వారెవ్వా గిల్‌.. క్రికెట్‌ చరిత్రలోనే సూపర్‌ క్యాచ్‌! వీడియో వైరల్‌ | Shubman Gill grasps stunner to help India draw first blood in Dharamsala Test | Sakshi
Sakshi News home page

IND vs ENG: వారెవ్వా గిల్‌.. క్రికెట్‌ చరిత్రలోనే సూపర్‌ క్యాచ్‌! వీడియో వైరల్‌

Published Thu, Mar 7 2024 11:24 AM | Last Updated on Thu, Mar 7 2024 1:03 PM

Shubman Gill grasps stunner to help India draw first blood in Dharamsala Test  - Sakshi

PC: Cric Tracker

ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌- భారత్‌ మధ్య ఆఖరి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే మొదటి రోజు ఆటలో భారత యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు. ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌లో కుల్దీప్‌ యాదవ్‌ ఆరో డెలివరీని బెన్‌ డకెట్‌కు గుగ్లీగా సంధించాడు.  ఈ క్రమంలో డకెట్‌ లాంగ్‌ ఆఫ్‌ మీదగా భారీ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు.

కానీ షాట్‌ సరిగ్గా కనక్ట్‌కాకపోవడంతో ఎక్స్‌ట్రా కవర్స్‌ దిశగా బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో కవర్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న శుబ్‌మన్‌ గిల్‌ పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్‌ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే భారత ఆటగాళ్లంతా గిల్‌ దగ్గరకు వెళ్లి అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్‌మీడియాలో సైతం గిల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement