ఇంగ్లండ్‌ పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్‌ విడుదల | India vs England Test series fixtures for June-July 2025 announced | Sakshi
Sakshi News home page

ENG vs IND: ఇంగ్లండ్‌ పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్‌ విడుదల

Published Thu, Aug 22 2024 3:33 PM | Last Updated on Thu, Aug 22 2024 3:55 PM

India vs England Test series fixtures for June-July 2025 announced

భార‌త క్రికెట్ జ‌ట్టు వ‌చ్చే ఏడాది జూన్‌లో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో త‌ల‌ప‌డేందుకు ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. తాజాగా ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు సంయుక్తంగా ప్ర‌కటించాయి.

జూన్ 20-24 మధ్య లీడ్స్‌లోని హెడ్డింగ్లీలో జరగ‌నున్న మొద‌టి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ ముగిసిన వెంటనే ఈ రెడ్‌బాల్ సిరీస్ మొద‌లు కానుంది.

ఈ సిరీస్ డ‌బ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో భాగంగా జ‌ర‌గ‌నుంది. భార‌త జ‌ట్టు ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న జూన్ 20న ప్రారంభ‌మై ఆగ‌స్టు 4న ముగియ‌నుంది. ఇక చివ‌ర‌గా టీమిండియా  2021లో  టెస్టు సిరీస్ కోసం  ఇంగ్లండ్‌లో ప‌ర్య‌టించింది. 

అయితే ఆ సిరీస్ 2-2 డ్రాగా ముగిసింది. భారత శిబిరంలో కోవిడ్-19 వ్యాప్తి కారణంగా నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల తర్వాత సిరీస్ నిలిపివేయబడింది. అప్ప‌టి భార‌త్  2-1 ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత 2022లో జరిగిన చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ 2-2 డ్రా అయింది.

భార‌త్ ఇంగ్లండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్‌
1వ టెస్ట్: 20-24 జూన్, 2025 - హెడ్లింగ్లీ, లీడ్స్
2వ టెస్ట్: 2-6 జూలై, 2025 - ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
3వ టెస్ట్: 10-14 జూలై, 2025 - లార్డ్స్, లండన్
4వ టెస్ట్: 23-27 జూలై, 2025 - ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
5వ టెస్ట్: 31 జూలై-4 ఆగస్టు, 2025 - ది ఓవల్, లండన్
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement