Riyan Parag: ఐపీఎల్-2023లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. గత సీజన్ (2022) నుంచే చెత్తగా ఆడుతున్న ఈ ఓవరాక్షన్ ఆటగాడు.. గుజరాత్‌తో ఇవాళ (మే 5) జరుగుతున్న మ్యాచ్‌లో 6 బంతుల్లో 4 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన రియాన్ ఒక్క మ్యాచ్‌లో కూడా కనీసం 20 పరుగుల స్కోర్‌ను దాటలేకపోయాడు.
సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 7 (6), పంజాబ్‌పై 20 (12), ఢిల్లీపై 7 (11), గుజరాత్‌పై 5 (7), లక్నోపై 15 నాటౌట్ (12) పరుగులు చేశాడు. మొత్తంగా ఈ సీజన్‌లో రియాన్ 6 మ్యాచ్‌ల్లో కేవలం 58 పరుగులు మాత్రమే చేశాడు. పైగా గుజరాత్‌తో ఇవాల్టి మ్యాచ్‌లో రాజస్థాన్ యాజమాన్యం ఇతగాడిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించింది. ఈ మ్యాచ్‌లో రియాన్ విఫలం కావడంతో రాజస్థాన్ అభిమానులు ఏకీ పారేస్తున్నారు. ఈ ఓవరాక్షన్ ఆటగాడిని ఎందుకు ఆడించారు.. పైగా ఇతను ఇంపాక్ట్ ప్లేయర్ అట అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.
వీడికి ఆట తక్కువ ఓవరాక్షన్ ఎక్కువ అంటూ బండ బూతులు తిడుతున్నారు. ఏదో పొడుస్తాడని రాజస్థాన్ యాజమాన్యం ఇతనిపై 3.8 కోట్లు పెట్టుబడి పెట్టిందని, వెంటనే ఇతన్ని జట్టు నుంచి తీసిపారేయలని డిమండ్ చేస్తున్నారు. రియాన్ కంటే గల్లీలో ఆడుకునే చిన్న పిల్లలు నయమంటూ ఉతికి ఆరేస్తున్నారు. ఓ పక్క జట్టు మొత్తం విఫలమైన నెటిజన్లు రియాన్‌నే ఎక్కువగా టార్గెట్ చేశారు.
కాగా, సొంత మైదానంలో (జైపూర్) గుజరాత్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. గుజరాత్ బౌలర్ల ధాటికి 17.5 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, నూర్ అహ్మద్ 2, షమీ, హార్ధిక్, జాషువ లిటిల్ తలో వికెట్ పడగొట్టారు. రాజస్ణాన్ ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment