God Father Of English Cricket David English Dies At Age 76 Due To Heart Attack - Sakshi
Sakshi News home page

T20 WC 2022: ఫైనల్‌కు ముంగిట ఇంగ్లండ్‌ జట్టుకు బ్యాడ్‌ న్యూస్‌

Published Sun, Nov 13 2022 12:19 PM | Last Updated on Sat, Dec 3 2022 4:21 PM

God Father Of English Cricket David English Dies Aged 76 - Sakshi

పాకిస్తాన్‌తో ఇవాళ (నవంబర్‌ 13) జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌-2022 ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌ జట్టుకు ఓ బ్యాడ్‌ న్యూస్‌ తెలిసింది. ఇంగ్లండ్‌ క్రికెట్‌కు గాడ్‌ ఫాదర్‌గా చెప్పుకునే డేవిడ్‌ ఇంగ్లిష్‌ (76) గుండెపోటు కారణంగా శనివారం తుదిశ్వాస విడిచారు. ఇంగ్లిష్‌ మరణవార్త తెలిసి ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు దిగ్భ్రాంతికి గురైంది. కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ సహా జట్టులోని ఆటగాళ్లంతా సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జోస్‌ బట్లర్‌.. ఇంగ్లిష్‌తో ఉండిన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బాదా తప్త హృదయంతో ట్వీట్‌ చేశాడు.

ఇంగ్లిష్‌ మరణవార్త కలచి వేసిందని, తాను చూసిన గొప్ప వ్యక్తిత్వం గల మనుషుల్లో ఇంగ్లిష్‌ ఒకరని, ఇంగ్లండ్‌ క్రికెట్‌కు ఎంతో మంది ఉత్తమ క్రికెటర్లను అందించిన ఇంగ్లిష్‌తో గడిపిన క్షణాలు ఎప్పటికీ మరువలేనని, ఇంగ్లిష్‌ ఆత్మకు శాంతి చేకూరాలని సంతాప సందేశం పంపాడు. కాగా, డేవిడ్‌ ఇంగ్లిష్‌.. బన్‌బరీ స్కూల్స్‌ ఫెస్టివల్స్‌ ద్వారా వేల సంఖ్యలో ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్లను, వందల సంఖ్యలో అంతర్జాతీయ క్రికెటర్లను ఇంగ్లండ్‌ జట్టుకు అందించాడు.  
చదవండి: Jos Buttler: రేసులో నేను, మావాళ్లు ఉన్నా, నా ఓటు మాత్రం సూర్యకుమార్‌కే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement