రెండో రోజు ఆటలో భారత సారథి బుమ్రా బ్యాటింగ్‌లో మెరుపులతో, బౌలింగ్‌లో వికెట్లతో అదరగొట్టాడు. మూడో రోజు అద్భుతమైన క్యాచ్‌తో ఇంగ్లండ్ బోర్డు ప్రశంసలందుకున్నాడు. ఓవర్‌నైట్ బ్యాటర్స్ బెయిర్‌స్టో–స్టోక్స్ పాతుకుపోతున్న దశలో శార్దుల్ వేసిన ఓవర్లో కెప్టెన్ స్టోక్స్ బౌండరీ కోసం మిడాఫ్‌లో షాట్ ఆడాడు. సమీపంలో ఉన్న బుమ్రా మెరుపువేగంతో ఎడమవైపు వెనక్కి డైవ్ చేసి క్యాచ్ పట్టేశాడు. నోరెళ్లబెడుతూ స్టోక్స్ నిష్క్రమించాడు. ఇంగ్లండ్ బోర్డు బుమ్రాను అభినందిస్తూ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. శ్రేయస్ అయ్యర్ పట్టిన ఆఖరి వికెట్ సందేహాస్పద క్యాచ్ ‘సాఫ్ట్ సిగ్నల్’ ద్వారా భారత్‌కు అనుకూలమైంది. పాట్స్ ఇచ్చిన ఈ క్యాచ్ రిప్లేలో నేలకు తాకుతున్నట్లు కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment