Jofra Archer: ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు ఓ గుడ్ న్యూస్ అందింది. 2022 మెగా వేలంలో 8 కోట్లు కుమ్మరించి కొనుక్కున్న స్టార్ పేసర్, ఇంగ్లండ్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ 2023 సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటాడని కన్ఫర్మ్ అయ్యింది. రానున్న సీజన్‌కు మరో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆర్చర్‌కు సంబంధించిన ఈ వార్త ముంబై ఇండియన్స్ యజమాన్యానికి, ఫ్యాన్స్‌కు భారీ ఊరట కలిగిస్తుంది.
ఆర్చర్ పూర్తి సీజన్‌నుకు అందుబాటులో ఉంటాడన్న విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో పాటు ముంబై ఇండియన్స్ వర్గాలు ధృవీకరించాయి. ఈసీబీ, ఎంఐ యాజమాన్యం సంయుక్తంగా ఆర్చర్ వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేస్తాయని వెల్లడించాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టుతో పాటు ఉన్న ఆర్చర్.. అక్కడ 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ తర్వాత నేరుగా భారత్‌కు చేరుకుంటాడని స్పష్టం చేశాయి.
కాగా, జోఫ్రా ఆర్చర్ గాయాల కారణంగా దాదాపు 18 నెలలపాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇది తెలిసి కూడా ఎంఐ యాజమాన్యం ఆర్చర్‌ను 2022 ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది. గాయం తర్వాత ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆర్చర్.. అంతకుముందు కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. రీఎంట్రీలో సౌతాఫ్రికాతో జరిగిన ఓ వన్డేలో ఆర్చర్ ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. తాజాగా ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ ఆర్చర్ అద్భుతంగా రాణించాడు. ఎస్‌ఏ20 ఇనాగురల్ లీగ్‌లో ఆర్చర్ ముంబై ఇండియన్స్ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన ఎంఐ కేప్‌టౌన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment