కీరన్ పొలార్డ్ (PC: IPL/BCCI)
IPL 2023- Kieron Pollard- Mumbai Indians: వెస్టిండీస్ వెటరన్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్‌గా వెలుగొందిన కీరన్ పొలార్డ్ తన ఐపీఎల్ కెరీర్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తాను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆటగాడిగా కనిపించబోనంటూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్-2023 మినీ వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ అతడిని రిలీజ్ చేసిన నేపథ్యంలో ఈ మేరకు పోలీ సంచలన ప్రకటన చేశాడు.
అపురూప విజయాల్లో భాగమై
2010 నుంచి ముంబై ఫ్రాంఛైజీతో అనుబంధం కొనసాగిస్తున్న 35 ఏళ్ల పొలార్డ్.. ఐదుసార్లు టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా రికార్డు సృష్టించాడు. తన అద్భుత ప్రదర్శనతో జట్టుకు అనేక విజయాలు అందించాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో ఆటగాడిగా 13 ఏళ్ల తన విజయవంతమైన కెరీర్‌కు గుడ్ బై చెబుతూ మంగళవారం ప్రకటన చేశాడు.
అందరికీ ధన్యవాదాలు
ఈ మేరకు ట్విటర్‌లో భావోద్వేగ నోట్ షేర్ చేశాడు. ఆటగాడిగా ఐపీఎల్‌ను మిస్ అవుతానని.. 2013, 2015, 2017, 2019, 2020తో పాటు 2011 నాటి చాంపియన్స్ లీగ్ గెలవడం ఎన్నటికీ మర్చిపోలేనన్నాడు. తనకు ఇన్నాళ్లు సహకరించిన ముంబై యాజమాన్యానికి పొలార్డ్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. తన భార్య జెనా, తన ముగ్గురు పిల్లలకు కూడా కృతజ్ఞతలు చెప్పాడు.
ఓ బ్యాడ్ న్యూస్.. ఓ గుడ్ న్యూస్
తనకు సహకరించిన ముకేశ్, నీత, ఆకాశ్ అంబానీల పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్న పొలార్డ్... ముంబైతో తన బంధం ముగిసిపోలేదంటూ ఫ్యాన్స్‌కు ఓ శుభవార్త కూడా చెప్పాడు. ఐపీఎల్‌లో బ్యాటింగ్ కోచ్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నట్లు పొలీ ఈ సందర్భంగా వెల్లడించాడు.
అదే విధంగా ముంబై ఎమిరేట్స్ తరఫున ఆటగాడిగా బరిలోకి దిగుతానని స్పష్టం చేశాడు. తన నోట్‌ను ముగిస్తూ సిన్సియర్లీ కీరన్ పొలార్డ్.. ది ముంబై వెస్ట్ ఇండియన్ అంటూ అభిమానం చాటుకున్నాడు. తనని అభిమానిస్తున్న వాళ్లందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. కాగా పొలార్డ్‌ను ఇక ఐపీఎల్ ఆటగాడిగా చూడలేమా అంటూ ఫ్యాన్స్ ఉద్వేగానికి లోనవుతున్నారు. మిస్ యూ పోలీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక గత సీజన్‌లో పొలార్డ్ పూర్తిగా నిరాశపరిచిన విషయం తెలిసిందే.
💙 #OneFamily @mipaltan pic.twitter.com/4mDVKT3eu6
— Kieron Pollard (@KieronPollard55) November 15, 2022
🙏𝕋ℍ𝔼 𝕃𝕃𝕆ℝ𝔻 𝗛𝗔𝗦 𝗪𝗢𝗡 𝗜𝗧 𝗔𝗟𝗟 🏆#OneFamily #MumbaiIndians @KieronPollard55 pic.twitter.com/VPWTdWZEdH
— Mumbai Indians (@mipaltan) November 15, 2022
Comments
Please login to add a commentAdd a comment