Courtesy: IPL/BCCI
ఆయుష్ బదోని.. ఐపీఎల్ 2022లో పెను సంచలనం. లక్నో సూపర్ జెయింట్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయుష్ బదోని తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పరాజయం పాలైంది.. కానీ బదోని మాత్రం సూపర్ హిట్ అయ్యాడు. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 3 ఇన్నింగ్స్‌లు కలిపి ఇప్పటివరకు 92 పరుగులు సాధించాడు. ఇంత బాగా ఆడుతున్న ఆయుష్‌ను లక్నో రూ. 20 లక్షల బేస్‌ప్రైస్‌కే దక్కించుకుంది.
కానీ ఇదే ఆయుష్ బదోని నాలుగేళ్ల క్రితం.. అంటే 2018లో జరిగిన ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా నిలిచాడు. అప్పటికి బదోని వయసు 18 ఏళ్లు మాత్రమే. కానీ బదోని ఆటను దృష్టిలో ఉంచుకొని నాలుగేళ్ల క్రితమే ఒక అభిమాని ట్వీట్ చేశాడు. వేలం జరిగిన రోజు ఆయుష్ బదోని అన్‌సోల్డ్ అని ఐపీఎల్ అధికారిక ట్విటర్ ప్రకటించింది. ఇది చూసిన ఒక అభిమాని.. '' మీరు చాలా తప్పు చేశారు. ఆయుష్ బదోనిలో మంచి టాలెంట్ ఉంది.. రానున్న రోజుల్లో తర్వాతి ఏబీ డివిలియర్స్.. ఏదో ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ అతన్ని కొనుగోలు చేయండి.. మంచి టాలెంటెడ్ ఆటగాడిని మిస్ చేసుకున్నారు.'' అంటూ రీట్వీట్ చేశాడు.
కట్‌చేస్తే.. ఈ సీజన్‌లో టీమిండియాకు లభించిన టాలెంటెడ్ ఆటగాళ్లలో ఆయుష్ బదోని ఒకడిగా నిలిచాడు. అయితే బదోనిపై ఒక అభిమాని నాలుగేళ్ల క్రితం చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా గౌతమ్ గంభీర్ ఉన్నాడు. అతని అండలో ఆయుష్ బదోని మరింత మెరుగయ్యే పనిలో ఉన్నాడు.ఇక ఢిల్లీకి చెందిన ఆయుష్ బదోని.. భారత అండర్-19 జట్టు తరఫున సత్తాచాటి వెలుగులోకి వచ్చాడు. శ్రీలంకతో జరిగిన ఓ మ్యాచ్‌లో 202 బంతుల్లో 185 పరుగులు చేసిన బదోని.. బౌలింగ్‌లోనూ 9.3 ఓవర్లు వేసి కేవలం 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: CSK Vs LSG: బదోని భారీ షాట్... అమ్మ బాబోయ్.. ఆమె తలపగిలేదేమో!
Devon Conway: ఒక్క మ్యాచ్‌కే పక్కనబెట్టారు.. దిగ్గజ ఆటగాడిని గుర్తుచేస్తూ!
Comments
Please login to add a commentAdd a comment