అహ్మదాబాద్: ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ఈసీబీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం ఇంగ్లండ్ లెజెండ్స్, ఇండియా లెజెండ్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పీటర్సన్ మెరుపులతో ఇంగ్లండ్ లెజెండ్స్ విజయాన్ని అందుకుంది. పీటర్సన్ 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులతో విధ్వంసం సృష్టించడంతో ఈ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ 6 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. ఈ విషయంపై స్పందిస్తూ.. ఇంగ్లండ్ లెజెండ్స్ టీమ్ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఈసీబీని ట్యాగ్ చేశాడు. ''ఎట్టకేలకు ఇంగ్లండ్ జ్టటు భారత్‌ను తన సొంతగడ్డపై ఓడించింది.. ఎంత కూల్‌గా సాగిపోయిందో గేమ్ చెప్పండి ఇంగ్లండ్ సెలెక్టర్స్ .. ఇంకా మేము బరిలోనే ఉన్నాం'' అంటూ క్యాప్షన్ జత చేశాడు.
మీరు చేయలేకపోయారు.. మేం చూసి చూపించాం అన్నట్లుగా భారత్‌ను సొంతగడ్డపై ఓడించామని పీటర్సన్ మాటలు బట్టి అర్థమవుతుంది. పీటర్సన్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇటీవలే ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియాను సొంతగడ్డపై ఇంగ్లండ్ ఓడించకపోడంతో పీటర్సన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. కాగా ఇంగ్లండ్, భారత్‌ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం(మార్చి 12న) జరగనుంది.
చదవండి:
యువీని ఉతికారేసిన కెవిన్ పీటర్సన్..
గుణతిలక ‘అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’
Comments
Please login to add a commentAdd a comment