ఐపీఎల్-2023 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్, విడుదల చేసే ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని నవంబర్ 15 వరకు బీసీసీఐ గడువు విధించింది. ఈ క్రమంలో ఆయా ఫ్రాంజైలు తాము రిటైన్, విడుదల చేసే ఆటగాళ్ల పేర్లను ప్రకటిస్తున్నాయి.
తాజాగా యువ ఆటగాడు అయుష్ బదోని రిటైన్ చేసుకున్నట్లు లక్నో సూపర్ జెయింట్స్ ప్రకటించింది. ఈ విషయాన్ని లక్నో ట్విటర్ వేదికగా వెల్లడించింది. కాగా ఈ ఏడాది సీజన్‌లో లక్నో తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన బదోని ఆకట్టుకున్నాడు. ఐపీఎల్-2022లో 11 మ్యాచ్‌లు ఆడిన బదోని 161 పరుగులు చేశాడు.
అదే విధంగా ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా బదోని అదరగొట్టాడు. ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించిన అయుష్ తమ జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు.
Never underestimate the young guns! We’re all waiting to watch Ayush Badoni perform like a boss🙌
— Lucknow Super Giants (@LucknowIPL) March 12, 2022
Welcome aboard, Ayush💪🔥#AyushBadoni #YoungGuns #LucknowSuperGiants #TATAIPL pic.twitter.com/W84bClwYdV
చదవండి: T20 WC Final: ఇంగ్లండ్, పాక్ ఫైనల్.. ఆకట్టుకున్న 13 ఏళ్ల జానకి ఈశ్వర్
Comments
Please login to add a commentAdd a comment