ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024లో సంచలనం నమోదైంది. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదాడు. ఈ లీగ్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్‌తో మ్యాచ్‌లో ప్రియంష్ ఈ ఘనత సాధించాడు.
సౌత్ ఢిల్లీ ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన స్పిన్నర్ మనన్ భరద్వాజ్ బౌలింగ్‌లో ప్రియంష్ వరుసగా 6 సిక్స్‌లు బాదాడు. ఆ ఓవర్‌లో తొలి బంతిని లాంగ్ ఆఫ్ మీదగా సిక్స్ బాదిన ప్రియాంష్.. రెండవ బంతిని డీప్ మిడ్ వికెట్ దిశగా స్టాండ్స్‌లోకి పంపించాడు. ఆ తర్వాతి నాలుగు బంతులను కూడా ఆర్య సిక్సర్లగా మలిచాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును ప్రియంష్ ఆర్య తన పేరిట లిఖించుకున్నాడు. ఓకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన మూడో భారత క్రికెటర్‌గా ప్రియాంష్ నిలిచాడు. అంతకుముందు రవిశాస్త్రి, యువరాజ్ సింగ్ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదారు.
ఇక ఈ మ్యాచ్‌లో ప్రియాంష్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 50 బంతులు ఎదుర్కొన్న ఆర్య.. 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో 120 పరుగులు సాధించాడు. అతడితో పాటు మరో ఢిల్లీ సూపర్ స్టార్జ్ ఆటగాడు ఆయూష్ బదోనీ కూడా భారీ సెంచరీతో మెరిశాడు.
కేవలం 55 బంతుల్లో 8 ఫోర్లు, 19 సిక్స్‌లతో 165 పరుగులు చేశాడు. వీరిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్‌ల ఫలితంగా సౌత్ ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
చదవండి: నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన సఫారీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment