ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024లో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ కెప్టెన్ ఆయుష్ బదోని విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్‌లో భాగంగా నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో బదోని చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఈ యువ సంచలనం ఊచకోత కోశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్టేడియం నలుమూలులా సిక్సర్ల బాదుతూ తన విశ్వరూపాన్ని బదోని చూపించాడు. ఈ క్రమంలో కేవలం 39 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో కేవలం 55 బంతులు మాత్రమే ఎదుర్కొన్న బదోని 8 ఫోర్లు, 19 సిక్స్‌లతో ఏకంగా 165 పరుగులు చేశాడు. అతడితో పాటు ఓపెనర్ ప్రియాంష్ ఆర్య విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 50 బంతులు ఎదుర్కొన్న ఆర్య.. 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో 120 పరుగులు సాధించాడు.
దీంతో సౌత్ ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 309 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులే చేసింది. దీంతో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ 112 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
అంతా గంభీర్ వల్లే..
ఆయుష్ బదోని సక్సెస్ వెనక టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఉన్నాడనే చెప్పకోవాలి. బదోని కెరీర్ ఎదుగుదలలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు బదోని ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
2022 సీజన్‌లో ఈ క్యాష్ రిచ్ లీగ్‌లోకి బదోని అడుగుపెట్టాడు. అయితే ఇదే సమయంలో లక్నో మెంటార్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతీ.. తన అనుభవంతో బదోనిని రాటుదేల్చాడు. కాగా లక్నో జట్టులోకి బదోని రావడానికి గల కారణం కూడా గౌతీనే.
ఐపీఎల్‌లో వేలంలో అతడి సలహా మెరకే బదోనిని లక్నో ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. రెండు సీజన్ల పాటు లక్నో మెంటార్‌గా కొనసాగిన గంభీర్.. బదోనికి ఎంతో సపోర్ట్‌గా నిలిచాడు. ఈ విషయాన్ని చాలా సందర్బాల్లో అయూష్ సైతం ధ్రువీకరించాడు. గంభీర్‌కు తనకు పెద్దన్న లాంటి వాడని అయూష్ పలుమార్లు చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment