
లండన్: ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తొలిసారి నిర్వహించిన ‘ది హండ్రెడ్’ టోర్నీ మహిళల టైటిల్‌ను ఓవల్ ఇన్‌విన్సిబుల్స్ జట్టు సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో ఓవల్ 48 పరుగుల తేడాతో సదరన్ బ్రేవ్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇన్‌విన్సిబుల్స్ 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. మరిజాన్ కాప్ (26), వాన్ నికెర్క్ (26), ఫ్రాన్ విల్సన్ (25) రాణించారు. అనంతరం బ్రేవ్ టీమ్ 100 బంతుల్లో 73 పరుగులకే కుప్పకూలింది. 29 పరుగులకే ఆ జట్టు 7 వికెట్లు కోల్పోగా, ఫి మోరిస్ (23) పోరాడింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మరిజాన్ కాప్ 9 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment