దక్షిణాఫ్రికా క్రికెటర్ జుబేర్ హంజాను బుధవారం ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. డోపింగ్ టెస్టులో సౌతాఫ్రికా క్రికెటర్ పాజిటివ్‌గా తేలడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. హంజాపై వేసిన వేటు తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసీసీ తెలిపింది. కాగా ఈ విషయంపై క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్‌ఏ) ఒక ప్రకటన విడుదల చేసింది. ఐసీసీ విధించిన సస్పెన్షన్‌ను జుబేర్ హంజా అంగీకరించాడని పేర్కొంది.
''ఈ ఏడాది జనవరిలో ఐసీసీ కొందరు ప్రొటీస్ ఆటగాళ్లకు యాంటీ డోపింగ్ టెస్టు నిర్వమించింది. కాగా టెస్టులో జుబేర్ హంజా పాజిటివ్‌గా తేలాడు. డోపింగ్ టెస్టులో జుబేర్ హంజా ఐసీసీకి సహకరించాడని.. పాజిటివ్‌గా తేలడంపై డ్రగ్స్ తీసుకున్నట్లు తానే స్వయంగా ఒప్పుకున్నాడు. అయితే అతనిపై ఐసీసీ వేటు మాత్రమే వేసిందని.. జుబేర్ భవిష్యత్తులో మళ్లీ క్రికెట్ ఆడే అవకాశం ఉంది. అందుకు సీఎస్‌ఏ, సాకా, డబ్ల్యూపీసీఏ మద్దుతు ఉంటుంది'' అని సీఎస్‌ఏ తెలిపింది.
కాగా 2019లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు ద్వారా జుబేర్ హంజా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఆరు టెస్టులు ఆడి 212 పరుగులు సాధించాడు. గతేడాది నవంబర్‌లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ద్వారా వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన హంజా 56 పరుగులు చేశాడు. ఆ తర్వాత కోవిడ్‌తో ఆ సిరీస్ రద్దయ్యిఇంది. ఇక గతవారం బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు సీఎస్‌ఏ జట్టును ప్రకటించింది. కాగా జుబేర్ హంజా వ్యక్తిగత కారణాలతో బంగ్లాతో సిరీస్ నుంచి స్వయంగా వైదొలిగాడు.
చదవండి: PAK vs AUS: 20 పరుగుల వ్యవధిలో ఆలౌట్.. పేరును సార్థకం చేసుకున్న పాక్ జట్టు
Comments
Please login to add a commentAdd a comment