
ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో భారత-ఎ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం అల్ అమెరత్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ విజయంతో ఇండియా తమ సెమీఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆయుష్ బదోని సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ఆయుష్ బౌండరీ లైన్ వద్ద తన అద్బుత విన్యాసంతో అందరిని ఆశ్చర్యపరిచాడు. యూఏఈ ఇన్నింగ్స్ 15 ఓవర్ వేసిన రమణదీప్ సింగ్ ఆఖరి బంతిని జవదుల్లాకు లెగ్ స్టంప్ లైన్ దిశగా ఫుల్ డెలివరీగా సంధించాడు.
ఈ క్రమంలో జవదుల్లా తన ఫ్రంట్ ఫుట్‌ను క్లియర్ చేసి లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడాడు. షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో బంతి కచ్చితంగా బౌండరీకి పోతుందని అంతా భావించారు. కానీ బౌండరీ లైన్ వద్ద ఉన్న బదోని అందరి అంచనాలను తారుమారు చేశాడు.
వైడ్ లాంగ్-ఆన్ పొజిషన్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన బదోని.. గాలిలో డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
చదవండి: ఐపీఎల్ వల్లే నాశనం.. ఆ సిరీస్ ఎందుకు దండగ?
𝐅𝐥𝐢𝐠𝐡𝐭 𝐦𝐨𝐝𝐞 🔛
A super catch by Ayush Badoni! 👐@BCCI#MensT20EmergingTeamsAsiaCup2024 #ACC pic.twitter.com/imOQae1Xu6— AsianCricketCouncil (@ACCMedia1) October 21, 2024