Ayush Badoni
-
భారత్ ‘ఎ’ హ్యాట్రిక్ గెలుపు
మస్కట్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత ‘ఎ’ జట్టు ఎమర్జింగ్ ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘనవిజయాలు సాధించిన తిలక్ వర్మ సారథ్యంలోని భారత ‘ఎ’ జట్టు మూడో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ ఒమన్‌ను చిత్తు చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టు 6 వికెట్ల తేడాతో ఒమన్‌పై గెలిచింది. ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్ ‘ఎ’ జట్టు 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. మొహమ్మద్ నదీమ్ (49 బంతుల్లో 41; 3 ఫోర్లు) టాప్ స్కోరర్. భారత్ ‘ఎ’ బౌలర్లలో అఖీబ్ ఖాన్, రసిఖ్ సలామ్, నిషాంత్, రమణ్‌దీప్ సింగ్, సాయికిశోర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా 15.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆయుష్ బదోనీ (27 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు హాఫ్‌సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ తిలక్ వర్మ (30 బంతుల్లో 36 నాటౌట్; ఒక ఫోర్, 2 సిక్సర్లు), అభిషేక్ శర్మ (15 బంతుల్లో 34; 5 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. శుక్రవారం జరగనున్న రెండో సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్ ‘ఎ’ జట్టుతో భారత్ ‘ఎ’ తలపడనుంది. -
వారెవ్వా బదోని.. వాటే క్యాచ్! మైండ్ బ్లోయింగ్(వీడియో)
ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో భారత-ఎ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం అల్ అమెరత్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ విజయంతో ఇండియా తమ సెమీఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆయుష్ బదోని సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ఆయుష్ బౌండరీ లైన్ వద్ద తన అద్బుత విన్యాసంతో అందరిని ఆశ్చర్యపరిచాడు. యూఏఈ ఇన్నింగ్స్ 15 ఓవర్ వేసిన రమణదీప్ సింగ్ ఆఖరి బంతిని జవదుల్లాకు లెగ్ స్టంప్ లైన్ దిశగా ఫుల్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో జవదుల్లా తన ఫ్రంట్ ఫుట్‌ను క్లియర్ చేసి లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడాడు. షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో బంతి కచ్చితంగా బౌండరీకి పోతుందని అంతా భావించారు. కానీ బౌండరీ లైన్ వద్ద ఉన్న బదోని అందరి అంచనాలను తారుమారు చేశాడు.వైడ్ లాంగ్-ఆన్ పొజిషన్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన బదోని.. గాలిలో డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: ఐపీఎల్ వల్లే నాశనం.. ఆ సిరీస్ ఎందుకు దండగ? 𝐅𝐥𝐢𝐠𝐡𝐭 𝐦𝐨𝐝𝐞 🔛A super catch by Ayush Badoni! 👐@BCCI#MensT20EmergingTeamsAsiaCup2024 #ACC pic.twitter.com/imOQae1Xu6— AsianCricketCouncil (@ACCMedia1) October 21, 2024 -
19 సిక్సర్లు.. సెంచరీ... ఎవరీ అరివీర భయంకర బ్యాట్స్‌మెన్?
ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024లో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ కెప్టెన్ ఆయుష్ బదోని విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్‌లో భాగంగా నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో బదోని చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఈ యువ సంచలనం ఊచకోత కోశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్టేడియం నలుమూలులా సిక్సర్ల బాదుతూ తన విశ్వరూపాన్ని బదోని చూపించాడు. ఈ క్రమంలో కేవలం 39 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో కేవలం 55 బంతులు మాత్రమే ఎదుర్కొన్న బదోని 8 ఫోర్లు, 19 సిక్స్‌లతో ఏకంగా 165 పరుగులు చేశాడు. అతడితో పాటు ఓపెనర్ ప్రియాంష్ ఆర్య విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 50 బంతులు ఎదుర్కొన్న ఆర్య.. 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో 120 పరుగులు సాధించాడు.దీంతో సౌత్ ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 309 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులే చేసింది. దీంతో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ 112 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.అంతా గంభీర్ వల్లే..ఆయుష్ బదోని సక్సెస్ వెనక టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఉన్నాడనే చెప్పకోవాలి. బదోని కెరీర్ ఎదుగుదలలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు బదోని ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.2022 సీజన్లో ఈ క్యాష్ రిచ్ లీగ్‌లోకి బదోని అడుగుపెట్టాడు. అయితే ఇదే సమయంలో లక్నో మెంటార్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతీ.. తన అనుభవంతో బదోనిని రాటుదేల్చాడు. కాగా లక్నో జట్టులోకి బదోని రావడానికి గల కారణం కూడా గౌతీనే. ఐపీఎల్లో వేలంలో అతడి సలహా మెరకే బదోనిని లక్నో ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. రెండు సీజన్ల పాటు లక్నో మెంటార్‌గా కొనసాగిన గంభీర్.. బదోనికి ఎంతో సపోర్ట్‌గా నిలిచాడు. ఈ విషయాన్ని చాలా సందర్బాల్లో అయూష్ సైతం ధ్రువీకరించాడు. గంభీర్‌కు తనకు పెద్దన్న లాంటి వాడని అయూష్ పలుమార్లు చెప్పుకొచ్చాడు. -
ఢిల్లీ ఆటగాడి తుపాన్ ఇన్నింగ్స్.. 6 బంతుల్లో 6 సిక్స్‌లు! వీడియో
ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024లో సంచలనం నమోదైంది. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదాడు. ఈ లీగ్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్‌తో మ్యాచ్‌లో ప్రియంష్ ఈ ఘనత సాధించాడు. సౌత్ ఢిల్లీ ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన స్పిన్నర్ మనన్ భరద్వాజ్ బౌలింగ్‌లో ప్రియంష్ వరుసగా 6 సిక్స్‌లు బాదాడు. ఆ ఓవర్లో తొలి బంతిని లాంగ్ ఆఫ్ మీదగా సిక్స్ బాదిన ప్రియాంష్.. రెండవ బంతిని డీప్ మిడ్ వికెట్ దిశగా స్టాండ్స్‌లోకి పంపించాడు. ఆ తర్వాతి నాలుగు బంతులను కూడా ఆర్య సిక్సర్లగా మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును ప్రియంష్ ఆర్య తన పేరిట లిఖించుకున్నాడు. ఓకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన మూడో భారత క్రికెటర్‌గా ప్రియాంష్ నిలిచాడు. అంతకుముందు రవిశాస్త్రి, యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదారు.ఇక ఈ మ్యాచ్‌లో ప్రియాంష్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 50 బంతులు ఎదుర్కొన్న ఆర్య.. 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో 120 పరుగులు సాధించాడు. అతడితో పాటు మరో ఢిల్లీ సూపర్ స్టార్జ్ ఆటగాడు ఆయూష్ బదోనీ కూడా భారీ సెంచరీతో మెరిశాడు. కేవలం 55 బంతుల్లో 8 ఫోర్లు, 19 సిక్స్‌లతో 165 పరుగులు చేశాడు. వీరిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్‌ల ఫలితంగా సౌత్ ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీ స్కోర్ సాధించింది.చదవండి: నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన సఫారీ క్రికెటర్ View this post on Instagram A post shared by Delhi Premier League T20 (@delhipremierleaguet20) -
Badoni-Livingstone: రెచ్చగొట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు, ఆతర్వాత..!
ఐపీఎల్-2023లో భాగంగా పంజాబ్ కింగ్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య నిన్న (ఏప్రిల్ 28) జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం అందరి దృష్టిని ఆకర్శించింది. లక్నో బ్యాటింగ్ సమయంలో ఆయూష్ బదోని, పంజాబ్ బౌలర్ లియామ్ లవింగ్‌స్టోన్ మధ్య చిన్నపాటి డ్రామా నడిచింది. ఇద్దరూ ఎత్తుకుపై ఎత్తులు వేశారు. అయితే అంతిమంగా లివింగ్‌స్టోనే విజయం సాధించాడు. Badoni vs Livingstone #PBKSvLSG pic.twitter.com/nwFtXgaXgy — Aakash Chopra (@Aakash_Vani_1) April 28, 2023 ఇంతకీ ఏం జరిగిందంటే.. లక్నో ఇన్నింగ్స్ 14వ ఓవర్ రెండో బంతి పడేందుకు అంతా సిద్ధంగా ఉంది. అయితే బ్యాటర్ బదోని రివర్స్ స్వీప్ ఆడతాడన్న విషయాన్ని ముందే పసిగట్టిన బౌలర్ లివింగ్‌స్టోన్ ఆఖరి క్షణంలో బంతి వేయకుండా ఆగిపోయాడు. దీంతో చిర్రెత్తిపోయిన బదోని.. ఆ తర్వాతి బంతికి లివింగ్‌స్టోన్‌కు టిట్ ఫర్ టాట్ చేసి చూపించాడు. అచ్చం లివింగ్‌స్టోన్ చేసిన లాగానే, ఆఖరి క్షణంలో బంతిని ఎదుర్కోకుండా పక్కకు తప్పుకున్నాడు. ICYMI - Six and a Wicket! Liam Livingstone with the last laugh as Ayush Badoni gets caught in the deep after scoring 43 runs. Live - https://t.co/6If1I4omN0 #TATAIPL #PBKSvLSG #IPL2023 pic.twitter.com/gxUTK8vGDC — IndianPremierLeague (@IPL) April 28, 2023 ఈ డ్రామా ఇంతటితో అయిపోలేదు. ఎట్టకేలకు 14వ ఓవర్ రెండో బంతి పడింది. అప్పటికే లివింగ్‌స్టోన్‌పై కసితో రగిలిపోతున్న బదోని, బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. సిక్సర్ కొట్టాక లివింగ్‌స్టోన్ ఊరికే ఉంటాడా.. మరోసారి అదే తరహా బంతి వేసి బదోనిని బోల్తా కొట్టాంచాడు. లివింగ్‌స్టోన్ పన్నిన ఉచ్చులో చిక్కుకున్న బదోని.. అదే బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్‌లో ఉన్న రాహుల్ చాహర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో లివింగ్‌స్టోన్.. బదోనిపై పైచేయి సాధించినట్లైంది. డ్రామా మొదలెట్టిన లివింగ్‌స్టోనే చివరికి విజయం సాధించాడు. ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌పై లక్నో 56 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో తడబడిన పంజాబ్, తమ శక్తి మేరకు ప్రయత్నించి 201 పరుగులకు (19.5) ఆలౌటైంది. లక్నో ఇన్నింగ్స్‌లో కైల్ మేయర్స్ (54), ఆయూష్ బదోని (43), స్టోయినిస్ (72), పూరన్ (45) సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడగా.. పంజాబ్ తరఫున అథర్వ టైడే (66), సికందర్ రజా (36), లివింగ్‌స్టోన్ (23), కర్రన్ (21), జితేశ్ శర్మ (24) ఓ మోస్తరుగా రాణించారు. లక్నో బౌలర్లు యశ్ ఠాకూర్ 4, నవీన్ ఉల్ హాక్ 3, బిష్ణోయ్ 2, స్టోయినిస్ ఓ వికెట్ సాధించారు. -
హైదరాబాద్ రాత మారలేదంతే! ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ ఘోర ఓటమి
Ranji Trophy 2022-23 - Hyderabad vs Delhi: రంజీ ట్రోఫీ 2022-23ని హైదరాబాద్ క్రికెట్ జట్టు మరో ఓటమితో ముగించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా ఢిల్లీ జట్టుతో ఉప్పల్‌లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. కాగా ఆట మూడో రోజు(గురువారం) ఓవర్‌నైట్ స్కోరు 223/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఢిల్లీ జట్టు ఆయుశ్ బదోని వీరోచిత సెంచరీతో భారీ స్కోరు నమోదు చేసింది. అదరగొట్టిన ఆయుశ్ బదోని నిజానికి 277 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి 300 పరుగుల్లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. అయితే ఆయుశ్ బదోని (191; 24 ఫోర్లు, 6 సిక్స్‌లు) అసాధారణరీతిలో ఆడి భారీ సెంచరీ సాధించాడు. పదో నంబర్ బ్యాటర్ హర్షిత్ రాణా (58; 8 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఆయుశ్ ఢిల్లీ జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించాడు. ఆయుశ్, హర్షిత్ తొమ్మిదో వికెట్‌కు 122 పరుగులు జోడించారు. ‘డబుల్ సెంచరీ’కి చేరువైన దశలో.. అనికేత్ రెడ్డి బౌలింగ్‌లో ఆయుశ్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత దివిజ్ మెహ్రా (8 నాటౌట్)తో కలిసి హర్షిత్ చివరి వికెట్‌కు 34 పరుగులు జత చేశాడు. అజయ్‌దేవ్ గౌడ్ బౌలింగ్‌లో హర్షిత్ ఎల్బీగా వెనుదిరగడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి 143 పరుగులిచ్చి 5 వికెట్లు, అజయ్‌దేవ్ గౌడ్ 87 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు. ఢిల్లీ భారీ స్కోరు ఈ నేపథ్యంలో 433 పరుగులకు ఆలౌటైన ఢిల్లీ 78 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసి కేవలం 12 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 124 వద్ద రెండో ఇన్నింగ్స్ ముగించింది. 7 వికెట్లతో చెలరేగిన హర్షిత్ రాణా ఇక తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులతో అజేయంగా నిలిచిన రోహిత్ రాయుడు.. రెండో ఇన్నింగ్స్‌లో 32 పరుగులతో హైదరాబాద్ బ్యాటర్లలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగిలిన వాళ్లలో తోల్కంటి గౌడ్ (21), ప్రణీత్ రాజ్ మాత్రమే (27) 20 పైగా పరుగులు చేశారు. మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు. ఢిల్లీ బౌలర్ హర్షిత్ రాణా ధాటికి బెంబేలెత్తి పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో 124 పరుగులకే హైదరాబాద్ ఆలౌట్ అయింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఢిల్లీ ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైంది. కాగా 12 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి 7 వికెట్లు కూల్చి హైదరాబాద్ జట్టు పతనాన్ని శాసించిన హర్షిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మరో ఢిల్లీ బౌలర్ దివిజ్ మెహ్రా 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ‘ప్లేట్’ డివిజన్‌కు పడిపోయిన హైదరాబాద్ హైదరాబాద్ కేవలం ఒక్క పాయింట్‌తో గ్రూప్ ‘బి’లోనే కాకుండా ఎలైట్ లీగ్‌లోని నాలుగు గ్రూప్‌ల్లో కలిపి చివరి స్థానంలో నిలిచింది. కాగా ఎలైట్ గ్రూప్‌ల్లో ఓవరాల్‌గా చివరి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు వచ్చే సీజన్‌కు ‘ప్లేట్’ డివిజన్‌కు పడిపోతాయి. రంజీ ట్రోఫీ 2022-23 హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ స్కోర్లు హైదరాబాద్- 355 & 124 ఢిల్లీ- 433 & 47/1 చదవండి: Sania Mirza: సానియా మీర్జా భావోద్వేగం.. ఓటమితో ముగింపు! కెరీర్లో ఎన్ని గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు అంటే? Axar Patel: పెళ్లి పీటలెక్కిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్.. ఫొటోలు వైరల్ -
యువ ఆటగాడిని రిటైన్ చేసుకున్న లక్నో..
ఐపీఎల్-2023 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్, విడుదల చేసే ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని నవంబర్ 15 వరకు బీసీసీఐ గడువు విధించింది. ఈ క్రమంలో ఆయా ఫ్రాంజైలు తాము రిటైన్, విడుదల చేసే ఆటగాళ్ల పేర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా యువ ఆటగాడు అయుష్ బదోని రిటైన్ చేసుకున్నట్లు లక్నో సూపర్ జెయింట్స్ ప్రకటించింది. ఈ విషయాన్ని లక్నో ట్విటర్ వేదికగా వెల్లడించింది. కాగా ఈ ఏడాది సీజన్లో లక్నో తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన బదోని ఆకట్టుకున్నాడు. ఐపీఎల్-2022లో 11 మ్యాచ్‌లు ఆడిన బదోని 161 పరుగులు చేశాడు. అదే విధంగా ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా బదోని అదరగొట్టాడు. ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించిన అయుష్ తమ జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. Never underestimate the young guns! We’re all waiting to watch Ayush Badoni perform like a boss🙌 Welcome aboard, Ayush💪🔥#AyushBadoni #YoungGuns #LucknowSuperGiants #TATAIPL pic.twitter.com/W84bClwYdV — Lucknow Super Giants (@LucknowIPL) March 12, 2022 చదవండి: T20 WC Final: ఇంగ్లండ్, పాక్ ఫైనల్.. ఆకట్టుకున్న 13 ఏళ్ల జానకి ఈశ్వర్ -
IPL 2022: ఈ ఏడాది ఎమర్జింగ్ ప్లేయర్ అతడే!
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఎంతో మంది యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం వచ్చింది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడితే కాసుల వర్షం కురవడమే కాదు.. ఒక్కసారి తమను తాము నిరూపించుకుంటే జాతీయ జట్టు తరఫున ఆడే ఛాన్స్ వస్తుందన్న నమ్మకాన్ని ఆటగాళ్లలో నింపింది. ఇక ప్రతి ఏడాది సీజన్ ముగింపు సమయంలో టోర్నీ ఆసాంతం అద్భుత ఆటతీరు కనబరిచిన యువ క్రికెటర్‌కు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇస్తారన్న సంగతి తెలిసిందే. టీమిండియా ప్రస్తుత కెప్టెన్, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ సహా అక్షర్ పటేల్, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్ తదితర భారత ఆటగాళ్లు ఈ అవార్డు అందుకున్నారు. ఇక గత రెండు సీజన్లలో దేవ్‌దత్ పడిక్కల్(2020), రుతురాజ్ గైక్వాడ్(2021) వరుసగా ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచారు. అదే విధంగా ఇప్పటివరకు ఈ అవార్డు అందుకున్న ఒకే ఒక విదేశీ ప్లేయర్‌గా ముస్తాఫిజుర్ రెహమాన్(2016) తన పేరును పదిలం చేసుకున్నాడు. ఇక ఐపీఎల్-2022 సీజన్లో ఆయుష్ బదోని, తిలక్ వర్మ, సాయి సుదర్శన్, అనూజ్ రావత్ తదితర ఆటగాళ్లు మెరుగ్గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ దీప్‌దాస్ గుప్తా ఈ ఏడాది ఎమర్జింగ్ ప్లేయర్‌గా ఎవరు నిలుస్తారన్న అంశంపై అంచనా వేశాడు. ఈ మేరకు క్రిక్‌ట్రాకర్ షోలో అతడు మాట్లాడుతూ.. ‘‘ ఈ ఏడాదితో ఐపీఎల్‌ను మొదలుపెట్టిన ఆటగాళ్లనే పరిగణనలోకి తీసుకుంటాను. తిలక్ వర్మ బాగా ఆడుతున్నాడు. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సైతం రాణిస్తున్నాడు. అయితే అతడు ఎప్పటి నుంచో ఆడుతున్నాడు కాబట్టి పక్కన పెడుతున్నా. నా అభిప్రాయం ప్రకారం ఆయుష్ బదోని ఈసారి ఎమర్జింగ్ ప్లేయర్‌గా నిలుస్తాడు’’ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ కొత్త ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బదోని.. 8 మ్యాచ్‌లలో కలిపి 134 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 54. గుజరాత్ టైటాన్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లోనే 41 బంతుల్లో 54 పరుగులు చేసి సత్తా చాటాడు. అంతేగాక ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక తెలుగు కుర్రాడు తిలక్ వర్మ విషయానికొస్తే.. ముంబై ఇండియన్స్ తరఫున ఆడతున్న అతడు ఇప్పటి వరకు 272 పరుగులు సాధించాడు. ఐపీఎల్-2022లో ముంబై బ్యాటర్లలో ఇప్పటి వరకు అతడే టాప్ స్కోరర్ కావడం విశేషం. కాగా మెగా వేలం-2022లో భాగంగా లక్నో బదోనిని రూ. 20 లక్షలకు కొనుగోలు చేయగా.. ముంబై తిలక్ కోసం ఏకంగా 1.7 కోట్లు ఖర్చు చేసింది. చదవండి👉🏾RCB Vs RR: మొన్న 68 పరుగులకే ఆలౌట్.. అక్కడేమో అత్యల్ప స్కోరు 73..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కోహ్లి స్టైల్లో బదోని సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
ఆయుష్ బదోని ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఒక యువ సంచలనం. ఐపీఎల్-2022లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బదోని తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు లక్నో సాధించిన ప్రతీ విజయంలోను బదోని తన వంతు పాత్ర పోషించాడు. ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీ సాధించి తన సత్తా ఎంటో చూపించాడు. కాగా గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే లక్నో విజయానికి మూడు బంతుల్లో ఒక్క పరగు కావల్సిన నేపథ్యంలో.. బదోని సిక్స్ బాది లక్నోకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో బదోని.. కోహ్లి స్టైల్లో విన్నింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. అతడు తన జెర్సీ వెనుక భాగంలో ఉన్న తన పేరును చూపిస్తూ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. గతంలో కోహ్లి కూడా ఇదే విధంగా సెలబ్రేషన్స్ జరపుకునే వాడు. ఇక ఈ మ్యాచ్‌లో మూడు బంతులు ఎదర్కొన్న బదోని 10 పరుగులు సాధించాడు. బదోని సెలబ్రేషన్స్‌కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. "కింగ్ కోహ్లిని బదోని ఆదర్శంగా తీసుకున్నాడు" అని కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: IPL 2022: 10 కోట్లకు అమ్ముడుపోతాడనుకున్నా! ఏదేమైనా లక్నోది సరైన నిర్ణయం VIRAT KOHLI INFLUENCE ON YOUNGER GENERATION. #AyushBadoni #IPL2022 #ViratKohli𓃵 pic.twitter.com/GdadsAFIXV — Hemant Singh (@hemant18326) April 8, 2022 -
దుమ్మురేపుతున్న టీమిండియా అన్క్యాప్డ్ ఆటగాళ్లు.. భవిష్యత్తు వీళ్లదే
క్యాష్ రిచ్ లీగ్‌గా పేరు పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆటగాళ్ల టాలెంట్‌కు కొదువ లేదు. ప్రతీ ఏడాది నిర్వహించే ఐపీఎల్ సీజన్ ద్వారా ప్రతిభావంతమైన ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. రవీంద్ర జడేజా, అజింక్యా రహానే, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ సహా మిగతా స్టార్ ఆటగాళ్లంతా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చినవాళ్లే. తాజాగా ఐపీఎల్ 2022 ప్రారంభమై కొన్ని రోజులే అయినప్పటికి ఒక ముగ్గురు టీమిండియా అన్క్యాప్డ్ ప్లేయర్స్ మాత్రం సత్తా చాటుతున్నారు. వారే ఆయుష్ బదోని, తిలక్ వర్మ, లలిత్ యాదవ్. భవిష్యత్తు ఆశాకిరణంలా కనిపిస్తున్న ఈ ఆటగాళ్లను ఒకసారి పరిశీలిద్దాం. -సాక్షి, వెబ్‌డెస్క్ ఎన్. తిలక్ వర్మ: Courtesy: IPL హైదరాబాద్‌కు చెందిన తిలక్ వర్మ ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2020 అండర్-19 ప్రపంచకప్ జట్టులో తిలక్ వర్మ సభ్యుడు. దేశవాలీ టోర్నీలైన విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీల్లో మంచి ప్రదర్శన కనబరిచి ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. ఫిబ్రవరిలో జరిగిన మెగావేలంలో ముంబై ఇండియన్స్ తిలక్ వర్మను రూ. 1.7 కోట్లకు కొనుగోలు చేసింది. తక్కువ ధరకే అమ్ముడైన ఈ యంగ్ క్రికెటర్ ముంబై ఇండియన్స్‌కు మాత్రం పూర్తి న్యాయం చేస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ లేని లోటును తిలక్ వర్మ తీరుస్తున్నాడనే చెప్పొచ్చు. అందుకు ఉదాహరణ రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ అని చెప్పొచ్చు. 33 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులు చేసిన తిలక్ వర్మపై ప్రశంసల వర్షం కురిసింది. అంతకముందు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 22 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా రెండు మ్యాచ్‌లు కలిపి 172.91 స్ట్రైక్‌రేట్‌తో 83 పరుగులు సాధించాడు. తిలక్ వర్మ బ్యాటింగ్ చూసిన పలువురు టీమిండియా క్రికెటర్లు.. భవిష్యత్తులో కచ్చితంగా స్టార్ ఆటగాడిగా పేరు సంపాదిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయుష్ బదోని: Courtesy: IPL ఢిల్లీకి చెందిన ఆయుష్ బదోని వయసు 22 ఏళ్లు. 2018లో జరిగిన వేలంలో ఆయుష్ బదోనిని ఎవరు కొనుగోలు చేయలేదు. నాలుగేళ్ల క్రితమే అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన బదోని.. ఈసారి మాత్రం లక్నో సూపర్ జెయింట్స్‌కు రూ. 20 లక్షలకే అమ్ముడుపోయాడు. తక్కువ ధరకే అమ్ముడపోయినప్పటికి బదోని మాత్రం తన టాలెంటెడ్ బ్యాటింగ్‌తో ఇరగదీస్తున్నాడు. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయుష్ బదోని ఆరో నెంబర్ బ్యాట్స్‌మన్‌గా వచ్చాడు. అప్పటికి లక్నో స్కోరు 29/4.. సాధారణంగా ఇలాంటి పరిస్థితిలో అనుభవం లేని క్రికెటర్ చేతులెత్తేస్తాడు. కానీ బదోని అలా చేయలేదు. ఆరంభంలో కాస్త నిధానంగా ఆడిన బదోని.. దీపక్ హుడాతో సమన్వయం కుదరడంతో యథేచ్చగా బ్యాట్‌ను ఝులిపించాడు. 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పరాజయం పాలైంది.. కానీ బదోని మాత్రం సూపర్ హిట్ అయ్యాడు. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ తన బ్యాటింగ్‌తో ఆకటఉకున్నాడు. 3 ఇన్నింగ్స్‌లు కలిపి ఇప్పటివరకు 92 పరుగులు సాధించాడు. ఆయుష్ బదోని టాలెంట్ గుర్తించిన క్రెడిట్ మాత్రం టీమిండియా మాజీ క్రికెటర్ గంభీర్‌కే దక్కుతుంది. ప్రస్తుతం గంభీర్ లక్నో జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. లలిత్ యాదవ్: Courtesy: IPL ఐపీఎల్లో లలిత్ యాదవ్ అడుగుపెట్టి మూడు నాలుగేళ్లు అవుతున్నప్పటికి గుర్తింపు మాత్రం గతేడాది ఐపీఎల్ సీజన్లో వచ్చింది. ఆరంభం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న లలిత్ యాదవ్ జట్టులో కీలక ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్నాడు. మరోసారి నమ్మకముంచిన ఢిల్లీ క్యాపిటల్స్ లలిత్ యాదవ్‌ను రూ.65 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. ఈ క్రమంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న లలిత్ యాదవ్ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 38 బంతుల్లో 48 నాటౌట్ సంచలన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. ఆ తర్వాత గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌ఓ 22 బంతుల్లో 25 పరుగులు సాధించి.. ఓవరాల్‌గా రెండు మ్యాచ్‌ల్లో 73 పరుగులు సాధించాడు. -
ఆ ఆటగాడు పెను సంచలనం.. నాలుగేళ్ల క్రితం ట్వీట్ వైరల్
ఆయుష్ బదోని.. ఐపీఎల్ 2022లో పెను సంచలనం. లక్నో సూపర్ జెయింట్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయుష్ బదోని తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పరాజయం పాలైంది.. కానీ బదోని మాత్రం సూపర్ హిట్ అయ్యాడు. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 3 ఇన్నింగ్స్‌లు కలిపి ఇప్పటివరకు 92 పరుగులు సాధించాడు. ఇంత బాగా ఆడుతున్న ఆయుష్‌ను లక్నో రూ. 20 లక్షల బేస్‌ప్రైస్‌కే దక్కించుకుంది. కానీ ఇదే ఆయుష్ బదోని నాలుగేళ్ల క్రితం.. అంటే 2018లో జరిగిన ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా నిలిచాడు. అప్పటికి బదోని వయసు 18 ఏళ్లు మాత్రమే. కానీ బదోని ఆటను దృష్టిలో ఉంచుకొని నాలుగేళ్ల క్రితమే ఒక అభిమాని ట్వీట్ చేశాడు. వేలం జరిగిన రోజు ఆయుష్ బదోని అన్‌సోల్డ్ అని ఐపీఎల్ అధికారిక ట్విటర్ ప్రకటించింది. ఇది చూసిన ఒక అభిమాని.. '' మీరు చాలా తప్పు చేశారు. ఆయుష్ బదోనిలో మంచి టాలెంట్ ఉంది.. రానున్న రోజుల్లో తర్వాతి ఏబీ డివిలియర్స్.. ఏదో ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ అతన్ని కొనుగోలు చేయండి.. మంచి టాలెంటెడ్ ఆటగాడిని మిస్ చేసుకున్నారు.'' అంటూ రీట్వీట్ చేశాడు. కట్‌చేస్తే.. ఈ సీజన్లో టీమిండియాకు లభించిన టాలెంటెడ్ ఆటగాళ్లలో ఆయుష్ బదోని ఒకడిగా నిలిచాడు. అయితే బదోనిపై ఒక అభిమాని నాలుగేళ్ల క్రితం చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా గౌతమ్ గంభీర్ ఉన్నాడు. అతని అండలో ఆయుష్ బదోని మరింత మెరుగయ్యే పనిలో ఉన్నాడు.ఇక ఢిల్లీకి చెందిన ఆయుష్ బదోని.. భారత అండర్-19 జట్టు తరఫున సత్తాచాటి వెలుగులోకి వచ్చాడు. శ్రీలంకతో జరిగిన ఓ మ్యాచ్‌లో 202 బంతుల్లో 185 పరుగులు చేసిన బదోని.. బౌలింగ్‌లోనూ 9.3 ఓవర్లు వేసి కేవలం 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. చదవండి: CSK Vs LSG: బదోని భారీ షాట్... అమ్మ బాబోయ్.. ఆమె తలపగిలేదేమో! Devon Conway: ఒక్క మ్యాచ్‌కే పక్కనబెట్టారు.. దిగ్గజ ఆటగాడిని గుర్తుచేస్తూ! -
IPL 2022: ఆ షాట్ ఏంటి బదోని.. కొంచమైతే ఆమె తలపగిలేది!
IPL 2022 CSK Vs LSG: ఐపీఎల్లో తమ జట్టు తొలి విజయం నమోదు చేయాలంటే చివరి రెండు ఓవర్లలో 34 పరుగులు చేయాలి.. ఇలాంటి సమయంలో తమ బేబీ ఏబీ డివిల్లియర్స్ క్రీజులో ఉన్నాడని కెప్టెన్ రాహుల్‌కు ధీమా.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 9 బంతుల్లో కీలకమైన 19 పరుగులు రాబట్టి అజేయంగా నిలిచాడు లక్నో సూపర్‌జెయింట్స్ ‘బేబీ ఏబీ’ ఆయుష్ బదోని. తద్వారా జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక 19వ ఓవర్ తొలి బంతికి బదోని కొట్టిన భారీ షాట్ క్రికెట్ ప్రియులను అలరించింది. చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు కెప్టెన్ రవీంద్ర జడేజా శివమ్ దూబేను రంగంలోకి దించగా.. అతడి బౌలింగ్‌లో తొలి బంతినే సిక్స్‌గా మలిచాడు బదోని. దూబే షార్ట్ బాల్ సంధించగా... డీప్ స్క్వేర్ లెగ్ దిశగా షాట్ ఆడాడు. అయితే, బదోని ముచ్చటైన ఆట తీరును ఆస్వాదిస్తున్న వేళ ఓ అనూహ్య సంఘటన జరిగింది. స్టేడియంలో కూర్చుని మ్యాచ్ వీక్షిస్తున్న ఓ మహిళ తలకు బంతి తగిలింది. దీంతో ఆమె పక్కనున్న వాళ్లంతా కాస్త కంగారు పడ్డారు. అయితే ఆమె ఫర్వాలేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆమె సీఎస్కేకు మద్దతుగా ఎల్లో జెర్సీ ధరించినట్లు కనిపిస్తుండటంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘అయ్యో పాపం ఆ లేడీ! తల పగిలేదేమో! ఏంటి బదోని గెలవాలన్న కసితో మంచి షాట్ ఆడావు.. కానీ ఆమెకు ఏమైనా అయ్యుంటే నీ తప్పు లేకపోయినా కాస్త బాధపడాల్సి వచ్చేది కదా! ఏదేమైనా మీరు తొలి విజయం అందుకున్నారు. కంగ్రాట్స్’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్.. చెన్నైపై 6 వికెట్ల తేడాతో గెలుపొంది క్యాష్ రిచ్ లీగ్‌లో తొలిసారిగా గెలుపు రుచి చూసింది. 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗪𝗜𝗡! 👌 👌 A mighty batting performance from @LucknowIPL to seal their maiden IPL victory. 👏 👏 #TATAIPL | #LSGvCSK Scorecard ▶️ https://t.co/uEhq27KiBB pic.twitter.com/amLhbG4w1L — IndianPremierLeague (@IPL) March 31, 2022 This six from bidoni injured a lady in crowd #CSKvLSG pic.twitter.com/ppzRTvm3Lf — timeSquare🇮🇳 (@time__square) March 31, 2022 చదవండి: IPL 2022: కేఎల్ రాహుల్ ఎంత పని జరిగే.. వీడియో వైరల్