
17 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్‌లో అడుగు పెట్టనుంది. ఈ పర్యటనలో భాగంగా 7 టీ20లు, మూడు టెస్టుల సిరీస్‌లో అతిథ్య జట్టుతో ఇంగ్లండ్ తలపడనుంది. కాగా ఇప్పటికే టీ20 సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. తాజాగా టెస్టు సిరీస్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. ఇక ఇరు జట్లు మధ్య చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 21 వరకు జరగనుంది.
తొలి టెస్టుకు రావల్పిండి, రెండో టెస్టుకు మూల్తాన్ అతిథ్యం ఇవ్వనుండగా.. అఖరి టెస్టు కరాచీ వేదికగా జరగనుంది. అదే విధంగా పాకిస్తాన్ ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ సెప్టెంబర్ 20 నుంచి ఆక్టోబర్2 వరకు జరగనుంది. ఈ సిరీస్‌లోని తొలి నాలుగు మ్యాచ్‌లు కరాచీ నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. అఖరి మూడు టీ20లకు లాహోర్‌లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
కాగా గతేడాది టీ20 ప్రపంచకప్ ముందు ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే ఆటగాళ్ల భద్రత దృష్ట్యా అఖరి నిమిషంలో పాక్ పర్యటను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది. అయితే టీ20 ప్రపంచకప్-2021 ముగిసిన తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులు దుబాయ్‌లో సమావేశమయ్యారు. 2022 ఏడాదిలో ఇంగండ్ జట్టు పాక్‌లో పర్యటించి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు ఇరు బోర్డులు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగానే ఇంగ్లండ్ జట్టు పాక్ గడ్డపై అడుగు పెట్టనుంది.
చదవండి: IND vs ZIM: మూడేళ్ల నిరీక్షణకు తెర.. సెంచరీతో చేలరేగిన శుబ్‌మన్ గిల్
Comments
Please login to add a commentAdd a comment