సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్.. ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఆటబయోగ్రఫీ త్వరలోనే విడుదల కానుంది. ''ఫాఫ్: థ్రూ ఫైర్(Faf: Through Fire)'' పేరిట ఆటోబయోగ్రఫీ అక్టోబర్ 28న బుక్ రిలీజ్ జరగనుంది. ఈ సందర్భంగా డుప్లెసిస్ తన జీవితచరిత్ర గురించి ట్విటర్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
''ఒక క్రికెటర్‌గా మాత్రమే మీకు తెలుసు. నేనొక మూసిన పుస్తకాన్ని. ఇన్నాళ్లుగా క్రికెట్ ఆడుతున్నప్పటికి ఒక్కసారి కూడా నా జీవితం, క్రికెట్ లైఫ్ గురించి నాకు తెలిసినవాళ్లకు తప్ప ఎక్కడా బయటపెట్టలేదు. మరో మూడు వారాల్లో నా జీవితం గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది. 'Faf: Through Fire'.. నా స్వీయ చరిత్ర మిమ్మల్ని ఆకట్టుకుంటుంది'' అంటూ ముగించాడు.
ఇక డుప్లెసిస్ సౌతాఫ్రికా తరపున విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా పేరు పొందాడు. కెప్టెన్‌గా డుప్లెసిస్ విన్నింగ్ పర్సంటేజ్ 73.68 శాతం ఉండడం విశేషం. సౌతాఫ్రికా తరపున అన్ని ఫార్మాట్లలో ఆల్‌టైమ్ బ్యాటర్‌గా గుర్తింపు పొందిన డుప్లెసిస్ 2011లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. సౌతాఫ్రికా తరపున డుప్లెసిస్ 69 టెస్టుల్లో 4,163 పరుగులు, 143 వన్డేల్లో 5,507 పరుగులు, 50 టి20ల్లో 1528 పరుగులు సాధించాడు. డుప్లెసిస్ ఖాతాలో టెస్టుల్లో 10 సెంచరీలు, వన్డేల్లో 12 సెంచరీలు, టి20ల్లో సెంచరీ ఉన్నాయి.
సౌతాఫ్రికా తరపున మూడు ఫార్మాట్లలో(టెస్టు, వన్డే, టి20) సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా డుప్లెసిస్ రికార్డులకెక్కాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి పెట్టేందుకు డుప్లెసిస్ 2021లో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అయితే సరైన ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న డుప్లెసిస్ అక్టోబర్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు జట్టులో చోటు దక్కలేదు. ఇక టెంబా బవుమా కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా టి20 ప్రపంచకప్‌లో గ్రూఫ్-2లో పాకిస్తాన్, టీమిండియా, బంగ్లాదేశ్‌తో పాటు క్వాలిఫయింగ్ జట్లతో మ్యాచ్‌లు ఆడనుంది.
I’ve always been a closed book. I haven’t really shared my journey through life and cricket with the people outside of my circle. In three weeks, you will get to be a part of my circle.
— Faf Du Plessis (@faf1307) October 7, 2022
Pre-order here 👇https://t.co/J9cpr3Gi2Nhttps://t.co/FujCqdIuJy#ThroughFire #ComingSoon pic.twitter.com/rUggbyc0bj
చదవండి: 'ఇంజనీర్లు చాలా మంది ఉన్నారు.. ఫాస్ట్ బౌలర్ అవ్వు'
Comments
Please login to add a commentAdd a comment