
అలియా భట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అలియా గురించి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హెర్షెల్ గిబ్స్‌కు తెలియదట. ఈ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడు. తన ట్విటర్‌లో అలియా ఎమోజీని షేర్ చేశాడు గిబ్స్. దాంతో అలియా అభిమానులు ఈమె ఎవరో మీకు తెలుసా అని గిబ్స్‌ను ప్రశ్నించారు. అందుకు అతడు తెలియదని సమాధానమిచ్చాడు. దాంతో అలియా అభిమానులు ఆమె బాలీవుడ్ హీరోయిన్ అని, ఆమె గురించి చెప్పడం ప్రారంభించారు. కాసేపటి అలియా నటి అని తెలుసుకున్న గిబ్స్ ‘ఈమె నటి అని నాకు తెలియదు. కానీ చాలా అందంగా ఉంది’ అంటూ సమాధానం ఇచ్చాడు.
గిబ్స్ వ్యాఖ్యలపై అలియా స్పందిస్తూ ఓ ఎమోజీని ట్వీట్ చేసింది. పరుగెడుతున్న నాలుగు పరగులకు సిగ్నల్ ఇస్తున్నట్లు వీడియో పెట్టింది. ఇది అలియా అభిమానులకు తెగ నచ్చింది. రణ్‌బీర్ సర్ దీన్నోసారి చూడండి అంటూ కామెంట్ చేస్తున్నారు.
😃 https://t.co/5IKY4UIu2k pic.twitter.com/dMsGdWbTl2
— Alia Bhatt (@aliaa08) August 27, 2019