ఐపీఎల్-2023 మినీవేలం సమయం దగ్గరపడడంతో ఆయా ప్రాంఛైజీలు తమ వ్యూహాలను రచించేందుకు సిద్దమవుతున్నాయి. మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చి వేదికగా జరగనుంది. ఇక ఈ వేలంలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్‌ను రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
రాజస్తాన్ జట్టులో బట్లర్, శాంసన్, పడిక్కల్ వంటి అద్భుతమైన బ్యాటర్లు ఉన్నప్పటికీ.. ఆల్‌రౌండర్ల లోపం మాత్రం సృష్టంగా ఈ ఏడాది సీజన్‌లో కన్పించింది. ఈ నేపథ్యంలో హోల్డర్ వంటి విధ్వంసక ఆల్‌రౌండర్‌ను జట్టులోకి తీసుకోవాలని రాజస్తాన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ ఏడాది సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున హోల్డర్ ఆడాడు. కానీ మినీవేలంకు ముందు లక్నో హోల్డర్‌ను విడిచిపెట్టింది. ఐపీఎల్-2022లో 12 మ్యాచ్‌లు ఆడిన హోల్డర్ 14 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్-2023 మినీవేలంకు ముందు రాజస్తాన్ రాయల్స్ 16 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. 9 మంది ప్లేయర్స్‌ను వేలంలోకి విడిచిపెట్టింది. ప్రస్తుతం రాజస్తాన్ పర్స్‌లో రూ. 13.2 కోట్లు ఉన్నాయి.
రాజస్తాన్ రిటైన్ లిస్ట్
సంజు శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్‌కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్
రాజస్తాన్ విడిచిపెట్టిన జాబితా
అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, శుభమ్ గర్వాల్, తేజస్ బరోకా
చదవండి: IND Vs BAN: బంగ్లాదేశ్‌తో రెండో వన్డే.. రాహుల్ త్రిపాఠి అరంగేట్రం! తుది జట్టు ఇదే?
Comments
Please login to add a commentAdd a comment