దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ విధ్వంసానికి పెట్టింది పేరు. మిస్టర్ 360 డిగ్రీస్ పేరు కలిగిన ఏబీ గ్రౌండ్ నలుమూలలా షాట్లు కొడుతూ క్షణాల్లో ఆట స్వరూపాన్నే మార్చేయగల సత్తా ఉన్నవాడు. అంతర్జాతీయంగా ఎన్నో మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికాను గెలిపించిన డివిలియర్స్.. ఐపీఎల్‌లోనూ అదే జోరు చూపెట్టాడు. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఎక్కువకాలం ఆడిన ఏబీ తన విధ్వంసాన్ని భారత అభిమానులకు చూపెట్టాడు.
చదవండి: పంత్ పాతుకుపోయాడుగా.. అదృష్టం అంటే ఇట్టానే ఉంటాదేమో!
అంతర్జాతీయ క్రికెట్‌కు రెండేళ్ల ముందే గుడ్‌బై చెప్పిన డివిలియర్స్ ఇటీవలే అన్ని రకాల లీగ్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో ఐపీఎల్‌లో ఇక అతని మెరుపులు కనిపించవని అభిమానులు తెగ బాధపడిపోయారు. అలా బాధపడుతున్న ఐపీఎల్ అభిమానులకు ఒక శుభవార్త. త్వరలోనే డివిలియర్స్ మెరుపులు మళ్లీ చూసే అవకాశం వచ్చింది. అదేంటి వీడ్కోలు చెప్పాడుగా.. మళ్లీ వస్తున్నాడా అని సందేహం వద్దు.
చదవండి: పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. సన్‌రైజర్స్‌లోకి కిషన్!
డెవాల్డ్ బ్రెవిస్ అనే కుర్రాడు ప్రస్తుతం అండర్-19 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరపున ఇరగదీస్తున్నాడు. 360 డిగ్రీస్‌లో షాట్లు కొడుతూ అచ్చం డివిలియర్స్‌ను గుర్తుచేస్తున్నాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే విధ్వంసకర షాట్లు ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 169 పరుగులు చేసిన బ్రెవిస్ ఖాతాలో ఒక సెంచరీ ఉండడం విశేషం. ఉగాండాపై సెంచరీ చేసిన డెవాల్డ్ బ్రెవిస్.. టీమిండియాపై 65 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వెస్టిండీస్‌పై మరో అర్థసెంచరీతో మెరిశాడు. ప్రస్తుతం టోర్నీలో టాప్ స్కోరర్‌గా ఉన్న బ్రెవిస్‌కు ఎదురులేకుండా పోయింది.
ఇక టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా 65 పరుగులతో మెరిసిన డెవాల్డ్ బ్రెవిస్.. డివిలియర్స్‌ను గుర్తుచేస్తూ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో తన సహచరులు డ్రెస్సింగ్ రూమ్‌లో ''బేబీ ఏబీ'' అంటూ ప్లకార్డులను పట్టుకొని ఎంకరేజ్ చేయడం వైరల్‌గా మారింది. ఇక ఫిబ్రవరి 12,13 తేదీల్లో ఐపీఎల్ మెగావేలం జరగనున్న నేపథ్యంలో డెవాల్డ్ బ్రెవిస్ వేలానికి వచ్చే అవకాశముందని పలువురు పేర్కొన్నారు. ఒకవేళ అదే నిజమై.. బ్రెవిస్‌ను కొనుగోలు చేస్తే మాత్రం డివిలియర్స్‌ను మరోసారి చూసినట్లేనని అభిప్రాయపడుతున్నారు.
చదవండి: జేసన్ రాయ్ విధ్వంసం.. సిక్సర్లతో వీరవిహారం
👏 Dewald Brevis caught the attention of many in the SA U19's opening #T20KO match.
— Cricket South Africa (@OfficialCSA) October 9, 2021
🏏 How will he and the rest of the SA U19s go throughout the competition?
📲 Catch the full match highlights here https://t.co/zz5ZdsFGsZ pic.twitter.com/DYtMB79FB8
Babay de-Villiers 😍
— . (@federalite7) January 17, 2022
Dewald Brevis from SA U19. pic.twitter.com/xGlDtM1ruL
Comments
Please login to add a commentAdd a comment