రాజస్థాన్ రాయల్స్ పేసర్ నాథన్ కౌల్టర్ నైల్ గాయం కారణంగా ఐపీఎల్-2022 నంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజగా అతడి స్థానంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ కార్బిన్ బాష్‌ని రాజస్థాన్ రాయల్స్ భర్తీ చేసింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ వెల్లడించింది. బేస్ ప్రైస్ రూ. 20 లక్షలకు అతడిని రాజస్తాన్ దక్కించుకుంది.
ఇక దేశీవాళీ క్రికెట్‌లో 30 టీ20 మ్యాచ్‌లు ఆడిన బాష్ 151 పరుగులతో పాటు, 18 వికెట్లు పడగొట్టాడు. ఇక రాజస్తాన్ రాయల్స్ విషయానికి వస్తే... ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో పాయింట్ల పట్టికలో రాజస్తాన్ మూడో స్ధానంలో ఉంది. రాజస్తాన్ రాయల్స్ తమ తదపురి మ్యాచ్‌లో మే 15న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.
చదవండి: ఆ క్రికెటర్‌ను బూతులు తిట్టారు.. నెలల వ్యవధిలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు..!
🤷♂️ @boschy14 https://t.co/Jv1Paa6laC pic.twitter.com/HwxVwYXGNb
— Rajasthan Royals (@rajasthanroyals) May 14, 2022
Comments
Please login to add a commentAdd a comment