కేన్ విలియమ్సన్ (PC: IPL/BCCI)
IPL 2023: ‘‘నా సహచర ఆటగాళ్లు, ఫ్రాంఛైజీ, సహాయక సిబ్బంది.. ముఖ్యంగా అద్బుతమైన ఆరెంజ్ ఆర్మీ... అందరికీ ధన్యవాదాలు. నా ఎనిమిదేళ్ల ప్రయాణాన్ని మీరంతా కలిసి పూరిపూర్ణం చేశారు. ఈ జట్టు.. ముఖ్యంగా హైదరాబాద్ నాకెల్లప్పుడూ ప్రత్యేకమే’’ అంటూ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ భావోద్వేగ నోట్ షేర్ చేశాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ కేన్ మామ ఉద్వేగానికి లోనయ్యాడు.
కేన్‌కు గుడ్ బై
ఐపీఎల్-2023 మినీ వేలం నేపథ్యంలో మంగళవారం ఆయా ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే, వదిలేసే ఆటగాళ్ల పేర్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా సేవలు అందించిన కేన్ విలియమ్సన్‌కు ఉద్వాసన పలికింది యాజమాన్యం. గత వేలంలో 14 కోట్ల భారీ ధరకు ఈ కివీస్ సారథిని సొంతం చేసుకుంది ఫ్రాంఛైజీ.
అయితే, కేన్ మామ సారథ్యంలోనూ అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయింది. ఇందుకు తోడు గత కొంతకాలంలో పొట్టి ఫార్మాట్‌లో విలియమ్సన్ విఫలమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన ప్రపంచకప్-2022 టోర్నీలోనూ తన స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డాడు.
బ్యాటర్‌గానూ, కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలు సాధించినా అసలైన సెమీస్ పోరులో కేన్ బృందం పాకిస్తాన్ చేతిలో ఓడి ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ అతడిని రిలీజ్ చేయడం గమనార్హం.
నాకు ముందే తెలుసు
ఈ విషయంపై స్పందించిన కేన్ విలియమ్సన్.. సన్‌రైజర్స్ తనను విడిచిపెడుతుందని తనకు ముందే తెలుసునన్నాడు. ఈ మేరకు ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలో చాలా లీగ్‌లు ఉన్నాయి. అయితే వాటిలో ఐపీఎల్ ప్రత్యేకమైనది. అందులో నేనూ భాగం కావడం సంతోషంగా ఉంది.
అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆటగాళ్లు ఉంటారు. కావాల్సినన్ని ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. నావరకైతే నేను అన్ని ఫార్మాట్లలో ఆడటానికి ఇష్టపడతాను. రిలీజ్ విషయం గురించి యాజమాన్యం నాతో ముందే మాట్లాడింది. కాబట్టి ఫ్రాంఛైజీ తమ రిటెన్షన్ జాబితా అధికారికంగా ప్రకటించినపుడు నేను ఆశ్చర్యపడలేదు’’ అని కేన్ విలియమ్సన్ పేర్కొన్నాడు.
కాగా కేన్‌ను రిలీజ్ చేస్తూ.. ‘‘ఎల్లప్పుడూ మా కేన్ మామ’’ అంటూ సన్‌రైజర్స్ ట్విటర్ వేదికగా అతడి సేవలకు ధన్యవాదాలు చెప్పగా.. విలియమ్సన్ సైతం హైదరాబాద్‌తో తనకు విడదీయరాని అనుబంధం ఉందని సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకోవడం విశేషం. ఇక వచ్చే నెల 23న కొచ్చిలో ఐపీఎల్ మినీ వేలం జరుగనుంది. ఇదిలా ఉంటే కేన్ విలియమ్సన్ సారథ్యంలో కివీస్ టీమిండియాతో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది.
చదవండి: Michael Vaughan: వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫేవరెటా..? నాన్సెన్స్..!
India tour of New Zealand: టీమిండియా న్యూజిలాండ్ పర్యటన.. పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, ఇతర వివరాలు
Always our Kane Mama! 🧡#SunRisersHyderabad #OrangeArmy pic.twitter.com/UkieccM3yP
— SunRisers Hyderabad (@SunRisers) November 15, 2022
Comments
Please login to add a commentAdd a comment