Zubayr Hamza
-
డోపింగ్‌లో పట్టుబడ్డ దక్షిణాఫ్రికా క్రికెటర్.. నిషేధం విధించిన ఐసీసీ
దుబాయ్: సౌతాఫ్రికా బ్యాటర్ జుబేర్ హమ్జాపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధం విధించింది. డోపింగ్ నిరోధక నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా హమ్జాను 9 నెలల పాటు క్రికెట్ సంబంధిత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఐసీసీ ఆదేశించింది. డోపింగ్ నిరోధక నియమాన్ని ఉల్లంఘించినట్టు అంగీకరించడంతో హమ్జాపై డిసెంబర్ 22, 2022 వరకు నిషేధం అమల్లో ఉంటుందని ఐసీసీ మంగళవారం ప్రకటించింది. 17 జనవరి 2022న హమ్జా నుంచి సేకరించిన నమూనాలో నిషేధిత పదార్థమైన ఫ్యూరోసెమైడ్ గుర్తించినట్లు ఐసీసీ పేర్కొంది. ఈ ఏడాది జనవరి 17 నుంచే నిషేధం అమల్లో ఉంటున్నందున మార్చి 22న హమ్జా న్యూజిలాండ్‌పై చేసిన 31 పరుగులు రికార్డుల్లో నుంచి తొలగించనున్నట్లు తెలిపింది. కాగా, 26 ఏళ్ల హమ్జా దక్షిణాఫ్రికా తరఫున 6 టెస్ట్‌లు, ఓ వన్డే ఆడాడు. హమ్జా ఖాతాలో రెండు అర్ధ సెంచరీలు నమోదై ఉన్నాయి. చదవండి: BAN Vs SL Test: టెస్టుల్లో ముష్ఫికర్ రహీమ్ అరుదైన రికార్డు! -
సౌతాఫ్రికా క్రికెటర్‌ను సస్పెండ్ చేసిన ఐసీసీ
దక్షిణాఫ్రికా క్రికెటర్ జుబేర్ హంజాను బుధవారం ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. డోపింగ్ టెస్టులో సౌతాఫ్రికా క్రికెటర్ పాజిటివ్‌గా తేలడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. హంజాపై వేసిన వేటు తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసీసీ తెలిపింది. కాగా ఈ విషయంపై క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) ఒక ప్రకటన విడుదల చేసింది. ఐసీసీ విధించిన సస్పెన్షన్‌ను జుబేర్ హంజా అంగీకరించాడని పేర్కొంది. ''ఈ ఏడాది జనవరిలో ఐసీసీ కొందరు ప్రొటీస్ ఆటగాళ్లకు యాంటీ డోపింగ్ టెస్టు నిర్వమించింది. కాగా టెస్టులో జుబేర్ హంజా పాజిటివ్‌గా తేలాడు. డోపింగ్ టెస్టులో జుబేర్ హంజా ఐసీసీకి సహకరించాడని.. పాజిటివ్‌గా తేలడంపై డ్రగ్స్ తీసుకున్నట్లు తానే స్వయంగా ఒప్పుకున్నాడు. అయితే అతనిపై ఐసీసీ వేటు మాత్రమే వేసిందని.. జుబేర్ భవిష్యత్తులో మళ్లీ క్రికెట్ ఆడే అవకాశం ఉంది. అందుకు సీఎస్ఏ, సాకా, డబ్ల్యూపీసీఏ మద్దుతు ఉంటుంది'' అని సీఎస్ఏ తెలిపింది. కాగా 2019లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు ద్వారా జుబేర్ హంజా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఆరు టెస్టులు ఆడి 212 పరుగులు సాధించాడు. గతేడాది నవంబర్‌లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ద్వారా వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన హంజా 56 పరుగులు చేశాడు. ఆ తర్వాత కోవిడ్‌తో ఆ సిరీస్ రద్దయ్యిఇంది. ఇక గతవారం బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు సీఎస్ఏ జట్టును ప్రకటించింది. కాగా జుబేర్ హంజా వ్యక్తిగత కారణాలతో బంగ్లాతో సిరీస్ నుంచి స్వయంగా వైదొలిగాడు. చదవండి: PAK vs AUS: 20 పరుగుల వ్యవధిలో ఆలౌట్.. పేరును సార్థకం చేసుకున్న పాక్ జట్టు క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు.. -
టీమిండియాపై తొలి టెస్టులోనే!
రాంచీ: డీన్ ఎల్గర్, డీకాక్, డుప్లెసిస్ వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట కొత్త ఆటగాడు జుబేర్ హమ్జా తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హమ్జా హాఫ్ సెంచరీ సాధించాడు. 56 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌తో అర్థ శతకం నమోదు చేశాడు. 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో హమ్జా హాఫ్ సెంచరీ సాధించడం సఫారీలకు ఊరటనిచ్చింది. కాగా, హమ్జాకు ఇది తొలి టెస్టు హాఫ్ సెంచరీ. అందులోనూ టీమిండియాపై హమ్జాకు ఇదే తొలి టెస్టు. ఈ ఏడాది ఆరంభంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన హమ్జాకు ఇది రెండో టెస్టు మ్యాచ్ మాత్రమే. ఆడుతున్న రెండో టెస్టులోనే హమ్జా అర్థ శతకం సాధించడం విశేషం. ఈ రోజు ఆటలో భాగంగా అశ్విన్ వేసిన 18 ఓవర్ ఆఖరి బంతిని సిక్స్ కొట్టడంతో హమ్జా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పెద్దగా అంతర్జాతీయ క్రికెట్ అనుభవం లేని 24 ఏళ్ల హమ్జా కీలక సమయంలో సఫారీలకు అండగా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికా పరిస్థితిని గాడిలో పెట్టే యత్నం చేశాడు. అతనికి బావుమా నుంచి సహకారం లభించడంతో అర్థ శతకాన్ని దాదాపు 90.00 స్ట్రైక్‌రేట్‌తో పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు డుప్లెసిస్ మూడో వికెట్‌గా ఔటైన సంగతి తెలిసిందే. సోమవారం ఓవర్‌నైట్ ఆటగాడిగా దిగిన డుప్లెసిస్(1) ఆదిలోనే ఔటయ్యాడు. ఉమేశ్ యాదవ్ వేసిన బంతికి బోల్తా పడిన డుప్లెసిస్ తన వికెట్‌ను బౌల్డ్ రూపంలో సమర్పించుకున్నాడు.