PC: BCCI/IPL
IPL 2023 Mini Auction- Purse: కొచ్చి వేదికగా ఐపీఎల్ మినీ వేలం-2023 శుక్రవారం(డిసెంబరు 23) జరుగనుంది. క్యాష్ రిచ్ లీగ్ ఆక్షన్‌లో పాల్గొనేందుకు మొత్తంగా 991 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకోగా.. 405 ప్లేయర్ల పేర్లు షార్ట్‌లిస్ట్ జాబితాలో చేరాయి. 10 ఫ్రాంఛైజీలలో ఉన్న 87 ఖాళీల భర్తీకి శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ వేలం మొదలుకానుంది.
కాగా ఆక్షన్‌లో పాల్గొనే ఫ్రాంఛైజీలలో సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్సులో అత్యధికంగా 42.25 కోట్ల రూపాయలు ఉన్నాయి. రిటైన్ చేసుకున్న ఆటగాళ్లకు చెల్లించే మొత్తం పోను ఈ మేర డబ్బు మిగిలి ఉంది. మరి మిగతా ఫ్రాంఛైజీల పర్సులో ఎంత మొత్తం ఉందంటే?!
కోల్‌కతా పర్సులో అత్యల్పంగా..
►ముంబై ఇండియన్స్: రూ. 20.55 కోట్లు
►చెన్నై సూపర్‌కింగ్స్: రూ. 20.45 కోట్లు
►ఢిల్లీ క్యాపిటల్స్: రూ. 19.45 కోట్లు
►రాజస్తాన్ రాయల్స్: రూ. 13.2 కోట్లు
►లక్నో సూపర్‌జెయింట్స్: రూ. 23.35 కోట్లు
►రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రూ. 8.75 కోట్లు
►గుజరాత్ టైటాన్స్: రూ. 19.25 కోట్లు
►కోల్‌కతా నైట్‌రైడర్స్: రూ. 7.05 కోట్లు(అత్యల్పం)
►పంజాబ్ కింగ్స్: రూ. 32.2 కోట్లు
చదవండి: IPL 2023 Retention: స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే!
డబుల్ సెంచరీతో చెలరేగిన రహానే.. రెండో ద్విశతకం! టీమిండియాలో చోటు ఖాయమంటూ..
Comments
Please login to add a commentAdd a comment