
Courtesy: ECB
లండన్: టీమిండియాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఆగష్టు 4 నుంచి నాటింగ్‌హాంలో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి రెండు టెస్టులకు 17 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను ఈసీబీ బుధవారం వెల్లడించింది. సుదీర్ఘ విరామం తర్వాత హసీబ్ హమీద్ ఇంగ్లండ్ జట్టుతో చేరనున్నాడు.
తొలి రెండు టెస్టులకు ఇంగ్లండ్ జట్టు ఇదే:
జో రూట్(కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో, డామ్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జోస్ బట్లర్, జాక్ చావ్లే, సామ్ కరన్, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, ఓలీ పోప్, ఓలీ రాబిన్‌సన్, డామ్ సిబ్లీ, బెన్ స్టోక్స్, మార్క్ వుడ్.
Comments
Please login to add a commentAdd a comment