ఐపీఎల్ 2023 వేలంలో భారత ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనాద్కట్ 11వ సారి వేలంలోకి వచ్చాడు. లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని రూ.50 లక్షలకు దక్కించుకుంది. దేశవాళీ క్రికెట్‌లో స్టార్ బౌలర్ అయిన ఉనాద్కట్ 2018 తర్వాత ఇంత తక్కువ ధరకు అమ్ముడుపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అతి తక్కువ ధరకు అమ్ముడుపోయాడు. 2018లో అతడిని రాజస్థాన్ రాయల్స్ రూ.11.5 కోట్లకు కొన్నది.
అయితే ఆ సీజన్‌లో అతను పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా కూడా 2019లో అతడిని 8.4 కోట్లకు మళ్లీ కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2020, 21లో రూ. 3 కోట్లకు ఉనాద్కట్‌ను రాజస్థాన్ రాయల్స్ అట్టిపెట్టకుంది. పోయిన సీజన్ వేలంలో ఉనాద్కత్‌ను ముంబై ఇండియన్స్ 1.3 కోట్లకు సొంతం చేసుకుంది. ఉనాద్కట్ 2010లో కేకేఆర్ తరఫున ఐపీఎల్‌లో ఆరంగ్రేటం చేశాడు.
అయితే.. అతని ఐపీఎల్ కెరీర్ 2017లో మలుపు తిరిగింది. ఆ సీజన్‌లో పూణె సూపర్ జెయింట్స్‌కు ఆడిన ఉనాద్కట్ 12 మ్యాచుల్లోనే 24 వికెట్లు తీశాడు. దాంతో తర్వాతి సీజన్‌లో అతడిని సొంతం చేసుకునేందుకు రాజస్థాన్ రాయల్స్ రూ.11.5 పెట్టింది. దేశవాళీ టోర్నీల్లో సౌరాష్ట్ర తరఫున ఉనాద్కట్ అద్భుత ప్రదర్శన చేశాడు. దాంతో 12 ఏళ్ల తర్వాత మళ్లీ అతడికి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఉనాద్కట్ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీశాడు.
చదవండి: IPL 2023: అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు రూ.5.5 కోట్లు.. ఎవరీ ముఖేష్ కుమార్?
Comments
Please login to add a commentAdd a comment