IPL 2022: Ayush Badoni Virat Kohli Style Celebration After Smashing Winning Runs - Sakshi
Sakshi News home page

IPL 2022: కోహ్లి స్టైల్లో బదోని సెలబ్రేషన్స్‌.. వీడియో వైరల్‌

Published Fri, Apr 8 2022 12:42 PM | Last Updated on Fri, Apr 8 2022 5:17 PM

Ayush Badoni Virat Kohli Style Celebration After Smashing Winning runs - Sakshi

Courtesy: IPL Twitter

ఆయుష్‌ బదోని ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఒక యువ సంచలనం. ఐపీఎల్‌-2022లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బదోని తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు లక్నో సాధించిన ప్రతీ విజయంలోను బదోని తన వంతు పాత్ర పోషించాడు. ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీ సాధించి తన సత్తా ఎంటో చూపించాడు. కాగా గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే లక్నో విజయానికి మూడు బంతుల్లో ఒక్క పరగు కావల్సిన నేపథ్యంలో.. బదోని సిక్స్‌ బాది లక్నోకు విజయాన్ని అందించాడు.

ఈ క్రమంలో బదోని.. కోహ్లి స్టైల్లో విన్నింగ్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకున్నాడు. అతడు తన జెర్సీ వెనుక  భాగంలో ఉన్న తన పేరును చూపిస్తూ సెలబ్రేషన్స్‌ జరుపుకున్నాడు. గతంలో కోహ్లి కూడా ఇదే విధంగా సెలబ్రేషన్స్‌ జరపుకునే వాడు. ఇక ఈ మ్యాచ్‌లో మూడు బంతులు ఎదర్కొన్న బదోని 10 పరుగులు సాధించాడు. బదోని సెలబ్రేషన్స్‌కు సంబందించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. "కింగ్‌ కోహ్లిని బదోని ఆదర్శంగా తీసుకున్నాడు" అని కామెంట్స్‌ చేస్తున్నారు.

చదవండి: IPL 2022: 10 కోట్లకు అమ్ముడుపోతాడనుకున్నా! ఏదేమైనా లక్నోది సరైన నిర్ణయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement