![England Announce Squad for Ashes - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/10/england.jpg.webp?itok=6RZt_Z3I)
England Announce Squad for Ashes: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఈ ప్రఖ్యాత సిరీస్ డిసెంబర్ 8 నుంచి జనవరి 18 వరకు జరుగనుంది. కాగా 17 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను ఈసీబీ ఆదివారం ప్రకటించింది. ఈ జట్టులో బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్‌కు చోటు దక్కలేదు. కాగా స్టోక్స్.. ఐపీఎల్‌లో గాయం తర్వాత మానసిక సమస్యల కారణంగా భారత్‌తో టెస్ట్ సిరీస్, ఐపీఎల్ సెకెండ్ ఫేజ్, టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
అయితే క్వారంటైన్ నిబంధనలు సడలించాలని కొందరు ఇంగ్లాండ్ క్రికెటర్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డును అభ్యర్ధించారు. అయితే వాళ్ల అభ్యర్ధను ఆస్ట్రేలియా తిరష్కరించంది. దీంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆస్ట్రేలియా లో పర్యటించేందుకు అభ్యంతరం వ్యక్తం చేయడంతో యాషెస్ సీరీస్‌పై సందిగ్ధత ఏర్పడింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, ఆసీస్ బోర్డుతో చర్చలు జరిపింది. క్వారంటైన్ నిబంధనలను సడలించేందకు ఆస్ట్రేలియా అంగీకరించడంతో యాషెస్ సిరీస్ యాదా విధంగా జరగనుంది
ఇంగ్లండ్ జట్టు: జో రూట్ (కెప్టెన్), జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్‌స్టో, డామ్ బెస్, రోరీ బర్న్స్, స్టువర్ట్ బ్రాడ్, జోస్ బట్లర్, జాక్ క్రావ్లీ, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, డేవిడ్ మలాన్, క్రెగ్ ఓవర్టన్, ఓల్లీ పోప్, ఓల్లీ రాబిన్‌సన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్
Comments
Please login to add a commentAdd a comment