
ఐపీఎల్-2023కు సంబంధించిన మినీ వేలంలో మొత్తం 991 మంది తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. ఇందులో 714 మంది భారత క్రికెటర్లు, 277 మది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇక ఓవరాల్‌గా 21 మంది క్రికెటర్లు తమ కనీస ధర రూ. 2 కోట్లగా నమోదు చేసుకున్నారు. అయితే ఈ జాబితాలో భారత ఆటగాళ్లు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం.
అదే విధంగా మయాంక్ అగర్వాల్, మనీష్ పాండే వంటి భారత క్రికెటర్లు తమ బేస్ ప్రైస్ కోటి రూపాయలుగా రిజిస్టర్ చేయించుకున్నారు. రూ. 2 కోట్లు, 1.5 కోట్ల రూపాయలు బేస్ ప్రైస్ గా నమోదు చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ఓ సారి పరిశీలిద్దాం. కాగా ఐపీఎల్-2023 మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చి వేదికగా జరగనుంది.
2 కోట్లు బేస్ ప్రైస్ ఉన్న ఆటగాళ్లు వీరే
నాథన్ కౌల్టర్-నైల్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, క్రిస్ లిన్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, జామీ ఓవర్‌టన్, క్రెయిగ్ ఓవర్‌టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, కేన్ విలియమ్సన్, రిలీ రోసోవ్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఏంజెలో మాథ్యూస్, నికోలస్ పూరన్, జాసన్ హోల్డర్
1.5 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ప్లేయర్స్
సీన్ అబోట్, రిలే మెరెడిత్, జో రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా, షకీబ్ అల్ హసన్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, డేవిడ్ మలన్, జాసన్ రాయ్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్
కోటి కనీస ధర కలిగిన ఆటగాళ్లు
మయాంక్ అగర్వాల్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహమాన్, మోయిసెస్ హెన్రిక్స్, ఆండ్రూ టై, జో రూట్, ల్యూక్ వుడ్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, మార్టిన్ గప్టిల్, కైల్ జామీసన్, మాట్ హెన్రీ, డారిన్ మిచెల్, టామ్ లాథమ్, హెన్రిచ్ క్లాసెన్, తబ్రైజ్ షమ్సీ, కుశల్ పెరెరా, రోస్టన్ చేజ్, రఖీమ్ కార్న్‌వాల్, షాయ్ హోప్, అకేల్ హోస్సేన్, డేవిడ్ వైస్
చదవండి: IPL Mini Auction: వేలంలో 991 మంది క్రికెటర్లు! పాపం.. టీమిండియా ఆటగాళ్లు..
Comments
Please login to add a commentAdd a comment