
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డికాక్ తండ్రి అయ్యాడు. అతని భార్య సాశా గురువారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కూతురికి కియారా అని నామకరణం చేసారు డికాక్ దంపతులు. డికాక్.. తన కూతురుని గుండెలకు హత్తుకుని దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా, భార్య గర్భవతి కావడంతో, ఆమెతో గడిపేందుకు డికాక్ ఇటీవలే టెస్ట్ క్రికెటకు వీడ్కోలు పలికి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
టీమిండియాతో సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో పాల్గొన్న డికాక్.. ఆ మ్యాచ్ అనంతరం టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరిని షాక్‌కి గురి చేశాడు. మరోవైపు, భారత జట్టుతో వన్డే సిరీస్ కోసం ప్రకటించిన దక్షిణాఫ్రికా జట్టులో డికాక్‌కి చోటు దక్కింది.
చదవండి: జకోవిచ్‌పై మండిపడ్డ నదాల్.. టెన్నిస్ దిగ్గజాల మధ్య కోవిడ్ టీకా రచ్చ
Comments
Please login to add a commentAdd a comment