![IPL 2021: Rassie Van Der Dussen Likely Join Rajasthan Royals Change Fate - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/23/SOuth.jpg.webp?itok=TpJLPHNJ)
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ ఫేలవ ప్రదర్శన కొనసాగిస్తుంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓటములు.. ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది. గురువారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. దీనికి తోడూ ఈ సీజన్‌లో రాజస్తాన్‌కు బట్లర్, మోరిస్ మినహా నిఖార్సైన విదేశీ ఆటగాళ్లు లేరు. ఐపీఎల్‌కు ముందే ఆర్చర్ దూరమవడం.. రెండు మ్యాచ్‌ల తర్వాత బెన్ స్టోక్స్ గాయంతో సీజన్‌కు దూరమవగా.. బయోబబూల్‌లో ఉండలేనంటూ లియాయ్ లివింగ్‌స్టోన్ తాజాగా ఐపీఎల్‌ను వీడాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ వాండర్ డుసెన్ ఐపీఎల్‌లో ఆడడానికి త్వరలోనే జట్టులో చేరనున్నట్లు సమచారం.
నెట్‌వర్క్ 24 చానెల్ అందించిన రిపోర్ట్ ప్రకారం.. రాజస్తాన్ రాయల్స్ వాండర్ డుసెన్‌ను కలిసి ఐపీఎల్‌లో ఆడాలని కోరినట్లు సమాచారం. అందుకు డుసెన్ అంగీకరించాడని.. ఫిట్‌నెస్ టెస్టు అనంతరం జట్టులో చేరనున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయంపై రాజస్తాన్ రాయల్స్ అధికారికంగా స్పందించేవరకు డుసెన్ ఆడే దానిపై స్పష్టత రాలేదు. కాగా దక్షిణాఫ్రికా తరపున ఆడుతున్న డుసెన్ ఇటీవలే పాకిస్తాన్‌తో సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరిచాడు. రెండు వన్డేలు కలిపి 186 పరుగులు చేశాడు. దీనిలో ఒక సెంచరీ ఉండడం విశేషం. మంచి స్ట్రైక్ కలిగిన బ్యాట్స్‌మన్‌గా పేరున్న డుసెన్ 20 టీ20ల్లో 628 పరుగులు చేశాడు. ఇక డుసెన్ రాకతో రాజస్తాన్ రాత మారుతుందోమో చూడాలి అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
చదవండి: ఎవరో ఎందుకని వాళ్లను వాళ్లే ట్రోల్ చేసుకున్నారు..
ఇలా అయితే ఐపీఎల్ నుంచి మొదటగా వెళ్లేది వాళ్లే
Comments
Please login to add a commentAdd a comment