అచ్చం ధోనిలానే.. | Adil Rashid successfully pulls off MS Dhoni like no look run out | Sakshi
Sakshi News home page

అచ్చం ధోనిలానే..

Published Mon, May 20 2019 4:47 PM | Last Updated on Mon, May 20 2019 4:52 PM

Adil Rashid successfully pulls off MS Dhoni like no look run out - Sakshi

లీడ్స్‌: భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి, పరిమిత ఓవర్ల క్రికెట్‌ రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోనిని మరిపించాడు ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌. అచ్చం ధోని తరహాలోనే రనౌట్‌ చేసి వార్తల్లో నిలిచాడు. పాకిస్తాన్‌తో ఐదో వన్డేలో భాగంగా బాబర్‌ అజమ్‌ రనౌట్‌ చేసే క్రమంలో చూడకుండానే బంతిని స్టంప్స్‌పైకి విసిరి మన మిస్టర్‌ కూల్‌ను గుర్తు చేశాడు.

మ్యాచ్‌లో భాగంగా 352 పరుగుల ఛేదన లక్ష్యంగా పాక్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఇందులో భాగంగా 27 ఓవర్లో బాబర్‌ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆవలి ఎండ్‌లో పాక్‌ కెప్టెన్ సర్ఫరాజ్‌ ఉన్నాడు. ఆ ఓవర్లో ఆదిల్‌ వేసిన బంతిని కెప్టెన్‌ ఆడాడు. సింగిల్‌ తీద్దామని లెగ్‌ సైడ్‌కి కొట్టాడు. అయితే బంతిని గమనించని బాబర్‌ క్రీజు మధ్యలోకి వచ్చేశాడు. దీన్ని గమనించిన వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌ వెంటనే బంతి అందుకుని ఆదిల్‌వైపు విసిరాడు. దీన్ని అందుకున్న ఆదిల్‌..స్టంప్స్‌ వైపు చూడకుండానే వెనక్కి విసిరాడు. బంతి నేరుగా స్టంప్స్‌ను తాకింది. దీంతో బాబర్‌ ఔటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇంగ్లండ్‌ క్రికెట్ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఇది ధోని కీపింగ్‌ స్టైల్‌ను జ్ఞప్తికి తేవడంతో నెటిజన్లు దీనిపై కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ధోనిని మరిపించిన ఆదిల్‌ రషీద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement