. సాహా వికెట్ తీయడం ద్వారా రబాడ ఈ మార్క్‌ను అందుకున్నాడు. అయితే రబాడా క్రికెటర్ కాకపోయుంటే రగ్బీ ప్లేయర్ అయ్యేవాడంట. అతని గురించి మనకు తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. రగ్బీతో కెరీర్ మొదలుపెట్టి ఆపై క్రికెటర్‌గా.. కగిసో రబాడా మొదట రగ్బీలో కెరీర్‌ను కొనసాగించాలనుకున్నాడు. కానీ అతను తన మొదటి ప్రేమను అంటే రగ్బీని వదులుకోవాల్సి వచ్చింది. రగ్బీ ప్లేయర్ నుంచి కగిసో రబాడా క్రికెటర్‌గా మారిన కథ చాలా ఆసక్తికరంగా ఉంది. రబాడాకు చిన్నప్పటి నుంచి రగ్బీ అంటే ఆసక్తి. అతను పాఠశాల జట్టుతో రగ్బీ ఆడేవాడు. కానీ ఒక్కసారి ఆఫ్ సీజన్ కారణంగా సరదాగా క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. తర్వాత ఎ లెవల్ క్రికెట్ టీమ్‌లోనూ, రగ్బీ టీమ్‌లోనూ చోటు దక్కించుకోలేకపోయాడు. అందుకే ఈ ఆటగాడు రగ్బీని వదిలి క్రికెటర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు మే 25, 1995న జోహన్నెస్‌బర్గ్‌లో జన్మించిన రబాడా 2013లో దేశవాళీ క్రికెట్లో ఆడడం ప్రారంభించాడు. మరుసటి సంవత్సరం అంటే 2014లో అండర్-19 ప్రపంచకప్ జట్టులోకి ఎంపికయ్యాడు. తన ప్రతిభను ప్రదర్శించేందుకు రబడకు ఇది పెద్ద వేదికగా మారింది. అండర్-19 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో తన స్పీడ్ మ్యాజిక్‌ను చూపించాడు. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై రబాడా 25 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఆ సంవత్సరం ప్రొటీస్ జట్టును ప్రపంచ ఛాంపియన్‌గా చేయడంలో కీ రోల్ ప్లే చేశాడు. Photo: IPL Twitter తండ్రి డాక్టర్, తల్లి లాయర్ దీంతో.. కగిసో రబాడాకి ఆర్థికంగా ఇబ్బందులు లేవు. తల్లిదండ్రుల నుంచి పూర్తి సహకారం లభించింది. అండర్-19 టి20 ప్రపంచకప్ తర్వాత అతను విజయాల మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు. ఈ టాల్ ఫాస్ట్ బౌలర్ 2014లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 19 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియాతో తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన రబాడా అరంగేట్రం టీ20లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. Photo: IPL Twitter టి20 అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఒక సంవత్సరం తర్వాత 2015లో రబాడా తన వన్డే అరంగేట్రం చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో.. రబాడా 3 మెయిడిన్లు బౌలింగ్ వేసి 8 ఓవర్లలో హ్యాట్రిక్ సహా 6 వికెట్లు పడగొట్టాడు. ఇక కగిసో రబడ ఐపీఎల్ లో 2022 సంవత్సరంలో 13 మ్యాచ్‌లలో 23 వికెట్లు తీయగా, 2021 సంవత్సరంలో 15 వికెట్లు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో రబడ అత్యుత్తమ ప్రదర్శన 2020లో వచ్చింది. ఈ సీజన్ లో 17 మ్యాచ్‌ల్లో 30 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా 64 మ్యాచ్‌ల్లో వంద వికెట్లు తీశాడు. -
అంతర్జాతీయ క్రికెట్‌కు సీనియర్ ఆల్‌రౌండర్ గుడ్‌బై
దక్షిణాఫ్రికా సీనియర్ ఆల్‌రౌండర్ ఫర్హాన్ బెహర్దీన్ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2008 నుంచి 2018 వరకు వైట్‌బాల్ క్రికెట్(వన్డే, టి20లు)లో సేవలందించిన బెహర్దీన్ 39 ఏళ్ల వయసులో ఆటకు గుడ్‌బై చెప్పాడు. 2004లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన బెహర్దీన్.. సౌతాఫ్రికా తరపున తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు ఎనిమిదేళ్లు నిరీక్షించాడు. అయితే 2012లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన బెహర్దీన్ ఆ తర్వాత ఆరేళ్ల పాటు దక్షిణాఫ్రికా జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగాడు. పరిమిత ఓవర్లో స్పెషలిస్ట్ క్రికెటర్‌గా ముద్రపడిన బెహర్దీన్ ప్రొటీస్ తరపున 59 వన్డేలు, 38 టి20 మ్యాచ్‌లు ఆడాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన బెహర్దీన్ వన్డేల్లో 1074 పరుగులతో పాటు 14 వికెట్లు, టి20ల్లో 518 పరుగులతో పాటు మూడు వికెట్లు తీశాడు. ఇక సౌతాఫ్రికా తరపున బెహర్దీన్ నాలుగు మేజర్ ఐసీసీ టోర్నీలు ఆడడం విశేషం. అందులో మూడు టి20 వరల్డ్‌కప్‌లు(2012, 2014,2016).. 2015 వన్డే వరల్డ్‌కప్ ఉన్నాయి. 2018లో ఆస్ట్రేలియాతో జరిగిన టి20 మ్యాచ్ బెహర్దీన్ కెరీర్లో చివరిది. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన బెహర్దీన్.. అవకాశాలు లేక తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా బెహర్దీన్ తన ట్విటర్ వేదికగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఎమోషనల్ అయ్యాడు. ''18 ఏళ్ల లాంగ్ కెరీర్ ముగిసింది. అన్ని ఫార్మాట్లు కలిపి 560కి పైగా మ్యాచ్‌లు ఆడాను. దేశం తరపున 97 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా. నా కేబినెట్లో 17 ట్రోఫీలు ఉన్నాయి. ఇక సౌతాఫ్రికా తరపున నాలుగు మేజర్ ఐసీసీ టోర్నీలు ఆడడం అదృష్టం. ఇన్నాళ్లు నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా'' అంటూ పేర్కొన్నాడు. pic.twitter.com/PN0PCWzAKA — Farhaan Behardien (@fudgie11) December 27, 2022 చదవండి: ఒలింపిక్ మాజీ స్విమ్మర్‌కు 12 ఏళ్ల జైలుశిక్ష Virat Kohli: కోహ్లి తప్పుకున్నాడు సరే.. రోహిత్, రాహుల్ సంగతేంటి? -
25 ఏళ్ల క్రితం గొడవ.. ద్రవిడ్‌కు అలెన్ డొనాల్డ్ క్షమాపణ
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ అలెన్ డొనాల్డ్ .. టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు క్షమాపణ చెప్పాడు. ప్రస్తుతం టీమిండియా బంగ్లా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. వన్డే సిరీస్ ముగించుకొని టెస్టు సిరీస్ ఆడుతుంది. కాగా బంగ్లాదేశ్‌కు అలెన్ డొనాల్డ్ బౌలింగ్ కోచ్‌గా ఉన్న సంగతి చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో అలెన్ డొనాల్డ్ ద్రవిడ్‌ను క్షమాపణ కోరాడు. అదేంటి ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా అనే సందేహం రావొచ్చు. అవును ఇద్దరి మధ్య గొడవ జరిగింది.. కానీ ఇప్పుడు కాదు.. 25 సంవత్సరాల క్రితం. మీరు విన్నది నిజమే. 25 సంవత్సరాల క్రితం జరిగిన గొడవకు అలెన్ డొనాల్డ్ ఇప్పుడు ద్రవిడ్‌కు క్షమాపణ చెప్పాడు కాబట్టే ఆసక్తి సంతరించుకుంది. ద్రవిడ్‌కు క్షమాపణ చెప్పడమే కాదు డిన్నర్ కూడా ఆహ్వానించాడు అలెన్ డొనాల్డ్. "డర్బన్‌లో జరిగిన ఆ ఘటన గురించి నేను మాట్లాడను. ద్రవిడ్, సచిన్ మా బౌలర్లను బాదేస్తున్నారు. ఆ సమయంలో నేను కాస్త లైన్ దాటాను. ద్రవిడ్‌పై నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది. ఆ రోజు జరిగిన దానికి నేను మరోసారి ద్రవిడ్‌కు సారీ చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు ఏదో అన్నాను. నిజానికి దాని వల్లే అతని వికెట్ కూడా పడింది. కానీ ఆరోజు నేను అన్నదానికి క్షమాపణ కోరుతున్నాను. ద్రవిడ్ ఓ అద్భతమైన వ్యక్తి. రాహుల్ నేను చెప్పేది నువ్వు వింటూ ఉంటే.. నాతో డిన్నర్‌కు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను" అని డొనాల్డ్ అన్నాడు. ఈ వీడియోను ఓ ఇంటర్వ్యూలో భాగంగా ద్రవిడ్ చూశాడు. డొనాల్డ్ సారీ చెప్పడంపై ముసిముసిగా నవ్వాడు. అంతేకాదు అతని ఆహ్వానాన్ని కూడా మన్నించాడు. "కచ్చితంగా వెళ్తాను. దాని కోసం ఎదురు చూస్తున్నాను. ముఖ్యంగా బిల్లు అతడు కడతానంటే ఎందుకు వద్దంటాను" అని ద్రవిడ్ నవ్వుతూ చెప్పాడు. మరి 25 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఇప్పడు తెలుసుకుందాం. 1997లో ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో ద్రవిడ్‌పై డొనాల్డ్ నోరు పారేసుకున్నాడు. తాను ఆడే రోజుల్లో తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించడంతోపాటు నోటికి పని చెబుతూ కూడా డొనాల్డ్ భయపెట్టేవాడు.ఎంతో సౌమ్యుడిగా పేరున్న ద్రవిడ్‌ను కూడా డొనాల్డ్ వదల్లేదు. ఆ మ్యాచ్‌లో సచిన్, ద్రవిడ్ సౌతాఫ్రికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు సాధిస్తుండటంతో ఏం చేయాలో తెలియక తాను నోరు పారేసుకున్నానని డొనాల్డ్ ఇప్పుడు చెప్పాడు. అంతేకాదు ద్రవిడ్‌కు సారీ కూడా చెప్పడం విశేషం. అప్పట్లో ముక్కోణపు సిరీస్ ఫైనల్లో ఇండియా, సౌతాఫ్రికా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 278 రన్స్ చేసింది. కిర్‌స్టన్, కలినన్ హాఫ్ సెంచరీలు చేశారు. అయితే తర్వాత వర్షం కురవడంతో ఇండియా టార్గెట్‌ను 40 ఓవర్లలో 252 రన్స్‌గా నిర్ణయించారు. ఈ మ్యాచ్‌లో ద్రవిడ్ 94 బాల్స్‌లో 84 రన్స్ చేసినా.. ఇండియా లక్ష్యానికి 17 పరుగుల దూరంలో ఆగిపోయింది. చదవండి: పేరుకు మాత్రమే అమెరికా.. జట్టు మొత్తం మనోళ్లే కోహ్లి సైగ చేశాడు.. సిరాజ్ అనుకరించాడు; ఒళ్లు మండినట్టుంది -
రిషబ్ శెట్టిని కలిసిన లెజెండరీ క్రికెటర్.. సోషల్ మీడియాలో వైరల్
రిషబ్‌శెట్టి దర్శకుడిగా, హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ 'కాంతారా'. ఈ చిత్రం అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ మూవీ సక్సెస్‌తో రిషబ్ ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. తాజాగా రిషబ్ శెట్టిని దక్షిణాఫ్రికా లెజెండ్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ బెంగళూరులో కలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరలవుతోంది. (చదవండి: కాంతార మరో రికార్డ్.. కార్తికేయ-2ను అధిగమించి..!) రిషబ్ శెట్టి తన ఇన్‌స్టాలో ఓ వీడియోను పంచుకున్నారు. అందులో దక్షిణాఫ్రికా లెజెండ్ డివిలియర్స్, రిషబ్ కలిసి కాంతార అంటూ గట్టి అరుస్తూ కనిపించారు. రిషబ్ ఇన్‌స్టాలో రాస్తూ..' ఇది ఒక మ్యాచ్! ఈ రోజు నిజమైన 360ని కలుసుకున్నాను. మా బెంగళూరికి మళ్లీ తిరిగి వచ్చాడు..' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. వీరిద్దరి సమావేశంపై అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఓ అభిమాని స్పందిస్తూ 'టూ స్టార్స్' అంటూ వ్యాఖ్యానించారు. మరో అభిమాని 'ఇద్దరు లెజెండ్స్ వావ్' అని రాసుకొచ్చారు. కాంతార చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, హీరోగా నటించారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్, చలువే గౌడ నిర్మించిన ఈ చిత్రంలో సప్తమి గౌడ, కిషోర్ కుమార్ జి కూడా కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
చిన్నారి మరణం.. శోకసంద్రంలో డేవిడ్ మిల్లర్!
సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్యాన్సర్‌తో పోరాడుతూ శనివారం మరణించిన చిన్నారితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మిల్లర్ ఒక వీడియోనూ షేర్ చేశాడు.'' మై లిటిల్ రాక్‌స్టార్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. అయితే చనిపోయిన ఆ చిన్నారి డేవిడ్ మిల్లర్ కూతురేనంటూ వార్తలు వస్తున్నాయి. క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించిందని కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. వాస్తవానికి ఆ చిన్నారి డేవిడ్ మిల్లర్ కూతురు కాదని.. అతడి స్నేహితుడి కూతురు అని మరికొందరు పేర్కొన్నారు. ట్విటర్లోనూ ఒక అభిమాని ఇదే అంశంపై స్పందిస్తూ.. ''చనిపోయింది డేవిడ్ మిల్లర్ కూతురు కాదని.. ఆమె అతడి క్లోజ్ ఫ్రెండ్ కూతురు'' అని ట్వీట్ చేశాడు. అయితే ఆ చిన్నారి మిల్లర్‌కి వీరాభిమాని కావడం.. పాపతో ఉన్న అనుబంధం కారణంగా డేవిడ్ అతను ఎమోషన్‌కు గురయ్యాడని తెలుస్తోంది. టీమిండియాతో వన్డే సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం డేవిడ్ మిల్లర్ ఇక్కడే ఉన్నాడు. ఒకవేళ చనిపోయింది తన కూతురు అయితే సౌతాఫ్రికాకు తిరుగు ప్రయాణమవుతున్న విషయాన్ని కచ్చితంగా చెప్పేవాడు. కానీ అలాంటి ప్రకటన ఏదీ రాలేదు కనుక ఆ చిన్నారి డేవిడ్ మిల్లర్ కూతురు కాకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా క్యాన్సర్‌తో పోరాడుతూ తనువు చాలించిన చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని మనం దేవుడిని కోరుకుందాం. ఇక కిల్లర్ మిల్లర్‌గా పేరు పొందిన డేవిడ్ మిల్లర్ ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. టి20 సిరీస్‌ను టీమిండియాకు కోల్పోయినప్పటికి ఆఖరి టి20లో మెరుపు సెంచరీతో అదరగొట్టిన మిల్లర్.. అదే ఫామ్‌ను తొలి వన్డేలోనూ చూపెట్టాడు. ఇక రాంచీలో ఇవాళ భారత్-సఫారీల మధ్య రెండో వన్డే జరగాల్సి ఉంది. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా విజయం సాధించి సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. కాగా మిల్లర్ పెట్టిన పోస్టుతో సౌతాఫ్రికా జట్టులో విషాద ఛాయలు అలముకున్నాయి. View this post on Instagram A post shared by Dave Miller (@davidmillersa12) One of David Miller's biggest fan, Ane passed away. She was close to Miller. Stay strong, @DavidMillerSA12! pic.twitter.com/4ogIbfzQlm — Mufaddal Vohra (@mufaddal_vohra) October 8, 2022 చదవండి: నిమిషం ఆగి ఉంటే వేరుగా ఉండేది.. ఊహించని ట్విస్ట్ -
'మరో మూడు వారాల్లో పూర్తిగా తెలుసుకుంటారు'
సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్.. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఆటబయోగ్రఫీ త్వరలోనే విడుదల కానుంది. ''ఫాఫ్: థ్రూ ఫైర్(Faf: Through Fire)'' పేరిట ఆటోబయోగ్రఫీ అక్టోబర్ 28న బుక్ రిలీజ్ జరగనుంది. ఈ సందర్భంగా డుప్లెసిస్ తన జీవితచరిత్ర గురించి ట్విటర్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''ఒక క్రికెటర్‌గా మాత్రమే మీకు తెలుసు. నేనొక మూసిన పుస్తకాన్ని. ఇన్నాళ్లుగా క్రికెట్ ఆడుతున్నప్పటికి ఒక్కసారి కూడా నా జీవితం, క్రికెట్ లైఫ్ గురించి నాకు తెలిసినవాళ్లకు తప్ప ఎక్కడా బయటపెట్టలేదు. మరో మూడు వారాల్లో నా జీవితం గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది. 'Faf: Through Fire'.. నా స్వీయ చరిత్ర మిమ్మల్ని ఆకట్టుకుంటుంది'' అంటూ ముగించాడు. ఇక డుప్లెసిస్ సౌతాఫ్రికా తరపున విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా పేరు పొందాడు. కెప్టెన్‌గా డుప్లెసిస్ విన్నింగ్ పర్సంటేజ్ 73.68 శాతం ఉండడం విశేషం. సౌతాఫ్రికా తరపున అన్ని ఫార్మాట్లలో ఆల్‌టైమ్ బ్యాటర్‌గా గుర్తింపు పొందిన డుప్లెసిస్ 2011లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. సౌతాఫ్రికా తరపున డుప్లెసిస్ 69 టెస్టుల్లో 4,163 పరుగులు, 143 వన్డేల్లో 5,507 పరుగులు, 50 టి20ల్లో 1528 పరుగులు సాధించాడు. డుప్లెసిస్ ఖాతాలో టెస్టుల్లో 10 సెంచరీలు, వన్డేల్లో 12 సెంచరీలు, టి20ల్లో సెంచరీ ఉన్నాయి. సౌతాఫ్రికా తరపున మూడు ఫార్మాట్లలో(టెస్టు, వన్డే, టి20) సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా డుప్లెసిస్ రికార్డులకెక్కాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి పెట్టేందుకు డుప్లెసిస్ 2021లో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అయితే సరైన ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న డుప్లెసిస్ అక్టోబర్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు జట్టులో చోటు దక్కలేదు. ఇక టెంబా బవుమా కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా టి20 ప్రపంచకప్‌లో గ్రూఫ్-2లో పాకిస్తాన్, టీమిండియా, బంగ్లాదేశ్‌తో పాటు క్వాలిఫయింగ్ జట్లతో మ్యాచ్‌లు ఆడనుంది. I’ve always been a closed book. I haven’t really shared my journey through life and cricket with the people outside of my circle. In three weeks, you will get to be a part of my circle. Pre-order here 👇https://t.co/J9cpr3Gi2Nhttps://t.co/FujCqdIuJy#ThroughFire #ComingSoon pic.twitter.com/rUggbyc0bj — Faf Du Plessis (@faf1307) October 7, 2022 చదవండి: 'ఇంజనీర్లు చాలా మంది ఉన్నారు.. ఫాస్ట్ బౌలర్ అవ్వు' -
సిక్సర్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించిన ప్రొటిస్ బ్యాటర్
సౌతాఫ్రికా యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ హండ్రెడ్ టోర్నమెంట్లో భాగంగా ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. క్రీజులో ఉన్నది కాసేపే అయినా వరుస సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అతని ఇన్నింగ్స్ ధాటికి మాంచెస్టర్ ఒరిజినల్స్ భారీ స్కోరు సాధించింది. మాంచెస్టర్ ఇన్నింగ్స్‌లో 76 బంతుల వరకు ఒక్క సిక్సర్ కూడా రాలేదు. ఈ దశలో స్టబ్స్ తబ్రెయిజ్ షంసీ బౌలింగ్‌లో వరుసగా నాలుగు బంతులను సిక్సర్లు బాదాడు. అలా 10 బంతుల్లో 27 పరుగుల చేసి ఔటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ ఒరిజినల్స్ 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. సాల్ట్ 46 బంతుల్లో 70 నాటౌట్, జాస్ బట్లర్ 41 పరుగులు రాణించగా.. చివర్లో స్టబ్స్ 10 బంతుల్లో 4 సిక్సర్లతో 27 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ 94 బంతుల్లో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. డేవిడ్ మలాన్(44 బంతుల్లో 98 నాటౌట్, 3 ఫోర్లు, 9 సిక్సర్లు) దాటిగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా.. అలెక్స్ హేల్స్ 38, టామ్ కోహ్లెర్ 30 పరుగులు చేశారు. GIF Of MI Original Blood Tristan Stubbs 4 Balls 4 Sixes . A Thread (1/1) pic.twitter.com/3Docwv798I — Prof. Boies Pilled Bell 🪄 (@Lil_Boies45) August 13, 2022 2/2 pic.twitter.com/3VlWEo2aLd — Prof. Boies Pilled Bell 🪄 (@Lil_Boies45) August 13, 2022 4/4 pic.twitter.com/kNQM67jG9g — Prof. Boies Pilled Bell 🪄 (@Lil_Boies45) August 13, 2022 -
'కిల్లర్' మిల్లర్ అనగానే ఆ ఎపిక్ ఎంట్రీ గుర్తుకురావడం ఖాయం
సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ మిల్లర్ ఇవాళ(జూన్ 10న) 33వ పుట్టిరోజు జరుపుకుంటున్నాడు. కిల్లర్ మిల్లర్‌గా గుర్తింపు పొందిన ఈ విధ్వంసకర బ్యాటర్ లేటు వయసులో అదరగొడుతున్నాడు. అయితే మిల్లర్ అనగానే గుర్తుకువచ్చేది 2015 వన్డే వరల్డ్‌కప్‌లో అతనిచ్చిన ఎపిక్ ఎంట్రీ అభిమానుల కళ్ల ముందు కదలాడుతుంది. ఆ వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఒక మ్యాచ్‌లో బ్యాటింగ్ రావడానికి సిద్ధమైన మిల్లర్ స్ట్రెయిట్‌గా కాకుండా బౌండీరీ లైన్‌పై నుంచి డైవ్ చేస్తూ గ్రౌండ్లోకి అడుగుపెట్టడం ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించిన ఫోటో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మిల్లర్‌ను డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌తో పోలుస్తూ.. మిల్లర్‌లో ఈరోజు క్రికెటర్ కాకుండా రెజ్లింగ్ స్టార్ కనిపిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేశారు. అయితే మిల్లర్ ఇలా ఎందుకు చేశాడా అన్నది తెలియనప్పటికి.. బహుశా తొందరగా గ్రౌండ్లో అడుగుపెట్టాలనే ఉద్దేశంతో ఇలా చేసి ఉంటాడని క్రికెట్ కామెంటేటర్స్ సహా అభిమానులు అప్పట్లో చెవులు కొరుక్కున్నారు. ఇప్పటికి మిల్లర్ అనగానే టక్కున గుర్తుకువచ్చేది ఆ ఎపిక్ ఎంట్రీనే. ఇక మిల్లర్ అంతర్జాతీయ క్రికెట్లో చాలాకాలం క్రితమే(2010లో) ఎంట్రీ ఇచ్చినప్పటికి మొదట్లో అవకాశాలు ఎక్కువగా రాలేదు. దానికి కారణం లేకపోలేదు. మిల్లర్ జట్టులోకి వచ్చే సమయానికి దక్షిణాఫ్రికాలో చాలా మంది సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన అతను వెలుగులోకి రావడానికి ఐదేళ్లు పట్టింది. అది 2015 వన్డే వరల్డ్ కప్. ఆ వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా సెమీఫైనల్‌కు చేరడంలో మిల్లర్ పాత్ర చాలా కీలకమనే చెప్పొచ్చు. ఆ వరల్డ్‌కప్‌లో మిల్లర్ 324 పరుగులు సాధించాడు. కాగా 2015 ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో మిల్లర్, జేపీ డుమినితో కలిసి ఐదో వికెట్‌కు 256 పరుగులు జోడించాడు. వన్డే చరిత్రలో ఐదో వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించిన జంటగా మిల్లర్, డుమినీ పేరిట ఉన్న రికార్డు ఇప్పటికి చెక్కు చెదరలేదు. ఆ తర్వాత రెగ్యులర్ సభ్యుడిగా ప్రమోషన్ పొందిన మిల్లర్ ప్రస్తుతం సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో కీలక ఆటగాడిగా మారాడు. ఇక గురువారం రాత్రి టీమిండియాతో జరిగిన టి20 మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్యం కళ్ల ముందు కనబడుతున్నా.. ఏ మాత్రం బెదరకుండా డుసెన్‌తో కలిసి జట్టును గెలిపించాడు. అంతకముందు ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్ కప్ గెలవడంలోనూ మిల్లర్‌ది కీలకపాత్రే. 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మిల్లర్ సౌతాఫ్రికా తరపున 143 వన్డేల్లో 3503 పరుగులు, 96 టి20ల్లో 1850 పరుగులు సాధించాడు. చదవండి: ఐపీఎల్లో దుమ్ము లేపాడు.. ఇక్కడా అదరగొట్టాడు! మొత్తంగా 235 క్యాచ్‌లు! -
కోమాలోనే సౌతాఫ్రికా యువ క్రికెటర్.. అండగా నిలబడిన క్రికెట్ బోర్డు
గత ఆదివారం(మే 29న) దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్న సౌతాఫ్రికా క్రికెటర్ మొండ్లీ ఖుమాలోకు ఆ దేశ క్రికెట్ బోర్డు(క్రికెట్ సౌతాఫ్రికా) అండగా నిలబడింది. ఖుమాలో కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయం అందించిన బోర్డు తన పెద్ద మనసు చాటుకుంది. ''యూకేలో దుండగుల చేతిలో గాయపడిన మొండ్లీ ఖుమాలో త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఈ దాడిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అతని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం. అతని కుటుంబసభ్యులకు మా అండ ఎప్పటికి ఉంటుంది.'' అని పేర్కొంది. కాగా దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడిన ఖుమాలో ఇప్పటికి కోమాలోనే ఉన్నాడు. ప్రస్తుతం యూకేలోని సౌత్‌మెడ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఖుమాలోకు బుధవారం మూడో సర్జరీ నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. తలలో రక్తం గడ్డకట్టడంతో ఖుమాలో కోమాలోకి వెళ్లిపోయాడని.. బ్లడ్‌ప్రెషర్ కూడా ఎక్కువగా ఉందన్నారు. దీంతో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించడానికి మూడు సర్జరీలు చేశామని.. మరొక సర్జరీతో అతనికి పూర్తిగా నయమయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా ఖుమాలో కోమాలోనే ఉన్నప్పటికి అతని ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని తెలిపారు. కాగా మే29(ఆదివారం) తెల్లవారుజామున తన పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న మొండ్లీ ఖుమాలోపై కొందరు దుండగులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కాగా ఖుమాలోపై దాడికి దిగిన వారిలో ఒక 27 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఇక 20 ఏళ్ల మొండ్లీ ఖుమాలో 2018లో క్వాజులు-నాటల్ ఇన్లాండ్ తరపున టి20 అరంగేట్రం చేశాడు. 2020 అండర్-19 ప్రపంచకప్ సౌతాఫ్రికా జట్టులో మొండ్లీ ఖుమాలో చోటు దక్కించుకున్నాడు. ఇక 2020 మార్చి 7న లిస్ట్-ఏ, 2021 మార్చి 4న ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, రెండు లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 4 టి20 మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: యూకేలో సౌతాఫ్రికా క్రికెటర్‌పై దాడి.. పరిస్థితి విషమం -
డోపింగ్‌లో పట్టుబడ్డ దక్షిణాఫ్రికా క్రికెటర్.. నిషేధం విధించిన ఐసీసీ
దుబాయ్: సౌతాఫ్రికా బ్యాటర్ జుబేర్ హమ్జాపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధం విధించింది. డోపింగ్ నిరోధక నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా హమ్జాను 9 నెలల పాటు క్రికెట్ సంబంధిత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఐసీసీ ఆదేశించింది. డోపింగ్ నిరోధక నియమాన్ని ఉల్లంఘించినట్టు అంగీకరించడంతో హమ్జాపై డిసెంబర్ 22, 2022 వరకు నిషేధం అమల్లో ఉంటుందని ఐసీసీ మంగళవారం ప్రకటించింది. 17 జనవరి 2022న హమ్జా నుంచి సేకరించిన నమూనాలో నిషేధిత పదార్థమైన ఫ్యూరోసెమైడ్ గుర్తించినట్లు ఐసీసీ పేర్కొంది. ఈ ఏడాది జనవరి 17 నుంచే నిషేధం అమల్లో ఉంటున్నందున మార్చి 22న హమ్జా న్యూజిలాండ్‌పై చేసిన 31 పరుగులు రికార్డుల్లో నుంచి తొలగించనున్నట్లు తెలిపింది. కాగా, 26 ఏళ్ల హమ్జా దక్షిణాఫ్రికా తరఫున 6 టెస్ట్‌లు, ఓ వన్డే ఆడాడు. హమ్జా ఖాతాలో రెండు అర్ధ సెంచరీలు నమోదై ఉన్నాయి. చదవండి: BAN Vs SL Test: టెస్టుల్లో ముష్ఫికర్ రహీమ్ అరుదైన రికార్డు! -
రాజస్థాన్ రాయల్స్‌లో చేరిన దక్షిణాఫ్రికా క్రికెటర్..
రాజస్థాన్ రాయల్స్ పేసర్ నాథన్ కౌల్టర్ నైల్ గాయం కారణంగా ఐపీఎల్-2022 నంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజగా అతడి స్థానంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ కార్బిన్ బాష్‌ని రాజస్థాన్ రాయల్స్ భర్తీ చేసింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ వెల్లడించింది. బేస్ ప్రైస్ రూ. 20 లక్షలకు అతడిని రాజస్తాన్ దక్కించుకుంది. ఇక దేశీవాళీ క్రికెట్లో 30 టీ20 మ్యాచ్‌లు ఆడిన బాష్ 151 పరుగులతో పాటు, 18 వికెట్లు పడగొట్టాడు. ఇక రాజస్తాన్ రాయల్స్ విషయానికి వస్తే... ఈ ఏడాది సీజన్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో పాయింట్ల పట్టికలో రాజస్తాన్ మూడో స్ధానంలో ఉంది. రాజస్తాన్ రాయల్స్ తమ తదపురి మ్యాచ్‌లో మే 15న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. చదవండి: ఆ క్రికెటర్‌ను బూతులు తిట్టారు.. నెలల వ్యవధిలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు..! 🤷♂️ @boschy14 https://t.co/Jv1Paa6laC pic.twitter.com/HwxVwYXGNb — Rajasthan Royals (@rajasthanroyals) May 14, 2022 -
సౌతాఫ్రికా క్రికెటర్‌ను సస్పెండ్ చేసిన ఐసీసీ
దక్షిణాఫ్రికా క్రికెటర్ జుబేర్ హంజాను బుధవారం ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. డోపింగ్ టెస్టులో సౌతాఫ్రికా క్రికెటర్ పాజిటివ్‌గా తేలడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. హంజాపై వేసిన వేటు తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసీసీ తెలిపింది. కాగా ఈ విషయంపై క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) ఒక ప్రకటన విడుదల చేసింది. ఐసీసీ విధించిన సస్పెన్షన్‌ను జుబేర్ హంజా అంగీకరించాడని పేర్కొంది. ''ఈ ఏడాది జనవరిలో ఐసీసీ కొందరు ప్రొటీస్ ఆటగాళ్లకు యాంటీ డోపింగ్ టెస్టు నిర్వమించింది. కాగా టెస్టులో జుబేర్ హంజా పాజిటివ్‌గా తేలాడు. డోపింగ్ టెస్టులో జుబేర్ హంజా ఐసీసీకి సహకరించాడని.. పాజిటివ్‌గా తేలడంపై డ్రగ్స్ తీసుకున్నట్లు తానే స్వయంగా ఒప్పుకున్నాడు. అయితే అతనిపై ఐసీసీ వేటు మాత్రమే వేసిందని.. జుబేర్ భవిష్యత్తులో మళ్లీ క్రికెట్ ఆడే అవకాశం ఉంది. అందుకు సీఎస్ఏ, సాకా, డబ్ల్యూపీసీఏ మద్దుతు ఉంటుంది'' అని సీఎస్ఏ తెలిపింది. కాగా 2019లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు ద్వారా జుబేర్ హంజా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఆరు టెస్టులు ఆడి 212 పరుగులు సాధించాడు. గతేడాది నవంబర్‌లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ద్వారా వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన హంజా 56 పరుగులు చేశాడు. ఆ తర్వాత కోవిడ్‌తో ఆ సిరీస్ రద్దయ్యిఇంది. ఇక గతవారం బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు సీఎస్ఏ జట్టును ప్రకటించింది. కాగా జుబేర్ హంజా వ్యక్తిగత కారణాలతో బంగ్లాతో సిరీస్ నుంచి స్వయంగా వైదొలిగాడు. చదవండి: PAK vs AUS: 20 పరుగుల వ్యవధిలో ఆలౌట్.. పేరును సార్థకం చేసుకున్న పాక్ జట్టు క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు.. -
అచ్చం డివిలియర్స్‌ను తలపిస్తున్నాడు.. ఐపీఎల్ వేలానికి వస్తే!
దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ విధ్వంసానికి పెట్టింది పేరు. మిస్టర్ 360 డిగ్రీస్ పేరు కలిగిన ఏబీ గ్రౌండ్ నలుమూలలా షాట్లు కొడుతూ క్షణాల్లో ఆట స్వరూపాన్నే మార్చేయగల సత్తా ఉన్నవాడు. అంతర్జాతీయంగా ఎన్నో మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికాను గెలిపించిన డివిలియర్స్.. ఐపీఎల్‌లోనూ అదే జోరు చూపెట్టాడు. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఎక్కువకాలం ఆడిన ఏబీ తన విధ్వంసాన్ని భారత అభిమానులకు చూపెట్టాడు. చదవండి: పంత్ పాతుకుపోయాడుగా.. అదృష్టం అంటే ఇట్టానే ఉంటాదేమో! అంతర్జాతీయ క్రికెట్‌కు రెండేళ్ల ముందే గుడ్‌బై చెప్పిన డివిలియర్స్ ఇటీవలే అన్ని రకాల లీగ్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో ఐపీఎల్లో ఇక అతని మెరుపులు కనిపించవని అభిమానులు తెగ బాధపడిపోయారు. అలా బాధపడుతున్న ఐపీఎల్ అభిమానులకు ఒక శుభవార్త. త్వరలోనే డివిలియర్స్ మెరుపులు మళ్లీ చూసే అవకాశం వచ్చింది. అదేంటి వీడ్కోలు చెప్పాడుగా.. మళ్లీ వస్తున్నాడా అని సందేహం వద్దు. చదవండి: పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. సన్‌రైజర్స్‌లోకి కిషన్! డెవాల్డ్ బ్రెవిస్ అనే కుర్రాడు ప్రస్తుతం అండర్-19 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరపున ఇరగదీస్తున్నాడు. 360 డిగ్రీస్‌లో షాట్లు కొడుతూ అచ్చం డివిలియర్స్‌ను గుర్తుచేస్తున్నాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే విధ్వంసకర షాట్లు ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 169 పరుగులు చేసిన బ్రెవిస్ ఖాతాలో ఒక సెంచరీ ఉండడం విశేషం. ఉగాండాపై సెంచరీ చేసిన డెవాల్డ్ బ్రెవిస్.. టీమిండియాపై 65 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వెస్టిండీస్‌పై మరో అర్థసెంచరీతో మెరిశాడు. ప్రస్తుతం టోర్నీలో టాప్ స్కోరర్‌గా ఉన్న బ్రెవిస్‌కు ఎదురులేకుండా పోయింది. ఇక టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా 65 పరుగులతో మెరిసిన డెవాల్డ్ బ్రెవిస్.. డివిలియర్స్‌ను గుర్తుచేస్తూ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో తన సహచరులు డ్రెస్సింగ్ రూమ్‌లో ''బేబీ ఏబీ'' అంటూ ప్లకార్డులను పట్టుకొని ఎంకరేజ్ చేయడం వైరల్‌గా మారింది. ఇక ఫిబ్రవరి 12,13 తేదీల్లో ఐపీఎల్ మెగావేలం జరగనున్న నేపథ్యంలో డెవాల్డ్ బ్రెవిస్ వేలానికి వచ్చే అవకాశముందని పలువురు పేర్కొన్నారు. ఒకవేళ అదే నిజమై.. బ్రెవిస్‌ను కొనుగోలు చేస్తే మాత్రం డివిలియర్స్‌ను మరోసారి చూసినట్లేనని అభిప్రాయపడుతున్నారు. చదవండి: జేసన్ రాయ్ విధ్వంసం.. సిక్సర్లతో వీరవిహారం 👏 Dewald Brevis caught the attention of many in the SA U19's opening #T20KO match. 🏏 How will he and the rest of the SA U19s go throughout the competition? 📲 Catch the full match highlights here https://t.co/zz5ZdsFGsZ pic.twitter.com/DYtMB79FB8 — Cricket South Africa (@OfficialCSA) October 9, 2021 Babay de-Villiers 😍 Dewald Brevis from SA U19. pic.twitter.com/xGlDtM1ruL — . (@federalite7) January 17, 2022 -
డికాక్ ఫ్యామిలిలోకి కియారా.. తండ్రి అయిన సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డికాక్ తండ్రి అయ్యాడు. అతని భార్య సాశా గురువారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కూతురికి కియారా అని నామకరణం చేసారు డికాక్ దంపతులు. డికాక్.. తన కూతురుని గుండెలకు హత్తుకుని దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా, భార్య గర్భవతి కావడంతో, ఆమెతో గడిపేందుకు డికాక్ ఇటీవలే టెస్ట్ క్రికెటకు వీడ్కోలు పలికి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Quinton De Kock (@qdk_12) టీమిండియాతో సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో పాల్గొన్న డికాక్.. ఆ మ్యాచ్ అనంతరం టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరిని షాక్‌కి గురి చేశాడు. మరోవైపు, భారత జట్టుతో వన్డే సిరీస్ కోసం ప్రకటించిన దక్షిణాఫ్రికా జట్టులో డికాక్‌కి చోటు దక్కింది. చదవండి: జకోవిచ్‌పై మండిపడ్డ నదాల్.. టెన్నిస్ దిగ్గజాల మధ్య కోవిడ్ టీకా రచ్చ -
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ బౌలర్..
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు, దిగ్గజ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 20 ఏళ్లుగా తన క్రికెట్ ప్రయాణం అద్భుతంగా సాగిందని, ఈ క్రమంలో తనకు సహకరించి తోడుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు అంటూ మంగళవారం ట్వీట్ చేశాడు. Announcement. pic.twitter.com/ZvOoeFkp8w — Dale Steyn (@DaleSteyn62) August 31, 2021 38 ఏళ్ల స్టెయిన్ తన కెరీర్లో 93 టెస్ట్‌లు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడి మొత్తం 699 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రొటిస్ ఫాస్ట్ బౌలర్.. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున 95 మ్యాచ్‌ల్లో 97 వికెట్లు పడగొట్టాడు. కాగా, స్టెయిన్ ఈ ఏడాది జనవరిలో ఐపీఎల్ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. అయితే, విదేశీ లీగ్‌లకు మాత్రం అందుబాటులో ఉంటానని ప్రకటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. చదవండి: తాలిబన్లను పొగిడిన పాక్ క్రికెటర్‌పై నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు -
తనను జట్టులోకి తీసుకుంటే రిటైరవుతామని బెదిరించారు..
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా క్రికెట్లో జాతి వివక్ష కొత్తేమీ కాదు. ఇప్పటికే జాత్యాహంకారం కారణంగా ఆ దేశ క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆ దేశ దిగ్గజ ఆటగాళ్లపై ఇలాంటి ఆరోపణలు రావడం ఆ దేశ క్రికెట్లో సంచలనం రేపుతోంది. సఫారీ లెజెండరీ క్రికెటర్ ఏబీ డివిల్లియర్స్, ఆ దేశ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌లపై అదే దేశానికి చెందిన నల్లజాతి క్రికెటర్, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ తమి సోలెకిలే జాత్యాంహంకార ఆరోపణలు చేశాడు. గతంలో (2011-2015) ఐదేళ్ల పాటు తాను నేషనల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న సమయంలో నాటి కెప్టెన్ గ్రేమ్ స్మిత్, ఏబీడీలు తనకు సరైన అవకాశాలు ఇవ్వకుండా తన ఎదుగుదలను అడ్డుకున్నారని, తనను జట్టులోకి తీసుకుంటే రిటైరవుతామని కూడా బెదిరించారని సోలికెలే ఆరోపించాడు. ఆ ఇద్దరు తనను తొక్కేశారని, అందువల్లే బ్యాకప్ ప్లేయర్‌గా మిగిలిపోయానని పేర్కొన్నాడు. 160 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన తనకు, కేవలం మూడు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కిందని వాపోయాడు. నాడు కెప్టెన్‌గా గ్రేమ్ స్మిత్ లేకపోయి ఉంటే, తాను మరిన్ని మ్యాచ్‌లు ఆడేవాడినని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గ్రేమ్ స్మిత్‌కు నేను జట్టులో ఉండటం అస్సలు ఇష్టం లేదని జాతీయ సెలక్షన్ కన్వీనర్స్ ఆండ్రూ హడ్సన్, లిండా జోండిలతో కలిసి న్యాయస్థానం ముందు ఆరోపణలు చేశాడు. 2013లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ సమయంలో రెగ్యులర్ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ కంటి గాయంతో బాధపడుతున్నాడని, తనకు తుది జట్టులో చోటు ఖాయమని సెలక్టర్ హడ్సన్ చెప్పాడని పేర్కొన్నాడు. అయితే, అప్పటివరకు ఎన్నడూ వికెట్ కీపింగ్ చేయని ఏబీ డివిల్లియర్స్, నాకు జట్టులో చోటు దక్కకూడదనే ఉద్దేశంతో వికెట్ కీపింగ్ చేయడానికి రెడీ అయ్యాడని ఆరోపించాడు. గ్రేమ్ స్మిత్, ఏబీడీలకు నల్ల జాతీయులతో కలిసి డ్రెసింగ్ రూమ్ షేర్ చేసుకోవడమన్నా, వారితో మాట్లాడటమన్నా అస్సలు ఇష్టం ఉండదని వ్యాఖ్యానించాడు. నేను తన జట్టులో ఉండడం గ్రేమ్ స్మిత్‌కు ఇష్టం లేదని స్వయానా సెలక్టర్లే తనతో చెప్పినట్లు తెలిపాడు. కాగా, తమీ సోలెకిలే తన ఐదేళ్ల కాంట్రాక్ట్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సహా పలు విదేశీ టూర్లకు ఎంపికయ్యాడు. -
ఆట కోసం ఆస్తులమ్ముకున్నాడు.. దేశాన్ని కూడా వీడాడు
లండన్: లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో అరంగేట్రంలోనే అద్భుతమైన ద్విశతకాన్ని సాధించి, రాత్రికి రాత్రే హీరోగా మారిపోయిన న్యూజిలాండ్ ఆటగాడు డెవాన్ కాన్వే గత జీవితం ఏమంత సాఫీగా సాగలేదన్న విషయం ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తుంది. క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడే కాన్వే.. ట్రైనింగ్ కోసం ఇల్లు, కారు సహా చాలా ఆస్తులు అమ్ముకున్నాడు. పుట్టింది దక్షిణాఫ్రికాలోనే అయినా.. క్రికెట్ కోసం దేశాన్ని వీడి న్యూజిలాండ్ బాట పట్టాడు. 2017 మార్చిలో దక్షిణాఫ్రికా దేశవాలీ క్రికెట్లో ఆఖరి మ్యాచ్ ఆడిన కాన్వే.. అందులో డబుల్ సెంచరీ సాధించి, ఆ దేశానికి గుడ్‌బై చెప్పాడు. అక్కడి నుంచి స్నేహితుల సహకారంతో వెల్లింగ్టన్కు చేరిన కాన్వే.. అక్కడే తన క్రికెట్ కెరీర్‌ను కొనసాగించాడు. విక్టోరియా క్రికెట్ క్లబ్ కోచ్‌గా, బ్యాట్స్‌మెన్‌గా డ్యుయల్ రోల్ పోషిస్తూ, అవకాశాల కోసం ఎదురు చూశాడు. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత న్యూజిలాండ్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న కాన్వే.. ఫార్మాట్లకతీతంగా రాణిస్తూ అనతి కాలంలోనే ప్రపంచ ఖ్యాతి గడించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ సాధించిన అతను.. అండర్సన్, బ్రాడ్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ధీటుగా ఎదుర్కొని నిలబడి క్రికెట్ మక్కాలో చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కాన్వే.. 347 బంతుల్లో 22 ఫోర్లు, ఒక సిక్స్‌తో 200 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అతని బ్యాటింగ్ తీరు చూసి మిస్టర్ 360 డిగ్రీస్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఫిదా అయ్యాడు. క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమించే మరో స్టార్ ఆవిర్భవించాడంటూ ప్రశంసించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 14 టీ20లు, 3 వన్డేలు, ఒక టెస్ట్ మ్యాచ్ ఆడిన కాన్వే.. టీ20ల్లో 151.12 సగటులో 473 పరుగులు(4 అర్ధశతకాలు), వన్డేల్లో 75 సగటులో 225 పరుగులు(సెంచరీ, హాఫ్ సెంచరీ), టెస్ట్ క్రికెట్లో 200 పరుగులు సాధించాడు. చదవండి: ఎనిమిదేళ్ల క్రితం చేసిన ట్వీట్‌కు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు.. -
రాజస్తాన్ రాయల్స్‌కు కొత్త ఆటగాడు.. రాత మారుతుందా!
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఫేలవ ప్రదర్శన కొనసాగిస్తుంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓటములు.. ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది. గురువారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. దీనికి తోడూ ఈ సీజన్లో రాజస్తాన్‌కు బట్లర్, మోరిస్ మినహా నిఖార్సైన విదేశీ ఆటగాళ్లు లేరు. ఐపీఎల్‌కు ముందే ఆర్చర్ దూరమవడం.. రెండు మ్యాచ్‌ల తర్వాత బెన్ స్టోక్స్ గాయంతో సీజన్‌కు దూరమవగా.. బయోబబూల్‌లో ఉండలేనంటూ లియాయ్ లివింగ్‌స్టోన్ తాజాగా ఐపీఎల్‌ను వీడాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ వాండర్ డుసెన్ ఐపీఎల్లో ఆడడానికి త్వరలోనే జట్టులో చేరనున్నట్లు సమచారం. నెట్వర్క్ 24 చానెల్ అందించిన రిపోర్ట్ ప్రకారం.. రాజస్తాన్ రాయల్స్ వాండర్ డుసెన్‌ను కలిసి ఐపీఎల్లో ఆడాలని కోరినట్లు సమాచారం. అందుకు డుసెన్ అంగీకరించాడని.. ఫిట్నెస్ టెస్టు అనంతరం జట్టులో చేరనున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయంపై రాజస్తాన్ రాయల్స్ అధికారికంగా స్పందించేవరకు డుసెన్ ఆడే దానిపై స్పష్టత రాలేదు. కాగా దక్షిణాఫ్రికా తరపున ఆడుతున్న డుసెన్ ఇటీవలే పాకిస్తాన్‌తో సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరిచాడు. రెండు వన్డేలు కలిపి 186 పరుగులు చేశాడు. దీనిలో ఒక సెంచరీ ఉండడం విశేషం. మంచి స్ట్రైక్ కలిగిన బ్యాట్స్‌మన్‌గా పేరున్న డుసెన్ 20 టీ20ల్లో 628 పరుగులు చేశాడు. ఇక డుసెన్ రాకతో రాజస్తాన్ రాత మారుతుందోమో చూడాలి అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. చదవండి: ఎవరో ఎందుకని వాళ్లను వాళ్లే ట్రోల్ చేసుకున్నారు.. ఇలా అయితే ఐపీఎల్ నుంచి మొదటగా వెళ్లేది వాళ్లే -
ఆ క్యాచ్ చూస్తే ఔరా అనాల్సిందే..
కేప్‌టౌన్: క్రికెట్లో స్లిప్ ఫీల్డింగ్ చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా క్యాచ్ చేజారడమే కాకుండా బంతి శరీరంపైకి దూసుకొచ్చి గాయాలబారిన పడే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ స్థానంలో ఫీల్డింగ్ అంటే ఫీల్డర్లు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు. దక్షిణాప్రికా దేశవాళి క్రికెట్లో భాగంగా జరిగిన ఓ 50 ఓవర్ మ్యాచ్‌లో ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మార్టిన్ వాన్ జార్స్‌వెల్డ్ అనే ఆటగాడు చాలా అప్రమత్తంగా వ్యవహరించి, బ్యాట్స్‌మెన్ బంతిని ఆడే దిశను ముందుగానే పసిగట్టి, ఫస్ట్ స్లిప్ నుంచి లెగ్ సైడ్‌కు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. బ్యాట్స్‌మెన్ స్కూప్ షాట్‌కు ప్రయత్నిస్తున్నాడని పసిగట్టి, వికెట్‌కీపర్ వెనుక నుంచి అద్భుతంగా డైవ్ చేస్తూ క్యాచ్‌ను ఒడిసిపట్టుకొని ఫీల్డ్‌లో ఉన్నవారందరిని అవాక్కయ్యేలా చేశాడు. ఆ క్రికెటర్ చేసిన అద్భుత విన్యాసం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఫీల్డర్ చూపిన సమయస్పూర్తిని మెచ్చుకుంటూ నెటిజన్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఈ క్యాచ్‌ను ఆల్‌టైమ్ గ్రేట్ స్లిప్ క్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు. ఈ ఫీట్‌ను సాధించిన జార్స్‌వెల్డ్ దక్షిణాఫ్రికా తరపున 9టెస్టులు, 11 వన్డేలు ఆడాడు. కాగా, దక్షిణాఫ్రికా జట్టు జాంటీ రోడ్స్ లాంటి అల్‌టైమ్ గ్రేట్ ఫీల్డర్లను అందించడమే కాకుండా, గ్యారీ కిర్‌స్టన్, గ్రేమ్ స్మిత్ లాంటి అద్భుతమైన స్లిప్ ఫీల్డర్లను కూడా అందించింది. This is one of the great all-time slips catches from South Africa's provincial 50-over competition! pic.twitter.com/5Gpfv9V9Jg — 🏏FlashScore Cricket Commentators (@FlashCric) March 1, 2021 -
దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ తొలి వన్డే వాయిదా
కేప్‌టౌన్: ‘బయో బబుల్’లో ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికా ప్లేయర్ కరోనా వైరస్ బారిన పడటంతో... దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం జరగాల్సిన తొలి వన్డేను ఆదివారానికి వాయిదా వేశారు. రెండు జట్ల ఆటగాళ్ల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, రెండు క్రికెట్ సంఘాలు తొలి వన్డే వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నట్లు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు తెలిపాయి. దక్షిణాఫ్రికా జట్టులో కరోనా సోకిన ప్లేయర్ పేరును వెల్లడించలేదు. ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్భంగా దక్షిణాఫ్రికా నుంచి ముగ్గురు క్రికెటర్లు వైరస్ బారిన పడ్డారు. ‘బయో బబుల్’ ఏర్పాటు చేయకముందు ఒకరికి వైరస్ రాగా... మూడో టి20 మ్యాచ్‌కు ముందు మరొకరికి వైరస్ సోకింది. షెడ్యూల్లో మార్పు కారణంగా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ ఆదివారం, సోమవారం వరుసగా రెండు రోజుల్లో రెండు వన్డేలు ఆడాల్సి ఉంటుంది. బుధవారం జరిగే మూడో వన్డేతో ఇంగ్లండ్ పర్యటన ముగుస్తుంది. -
దక్షిణాఫ్రికా నుంచి అమెరికాకు...
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ డేన్ పీట్ అనూహ్య నిర్ణయంతో ఆశ్చర్యపరిచాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సభ్యదేశమైన దక్షిణాఫ్రికా జట్టును వదిలి అసోసియేట్ టీమ్ అమెరికాతో జతకట్టేందుకు సిద్ధమయ్యాడు. శనివారం ఉదయమే ఈ ఒప్పందానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని అతను ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ‘ఈ రోజు ఉదయం కాంట్రాక్ట్‌పై సంతకం చేశా. చాలా కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ... ఇది నాకో మంచి అవకాశం. ఆర్థికంగానూ, జీవనశైలి పరంగానూ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని వదులుకోలేకపోయాను. పైగా గతేడాది అమెరికాకు వన్డే జట్టు హోదా దక్కింది. ఇంకా ఆలోచించడానికి ఏముంది? దక్షిణాఫ్రికా వన్డే తుది జట్టులో తనకు చోటు దక్కే అవకాశాలు అతి స్వల్పంగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను ’ అని పీట్ వ్యాఖ్యానించాడు. ఈ వేసవిలో ప్రారంభం కానున్న ‘ మైనర్ లీగ్ టి20 టోర్నమెంట్’ నుంచి అతను అమెరికా తరఫున తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. 2014లో సఫారీ జట్టు తరఫున అరంగేట్రం చేసిన పీట్ తొమ్మిది టెస్టుల్లో 26 వికెట్లు దక్కించుకున్నాడు. -
అలియా భట్ ఎవరో తెలియదన్న మాజీ క్రికెటర్
అలియా భట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అలియా గురించి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హెర్షెల్ గిబ్స్కు తెలియదట. ఈ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడు. తన ట్విటర్లో అలియా ఎమోజీని షేర్ చేశాడు గిబ్స్. దాంతో అలియా అభిమానులు ఈమె ఎవరో మీకు తెలుసా అని గిబ్స్‌ను ప్రశ్నించారు. అందుకు అతడు తెలియదని సమాధానమిచ్చాడు. దాంతో అలియా అభిమానులు ఆమె బాలీవుడ్ హీరోయిన్ అని, ఆమె గురించి చెప్పడం ప్రారంభించారు. కాసేపటి అలియా నటి అని తెలుసుకున్న గిబ్స్ ‘ఈమె నటి అని నాకు తెలియదు. కానీ చాలా అందంగా ఉంది’ అంటూ సమాధానం ఇచ్చాడు. గిబ్స్ వ్యాఖ్యలపై అలియా స్పందిస్తూ ఓ ఎమోజీని ట్వీట్ చేసింది. పరుగెడుతున్న నాలుగు పరగులకు సిగ్నల్ ఇస్తున్నట్లు వీడియో పెట్టింది. ఇది అలియా అభిమానులకు తెగ నచ్చింది. రణ్‌బీర్ సర్ దీన్నోసారి చూడండి అంటూ కామెంట్ చేస్తున్నారు. 😃 https://t.co/5IKY4UIu2k pic.twitter.com/dMsGdWbTl2 — Alia Bhatt (@aliaa08) August 27, 2019 -
‘ఆ ఇద్దరి వల్లే భారత్‌కు విజయాలు’
సాక్షి, స్పోర్ట్స్ : భారత మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహలే భారత విజయాలకు కారణమని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ పాల్ ఆడమ్స్ అభిప్రాయపడ్డారు. ఈ ఇద్దరితోనే కోహ్లిసేన బలంగా ఉందని తెలిపారు. బ్యాటింగ్‌కే ఎకువ ప్రాధాన్యత ఇచ్చే ప్రస్తుత తరుణంలో ఇద్దరు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకోవడం గొప్ప విషయమన్నారు. వారు మణికట్టు బౌలర్లే అయినప్పటికి వారు వేసే బంతుల్లో చాలా వైవిధ్యం ఉందని కొనియాడారు. బ్యాట్స్‌మన్‌కు అందకుండా బంతులు వేస్తూ సమర్ధవంతమైన ప్రదర్శనను కనబరుస్తున్నారని ఈ మాజీ క్రికెటర్ తెలిపారు. బ్యాటింగ్‌కు అనుకూలించే జోహన్నెస్‌బర్గ్ మైదానంలో ఆతిథ్య జట్టు ఒక్క స్పిన్నర్‌ను కూడా బరిలోకి దింపలేదన్నారు. కానీ భారత్ మాత్రం ఈ ఇద్దరిని ఆడించి ప్రత్యేకంగా నిలిచిందన్నారు. దక్షిణాఫ్రికాలో తొలి సారి పర్యటిస్తున్నా ఆ యువస్పిన్నర్లలో ఏ మాత్రం భయం కనిపించలేదన్నారు. వారు ఒక మ్యాచ్‌లోనే ఒత్తిడికి లోనయ్యారని, తర్వాతీ మ్యాచుల్లో బ్యాటింగ్‌పిచ్‌లపై సైతం రాణించారని ఆడమ్స్ ప్రశంసించారు. చాహల్ స్థిరంగా రాణిస్తూ బంతిని చాలా బాగా తిప్పేస్తున్నాడని, యాదవ్ గూగ్లీలు బ్యాట్స్‌మన్‌కు ఏమాత్రం అర్థం కావడంలేదన్నారు. ఇక ఐపీఎల్‌తో వారు మరింత రాటుదేలుతారని చెప్పుకొచ్చారు. సఫారీ పర్యటనలో భారత్ 5-1తో వన్డే సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించడంలో ఈ యువ స్పిన్నర్లు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ఆరు వన్డేల్లో ఏకంగా 33 వికెట్లు పడగొట్టారు. -
ఆత్మవిశ్వాసంతో ఉన్నాం
టి20ల్లో ఫలితాన్ని ఊహించలేం మళ్లీ దక్షిణాఫ్రికాకు ఆడతానని అనుకోలేదు ఆల్బీ మోర్కెల్ ఇంటర్వ్యూ ఢాకా నుంచి బత్తినేని జయప్రకాష్ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ట్వంటీ 20 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ ఆల్బీ మోర్కెల్. ఇప్పటికే 259 మ్యాచ్‌లు ఆడాడు. భారీ హిట్టింగ్ చేయగల సామర్థ్యం, నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయగల నైపుణ్యంతో ఈ దక్షిణాఫ్రికా క్రికెటర్‌కు ప్రపంచ వ్యాప్తంగా టి20ల్లో భారీ డిమాండ్ ఉంది. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ ఆరేళ్లు ధోనితో పాటు ఆల్బీనీ కొనసాగించింది. ఈసారి మాత్రం కొనసాగించలేదు. ఐపీఎల్-7 కోసం జరిగిన వేలంలో బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది. అయితే రెండేళ్ల క్రితం టి20 ప్రపంచకప్ తర్వాత ఆల్బీ మోర్కెల్‌కు దక్షిణాఫ్రికా జట్టులో చోటు పోయింది. కొత్త వాళ్లు, యువకుల కోసం 32 ఏళ్ల మోర్కెల్‌ను పక్కనబెట్టారు. అయితే టి20 ప్రపంచకప్‌కు అతని అనుభ వం ఎంత అవసరమో దక్షిణాఫ్రికా బోర్డు ఆలస్యంగానైనా మళ్లీ గుర్తించింది. దీంతో ఈసారి బంగ్లాదేశ్‌లో దక్షిణాఫ్రికా తరఫున ఆడుతున్నాడు. ఇప్పటి వరకూ ఎన్నడూ ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవని లోటును సఫారీ జట్టు తీర్చుకోవాలని భావిస్తోంది. టోర్నీ గెలవగలమనే ఆత్మవిశ్వాసం తమలో ఉందంటున్న ఆల్బీ మోర్కెల్ ఇంటర్వ్యూ ‘సాక్షి’కి ప్రత్యేకం. ఈ టోర్నీలో ఇప్పటివరకూ మీ ప్రదర్శన సంతృప్తినిచ్చిందా? వరుసగా మూడు విజయాలు సాధించాం. అయితే అందులో రెండు మ్యాచ్‌లు ఆఖరి వరకూ పోరాడి గెలిచాం. సాధారణంగా అలాంటి మ్యాచ్‌లు గెలిచినప్పుడు ఊరట వస్తుంది. దానితో పాటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిగతంగా మాత్రం నా ప్రదర్శన ఇంకా మెరుగుపడాలి. సెమీస్‌లో భారత్‌లాంటి పటిష్టమైన జట్టుతో ఆడబోతున్నారు. ఈ మ్యాచ్‌పై కామెంట్? ఈ టోర్నమెంట్లో భారత్ అద్భుతంగా ఆడుతోంది. కాబట్టి మేం మా పూర్తి సామర్థ్యంతో పోరాడాల్సి ఉంటుంది. ఫైనల్‌కు చేరతామన్న నమ్మకం ఉందా? ఏ జట్టుకైనా నమ్మకం కచ్చితంగా ఉంటుంది. టి20ల్లో ఫలితాన్ని అంచనా వేయలేం. ఒక్క ఓవర్లోనే మ్యాచ్ స్వరూపం, ఫలితం కూడా మారిపోతుంది. ఏ జట్టుతో ఆడినా పూర్తి సామర్థ్యంతో ఆడటం ఒక్కటే ముఖ్యం. దక్షిణాఫ్రికా జట్టు ఏ పెద్ద టోర్నీలోనూ ఇప్పటివరకు టైటిల్ గెలవలేదు. ఆ లోటు బాధిస్తుందా? చాలా టోర్నీల్లో మేం మంచి క్రికెట్ ఆడాం. టోర్నీ అంతటా బాగా ఆడినా ఒక్కరోజు వైఫల్యం వల్ల మ్యాచ్‌లు పోయాయి. ఈసారి గెలవగలమనే ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. సాధారణంగా నాకౌట్ మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా తరచూ విఫలమవుతుంటుంది. దీనికి ఒత్తిడే కారణమా? నాకౌట్ అనే కాదు... ప్రతి మ్యాచ్‌లోనూ ఒత్తిడి ఉంటుంది. దీనిని ప్రొఫెషనల్ క్రికెటర్లు కచ్చితంగా అధిగమించాలి. ఈసారి మ్యాచ్‌లు ఒత్తిడిలోనే గెలిచామన్న విషయం గుర్తుంచుకోవాలి. టి20 స్పెషలిస్ట్ అనే ముద్ర వల్ల కెరీర్లో పెద్దగా టెస్టులు ఆడలేదు. దీని గురించి ఎప్పుడైనా బాధపడ్డారా? చివరి ఓవర్లలో వచ్చి మొదటి బంతి నుంచే హిట్టింగ్ చేయడం సమస్య కాదా? ప్రతి క్రికెటర్ తన సామర్థ్యం ఏమిటనేది తెలుసుకోగలగాలి. అప్పుడు బాధపడాల్సిన అవసరం ఉండదు. నా బలం టి20 అయినప్పుడు నేను టెస్టుల గురించి ఆలోచించడం అనవసరం. ఇక చివరి ఓవర్లలో వచ్చి మొదటి బంతి నుంచే హిట్టింగ్ చేయడం అనేది చాలా కష్టం. ఎక్కువసార్లు విఫలమవుతాం. ఇది మానసికంగా బాధిస్తుంది. దీనిని అధిగమిస్తేనే సక్సెస్ లభిస్తుంది. తిరిగి దక్షిణాఫ్రికా జట్టులోకి వస్తానని ఊహించారా? నిజాయితీగా చెప్పాలంటే లేదు. నా అంతర్జాతీయ కెరీర్ ముగిసిందని నేను ఫిక్సయ్యాను. కానీ ఈసారి దేశవాళీ క్రికెట్లో బాగా ఆడటం వల్ల ఈ పిలుపు వచ్చింది. నిజానికి నేను మళ్లీ జాతీయ జట్టులోకి ఎంపికయ్యానని తెలియగానే ఆశ్చర్యపోయాను. అయితే నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే నా బాధ్యత.