దసున్ షనక- హార్దిక్ పాండ్యా
IPL 2023 Mini Auction- India vs Sri Lanka: శ్రీలంక కెప్టెన్ దసున్ షనక పొట్టి ఫార్మాట్‌లో దుమ్ములేపుతున్నాడు. ఆసియా కప్ టీ20 టోర్నీలో జట్టును విజేతగా నిలిపిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. టీమిండియాతో సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. వాంఖడేలో జరిగిన తొలి టీ20లో 27 బంతుల్లో 45 పరుగులు చేశాడు.
ఇక రెండో టీ20లో 22 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ ఆఖరి వరకు అజేయంగా నిలిచి సిక్సర్‌తో లంక ఇన్నింగ్స్‌ను ముగించాడు. అంతేకాదు.. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను దెబ్బకొట్టడంలో కీలక పాత్ర పోషించాడు.
ఆల్‌రౌండ్ ప్రతిభతో
31 బంతుల్లో 65 పరుగులతో మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పేలా కనిపించిన అక్షర్ పటేల్‌ను షనక పెవిలియన్‌కు పంపాడు. తీవ్ర ఉత్కంఠ రేపిన ఆఖరి ఓవర్లో తానే రంగంలోకి దిగి బంతిని అందుకున్నాడు. చివరి ఓవర్ మూడో బంతికి అక్షర్‌ను.. ఆఖరి బంతికి శివం మావిని అవుట్ చేశాడు.
ఇలా ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా మరోసారి తన విలువేంటో నిరూపించుకున్నాడు దసున్ షనక. కాగా టీమిండియా- శ్రీలంక టీ20 సిరీస్‌లో ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో అతడే టాప్ స్కోరర్ కావడం విశేషం.
మొత్తంగా రెండు టీ20ల్లో 101 పరుగులు(స్ట్రైక్‌రేటు 206.12) చేసిన 31 ఏళ్ల దసున్ షనక.. రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, లక్నో సూపర్‌జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఒక్కరి దగ్గరా డబ్బుండేది కాదు!
బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో చర్చ సందర్భంగా దసున్ షనకపై ప్రశంసలు కురిపించాడు. ‘‘నా దగ్గరైతే తనను కొనగలిగేంత డబ్బు లేదు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒకవేళ ఐపీఎల్ వేలానికి ముందు ఈ సిరీస్ జరిగి ఉంటేనా? ఒక్కసారి ఊహించుకోండి.. తను ఎంతటి భారీ ధరకు అమ్ముడుపోయేవాడో!
నాకు తెలిసి ఏ ఒక్క ఫ్రాంఛైజీ దగ్గర షనకను కొనుగోలు చేసేంత డబ్బు ఉండేది కాదనుకుంటున్నా’’ అని గౌతీ.. లంక సారథిని కొనియాడాడు. కాగా గత కొంతకాలంగా టీ20లలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న దసున్ షనక రూ. 50 లక్షల కనీస ధరతో ఐపీఎల్-2023 మినీ వేలంలోకి వచ్చాడు.
నిరాశే మిగిలింది!
అయితే, ఆశ్చర్యకరంగా ఒక్క ఫ్రాంఛైజీ కూడా అతడి పట్ల ఆసక్తి చూపకపోవడం గమనార్హం. దీంతో అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. కాగా డిసెంబరు 23న జరిగిన వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ 17.5 కోట్లకు అమ్ముడుపోయి చరిత్ర సృష్టించాడు.
చదవండి: ICC ODI WC 2023: ఆ ఇద్దరు వరల్డ్‌కప్ జట్టులో వద్దు! ‘చీఫ్ సెలక్టర్’గా చెబుతున్నా.. పంత్ ఉంటే..
Ind VS SL 3rd T20: భారీ స్కోర్లు గ్యారంటీ! అతడికి ఉద్వాసన.. రుతురాజ్ ఎంట్రీ!
Comments
Please login to add a commentAdd a comment