ఇంగ్లండ్‌ వైట్‌బాల్‌ కోచ్‌గా న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌! | Reports: Brendon McCullum Frontrunner Become England White-ball Coach | Sakshi
Sakshi News home page

Brendon Mccullum: ఇంగ్లండ్‌ వైట్‌బాల్‌ కోచ్‌గా న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌!

Published Fri, May 6 2022 5:32 PM | Last Updated on Fri, May 6 2022 5:56 PM

Reports: Brendon McCullum Frontrunner Become England White-ball Coach - Sakshi

ఇంగ్లండ్‌ టెస్టు కోచ్‌గా క్రిస్‌ సిల్వర్‌వుడ్‌పై వేటు పడినప్పటి నుంచి అతని స్థానంలో కొత్త కోచ్‌ ఎవరనే దానిపై ఈసీబీలో పెద్ద చర్చ నడిచింది. గత ఏడాది కాలంగా ఇంగ్లండ్‌ టెస్టుల్లో దారుణ ప్రదర్శన కనబరుస్తూ వచ్చింది. వరుస సిరీస్‌ ఓటములకు బాధ్యత వహిస్తూ ఇటీవలే  జో రూట్‌ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌కు ఈసీబీ(ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు) టెస్టు పగ్గాలు అప్పజెప్పింది. ఇక టెస్టు ప్రధాన కోచ్‌గా సౌతాఫ్రికా క్రికెట్‌ దిగ్గజం గ్యారీ కిర్‌స్టన్‌ను ఎంపిక చేసింది. 2011లో వన్డే వరల్డ్‌కప్‌ టీమిండియా గెలవడంలో కిర్‌స్టన్‌ పాత్ర మరువలేనిది.

ఇక టెస్టు కోచ్‌తో పాటు.. వైట్‌బాల్‌ క్రికెట్‌ కోచ్‌ను ఈసీబీ ఎంపికచేయనుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌.. ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కోచ్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్‌కు ఆడిన సమయంలో బెస్ట్‌ బ్యాటర్‌గా గుర్తింపు పొందిన మెక్‌కల్లమ్‌.. మంచి వ్యూహాలు పన్నగల కెప్టెన్‌గా రాణించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మెక్‌కల్లమ్‌ ఇంగ్లండ్‌ను గాడిలో పెడతాడని ఈసీబీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇంగ్లండ్‌ కోచ్‌గా పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నట్లు మెక్‌కల్లమ్‌ ఒక ప్రకటనలో తెలిపాడు.

ఇక కిర్‌స్టన్‌ లాగే మెక్‌కల్లమ్‌ కూడా సక్సెస్‌ఫుల్‌ కోచ్‌. ప్రస్తుతం ఐపీఎల్‌లో మెక్‌కల్లమ్‌ రెండుసార్లు​ విజేతగా నిలిచిన కేకేఆర్‌కు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక 2012లో న్యూజిలాండ్‌ క్రికెట్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతని కెప్టెన్సీలో కివీస్‌ 2015 వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్‌ చేరింది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భంగపడి రన్నరప్‌గా నిలిచింది.  

చదవండి: IPL 2022: నైట్‌షిప్టులు..ఏడాది పాటు ఒక్క పూట భోజనం; ఎవరీ కుమార్‌ కార్తికేయ?

Ajaz Patel: భారత్‌పై పదికి పది వికెట్లు తీసిన బౌలర్‌ టీషర్ట్‌ వేలానికి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement