ఐపీఎల్-2023 సీజన్‌కు సంబంధించిన మినీ వేలానికి సమయం దగ్గరపడుతోంది. డిసెంబర్ 23న కొచ్చి వేదికగా ఈ మినీవేలం జరగనుంది. ఈ మినీ వేలంలో మొత్తం 991 మంది తమ పేర్లను రిజిస్టర్ చేసుకోగా.. 21 మంది ఆటగాళ్లు తమ బేస్ ప్రైస్ రూ.2 కోట్లగా నమోదు చేసుకున్నారు.
వారిలో ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్‌లు బెన్ స్టోక్స్, సామ్ కర్రాన్, ఆసీస్ యువ ఆటగాడు కామెరాన్ గ్రీన్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వంటి వారు ఉన్నారు. అయితే ఈ వేలంలో ముఖ్యంగా బెన్ స్టోక్స్, సామ్ కుర్రాన్ కోసం ప్రాంఛైజీలు పోటీపడే అవకాశం ఉంది.
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో వీరిద్దరూ అద్భుతంగా రాణించారు. ఇక మినీ వేలం నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ మినీ వేలంలో బెన్ స్టోక్స్‌ను లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేస్తుందని అశ్విన్ జోస్యం చెప్పాడు.
లక్నో సూపర్ జెయింట్స్‌లోకి స్టోక్స్!
"బెన్ స్టోక్స్‌ను కొనుగోలు చేసేందుకు లక్నో సూపర్ జెయింట్స్ ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. ఒక వేళ అతడిని దక్కించుకోకపోతే అప్పడు మాత్రమే ఇతర ఆటగాళ్ల కోసం ఆలోచిస్తారు. అదే విధంగా చెన్నై సూపర్ కింగ్స్ కూడా సామ్ కుర్రాన్ కోసం తొలుత ప్రయత్నిస్తారు.
ఒక వేళ కుర్రాన్‌ను వారు సొంతం చేసుకోపోతే అప్పడు బెన్ స్టోక్స్ కోసం కూడా పోటీపడతారు. వీరిద్దరి తర్వాత సీఎస్‌కే ఆలోచనలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ ఉంటాడు. అదే విధంగా విండీస్ విధ్వంసకర ఆటగాడు పూరన్ కూడా సీఎస్‌కే దృష్టిలో ఉండే అవకాశం ఉంది" అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IPL Mini Auction: రూ.2 కోట్ల కనీస ధర కలిగిన ఆటగాళ్లు వీరే! ఒక్క భారత క్రికెటర్ కూడా
Comments
Please login to add a commentAdd a comment