IPL 2023 Trading: భారత ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీకి మారాడు. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఆడిన శార్దుల్ 14 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. 120 పరుగులు చేశాడు. క్యాపిటల్స్ జట్టు మెగా వేలంలో అతన్ని రూ.10.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న శార్దుల్‌ను ఫ్రాంచైజీల మధ్య ట్రేడింగ్‌లో భాగంగా కోల్‌కతా తీసుకుంది.
ఫ్రాంచైజీలకు రిటెయిన్ (అట్టిపెట్టుకోవడం), రిలీజ్ (విడుదల) లేదంటే ట్రేడింగ్ (కొనుగోలు) గడువు మంగళవారంతో ముగియనుంది. ఇంగ్లండ్ వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ వచ్చే సీజన్ ఐపీఎల్‌కు గైర్హాజరవుతానని ప్రకటించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు సంప్రదాయ ఫార్మాట్ (టెస్టు)పై మరింత దృష్టిపెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ మాత్రం ఐపీఎల్ ఆడేందుకు ఆటగాళ్ల వేలానికి అందుబాటులో ఉంటానన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment