‘మొయిన్, రషీద్‌ల భద్రతపై ఆందోళన లేదు’ | "Moin, there is concern over the safety of Rashid ' | Sakshi
Sakshi News home page

‘మొయిన్, రషీద్‌ల భద్రతపై ఆందోళన లేదు’

Published Fri, Nov 4 2016 12:17 AM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM

"Moin, there is concern over the safety of Rashid '

లండన్: పాకిస్తాన్ సంతతికి చెందిన తమ ఆటగాళ్లు మొరుున్ అలీ, ఆదిల్ రషీద్‌ల భద్రతపై ఎలాంటి ఆందోళన లేదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) భద్రతా సలహాదారు రెగ్ డికా సన్ స్పష్టం చేశారు. ఇద్దరు ఆటగాళ్లతో ఇప్పటికే మాట్లాడానని, భద్రత గురించి వారికెలాంటి ఆందోళన లేదని, అలాగే సిరీస్ నుంచి వైదొలుగుతామని వారు చెప్పలేదని అన్నారు.

ఇంతకుముందు పాక్‌కు చెందిన అంపైర్ అలీమ్ దార్ ఈ టెస్టు సిరీస్ నుంచి తప్పుకుంటానని చెప్పినట్టు వచ్చిన కథనాలను ఐసీసీ ఖండించింది. భారత్, ఇంగ్లండ్ సిరీస్‌కు ఆయన్ని నియమించలేదని, ఆసీస్-దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఇప్పటికే నామినేట్ చేశామని గుర్తు చేసింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement