
ఐపీఎల్ మెగా వేలం 2022లో ప్రణాళిక ప్రకారం ఆటగాళ్లను కొనుగోలు చేసి ఉత్సాహంగా కనిపిస్తున్న రాజస్థాన్ రాయల్స్.. జట్టులోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్లకు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పింది. ప్రముఖ బాలీవుడ్ చిత్రంలోని ఓ హిట్ పాటను ప్లే చేస్తూ నూతన ఆటగాళ్లను ఆహ్వానించింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం చిత్రంలోని టైటిల్ సాంగ్ కు ఫేస్ మార్ఫింగ్ చేసి, తమ కొత్త ఆటగాళ్లతో వీడియోను రిక్రియేట్ చేసింది. ఈ వీడియోలో షారుక్ ప్లేసులో సంజూ శాంసన్ ముఖాన్ని.. మిగతా వారికి నూతన ఆటగాళ్ల ముఖాలను అంటించి అదిరిపోయే రేంజ్ లో మార్ఫింగ్ వీడియోను రూపొందించింది.
Wait for Sanga’s entry 😂#RoyalsFamily | #IPL2022 | @yuzi_chahal | @JimmyNeesh | @SHetmyer | @KumarSanga2 | @ashwinravi99 | @IamSanjuSamson pic.twitter.com/PGgSJkmk7R
— Rajasthan Royals (@rajasthanroyals) February 15, 2022
ఈ వీడియోలో సంజూ శాంసన్ జట్టులోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన చహల్, జిమ్మీ నీషమ్, షిమ్రోన్ హెట్మేయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్ తదితర ఆటగాళ్లను పాట పాడుతూ, నృత్యంతో ఆహ్వానిస్తూ కనిపించాడు. వీడియో చివర్లో జట్టు డైరెక్టర్ కుమార సంగక్కర ధర్మేంద్రలా వీర లెవెల్లో ఎంట్రీ ఇస్తాడు. వీడియో మొత్తానికి సంగక్కర ఎంట్రీ హైలైట్ గా నిలిచింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు: సంజూ శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చహల్, రియాన్ పరాగ్, కెసి కరియప్ప, ఒబెద్ సైని, నవ్‌దీప్ సైని సింగ్, కుల్దీప్ సేన్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్, తేజస్ బరోకా, కుల్దీప్ యాదవ్, శుభమ్ గర్వాల్, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, డారిల్ మిచెల్.
చదవండి: Virat Kohli: చరిత్ర తిరగరాసేందుకు మరో 73 పరుగుల దూరంలో..
Comments
Please login to add a commentAdd a comment