IPL 2023 mini auction: 991 Players Register, Check Details - Sakshi
Sakshi News home page

IPL Mini Auction: వేలంలో 991 మంది క్రికెటర్లు! పాపం.. టీమిండియా ఆటగాళ్లు.. కనీసం 2 కోట్లు కూడా!

Published Fri, Dec 2 2022 11:02 AM | Last Updated on Fri, Dec 2 2022 11:52 AM

IPL 2023: 991 players register for the auction - Sakshi

ఐపీఎల్‌-2023 మినీ వేలం డిసెంబర్‌ 23న కొచ్చి వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆక్షన్‌లో పాల్గొనేందుకు ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్‌ చేయడానికి గడువు నవంబర్‌ 30తో ముగిసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ మినీ వేలంలో 991 ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిసింది.

అందులో 714 భారత ఆటగాళ్లు, 277 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. అదే విధంగా ఈ ఆటగాళ్ల జాబితాలో 185  మంది జాతీయ క్రికెటర్లు, 786 మంది ఫస్ట్‌క్లాస్‌, 20 మంది అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు.  991 మంది ఆటగాళ్ల లిస్టులో 21 మంది తమ బేస్‌ప్రైజ్‌ రూ. 2 కోట్లగా నమోదు చేసుకున్నారు. కాగా 21 మంది జాబితాలో ఒక్క భారత ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం.

ధర తగ్గించిన రహానే, ఇషాంత్ శర్మ
కాగా ఈ సారి మినీవేలంలో 19 మంది టీమిండియా ఆటగాళ్లు భాగం కానున్నారు. వారిలో అజింక్యా రహానే, మయాంక్ అగర్వాల్, ఇషాంత్‌ శర్మ వంటి ప్లేయర్లు ఉన్నారు. అయితే రహానే, ఇషాంత్‌  ఈ సారి తమ బేస్‌ ప్రైస్‌ను భారీగా తగ్గించారు. ఈ ఏడాది మెగా వేలంలో కోటి రూపాయలును కనీస ధరగా ఉంచిన రహానే.. ఇప్పుడు దాన్ని రూ. 50 లక్షలకు తగ్గించాడు.

మయాంక్‌ పరిస్థితి మరీ దారుణం
అదే విధంగా ఇషాంత్‌ కూడా తన బేస్‌ ప్రైస్‌ను రూ. 75లక్షలుగా నిర్ణయించుకున్నాడు. ఇక గతేడాది లక్నో సూపర్‌జెయింట్స్‌ రాకతో కేఎల్‌ రాహుల్‌ తమ జట్టును వీడటంతో పంజాబ్‌ కింగ్స్‌ మయాంక్ అగర్వాల్‌ను కెప్టెన్‌గా నియమించుకుంది. అతడి కోసం 14 కోట్లు ఖర్చు పెట్టింది. అయితే, కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అతడు విఫలం కావడంతో ఇటీవలే మయాంక్‌ను రిలీజ్‌ చేసింది. దీంతో ఇప్పుడు మినీ వేలంలో మయాంక్‌ తన కనీస ధరను కోటి రూపాయలుగా ప్రకటించడం గమనార్హం.

2 కోట్లు బేస్‌ ప్రైస్‌ ఉన్న ఆటగాళ్లు వీరే
నాథన్ కౌల్టర్-నైల్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, క్రిస్ లిన్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, జామీ ఓవర్‌టన్, క్రెయిగ్ ఓవర్‌టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, కేన్ విలియమ్సన్, రిలీ రోసోవ్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఏంజెలో మాథ్యూస్, నికోలస్ పూరన్, జాసన్ హోల్డర్

1.5 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ప్లేయర్స్
సీన్ అబోట్, రిలే మెరెడిత్, ఝే రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా, షకీబ్ అల్ హసన్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, డేవిడ్ మలన్, జాసన్ రాయ్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్

కోటి కనీస ధర కలిగిన ఆటగాళ్లు
మయాంక్ అగర్వాల్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహమాన్, మోయిసెస్ హెన్రిక్స్, ఆండ్రూ టై, జో రూట్, ల్యూక్ వుడ్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, మార్టిన్ గప్టిల్, కైల్ జామీసన్, మాట్ హెన్రీ, డారిన్ మిచెల్, టామ్‌ లాథమ్‌, హెన్రిచ్‌ క్లాసెన్, తబ్రైజ్ షమ్సీ, కుశల్ పెరెరా, రోస్టన్ చేజ్, రఖీమ్ కార్న్‌వాల్, షాయ్ హోప్, అకేల్ హోస్సేన్, డేవిడ్ వైస్
చదవండి: Pak Vs Eng: పాక్‌కు దిమ్మతిరిగేలా ఇంగ్లండ్‌ ప్రపంచ రికార్డు! టీమిండియాను వెనక్కినెట్టి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement