ఐపీఎల్-2023 మినీ వేలంకు ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్లు జాబితాను మంగళవారం ప్రకటించాయి. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకుంది.
కాగా చెన్నై ఫ్రాంచైజీతో జడేజాకు విభేదాలు ఉన్నాయి అని, సీఎస్‌కేకు గుడ్‌బై చెప్పనున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జడేజాను సీఎస్‌కే రిటైన్ చేసుకుంటాందా లేదా అన్న ఆసక్తి ఆఖరి నిముషం వరకు కొనసాగింది.
అయితే జడ్డూను రిటైన్ చేసుకుని చెన్నై అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా జడేజాకు జట్టు మేనేజేమెంట్‌కు ధోని మధ్యవర్తిత్వం వహించిన్నట్లు తెలుస్తోంది. ధోని చొరవతోనే మళ్లీ జడేజాను రిటైన్ చేసుకున్నట్లు సమాచారం.
ఇక తనను మళ్లీ రిటైన్ చేసుకున్నాక జడేజా ట్విటర్ వేదికగా స్పందించాడు. "అంతా బాగానే ఉంది. రీస్టార్ట్" అంటూ ట్వీట్ చేశాడు. దీంతోపాటు సీఎస్‌కే జెర్సీ ధరించి ధోనికి సలాం చేస్తున్న ఫోటోను కూడా జడ్డూ షేర్ చేశాడు. జడేజా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
కాగా ఐపీఎల్-2022కు ముందు సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఎంస్ ధోని తప్పుకోవడంతో నూతన సారథిగా జడేజా ఎంపికయ్యాడు. అయితే సారథ్య బాధ్యతల చేపట్టిన జడేజా ఒత్తిడి కారణంగా టోర్నీ మధ్యలోనే.. తిరిగి ధోనికి అప్పగించేశాడు. అయితే ఈ ఏడాది సీజన్‌లో జడేజా దారుణంగా విఫలమయ్యాడు.
చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: ఎంఎస్ ధోని (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, సింఘ్‌ధర్, సింఘాధర్ , దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ
విడిచిపెట్టిన ఆటగాళ్లు: డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప, ఆడమ్ మిల్నే, హరి నిశాంత్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ, కెఎం ఆసిఫ్, నారాయణ్ జగదీశన్
మిగిలిన పర్స్ బ్యాలన్స్: రూ. 20.45 కోట్లు
Everything is fine💛 #RESTART pic.twitter.com/KRrAHQJbaz
— Ravindrasinh jadeja (@imjadeja) November 15, 2022
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్.. టీమిండియా ఓపెనర్‌గా సూర్యకుమార్
Comments
Please login to add a commentAdd a comment