
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ నికోలస్ పూరన్‌కు అదృష్టం తలుపు తట్టింది. ఐపీఎల్ 2023 మినీ వేలంలో పూరన్‌కు జాక్‌పాట్ తగిలింది. రూ. 16 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని సొంతం చేసుకుంది. తద్వారా వేలం చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన వికెట్ కీపర్‌గా నికోలస్ పూరన్ రికార్డులకెక్కాడు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మెగావేలంలో పూరన్‌ను రూ. 10.75 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ దక్కించుకుంది
14 మ్యాచ్‌ల్లో 306 పరుగులు చేసిన పూరన్ పెద్దగా రాణించకపోవడంతో మినీ వేలానికి ముందు అతన్ని రిలీజ్ చేసింది. అలా రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చి రూ. 16 కోట్లకు అమ్ముడుపోవడం పూరన్‌కే సాధ్యమైంది. ఆ తర్వాత టి20 ప్రపంచకప్‌లోనూ విండీస్ దారుణంగా విఫలమైంది. అతని కెప్టెన్సీలోని వెస్టిండీస్ గ్రూప్ దశకే పరిమితమైంది. ఆ తర్వాత అతను వెస్టిండీస్ కెప్టెన్‌గా పక్కకు తప్పుకున్నాడు. ఇంత నెగెటివ్ ఉన్నప్పటికి పూరన్‌కు భారీ ధర పలకడం అందరిని ఆశ్చర్యపరిచింది.
అయితే ప్రైవేట్ లీగ్ టోర్నీల్లో పూరన్‌కు మంచి రికార్డు ఉంది. అబుదాబి టి10 లీగ్‌లోనూ పూరన్ మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇక రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన పూరన్ కోసం మొదట సీఎస్‌కే, రాజస్తాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. రూ. 3 కోట్లు దాటగానే ఢిల్లీ క్యాపిటల్స్ లైన్‌లోకి వచ్చింది. ఆ తర్వాత రూ. 6 కోట్ల వరకు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్స్ పోటీ పడ్డాయి. ఇక ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ పోటీలోకి వచ్చింది. రూ. 7.25 కోట్ల నుంచి ఒకేసారి రూ. 15 కోట్ల వరకు వెళ్లింది. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ రూ. 16 కోట్లకు పూరన్‌ను దక్కించుకుంది.
చదవండి: Cameron Green: హాట్ ఫేవరెట్ కావొచ్చు.. కానీ అంత ధరెందుకు?
Comments
Please login to add a commentAdd a comment