
ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో రెండో వన్డేలో టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్‌తో అందరిని ఆశ్చర్యపరిచాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 34 ఓవర్ వేసిన స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో.. కరుణరత్నే పాయింట్ దిశగా కట్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ పటేల్ ఎడమవైపు డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు.
దీంతో 17 పరుగులు చేసిన కరుణరత్నే నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం అక్షర్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. భారత బౌలర్లు చెలరేగడంతో 215 పరుగులకే ఆలౌటైంది.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, సిరాజ్ చెరో మూడు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. ఉమ్రాన్ మాలిక్ రెండు, అక్షర్ ఒక్క వికెట్ సాధించారు. ఇక లంక బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాడు నువానీడు ఫెర్నాండో(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కుశాల్ మెండిస్(34), డివెల్లలాగే(32) పరుగులతో రాణించారు.
Sharp catch alert 💥@akshar2026 dives to his left and takes a fine catch as @umran_malik_01 gets his second wicket 👌👌#TeamIndia | #INDvSL | @mastercardindia pic.twitter.com/R4bJoPXNM3
— BCCI (@BCCI) January 12, 2023
చదవండి: Virat Kohli: ఇదెలా సాధ్యమైంది? కోహ్లి షాకింగ్ ఎక్స్‌ప్రెషన్.. వైరల్
Comments
Please login to add a commentAdd a comment